దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాకు అవమానమే ఇది. ఎందుకంటే ఈ రోజు (డిసెంబర్ 16) నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతంది. ఒక్కోచోట ఒక్కో ఆచారమున్నట్లే తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో పెళ్లి కాని యువతలతో పాటు చాలామంది ప్రత్యేక పూజలు జరుపుకొంటారు. ఈ మాసం తొలిరోజున ఆండాళ్, తిరుప్పావై పట్టు వస్త్రాలు ధరించి రంగమన్నార్ స్వామితో దర్శనమిచ్చారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)
ఈ క్రమంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా.. ఆండాళ్‌ని దర్శించుకునేందుకు వేకునజామునే ఆలయానికి వచ్చారు. స్వామివారి దర్శనం చేసుకునేందుకు ఆండాళ్ గర్భగుడి ముందున్న మండపంలోకి ప్రవేశించే సమయంలో.. అక్కడే ఉన్న జీయర్ ఈయనని అడ్డుకున్నారు. దీంతో గర్భగుడి బయటే నిలబడి ఇళయరాజా పూజా చేసుకున్నారు.
అయితే శ్రీ విల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయ అర్థ మండపంలోకి ఇళయరాజాను రానివ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నో పాటల్లో స్వామిని కీర్తించిన సంగీత విద్వాంసుడికి దక్కిన గౌరవం ఇదేనా అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ విన్నర్‌గా నిఖిల్.. ప్రైజ్‌మనీతోపాటు ఏం సాధించాడంటే?)
SHOCKING: Ilaiyaraaja denied entry✖️ to Sanctum Sanctorum and asked to get out by the priests at Srivilliputhur Andal Temple🛕 pic.twitter.com/Aii7GQPg6k
— Manobala Vijayabalan (@ManobalaV) December 16, 2024
Comments
Please login to add a commentAdd a comment