సరైనోడు, దమ్మున్నోడు, జెంటిల్‌మెన్.. ఇలాంటి ట్యాగులన్నీ నిఖిల్‌కు సరిగ్గా సరిపోతాయి. ఎంత కోపం వచ్చినా అది క్షణకాలం మాత్రమే! వంద రోజుల జర్నీలో అతడు కంట్రోల్ తప్పిన సందర్భాలను వేళ్లపై లెక్కపెట్టుకోవచ్చు. ఎవరెన్ని నిందలు వేసినా తనలో తను బాధపడ్డాడే తప్ప తిరిగి ఒక్కమాట కూడా అనలేదు. ఫిజికల్ టాస్కుల విషయానికి వస్తే అతడిని ఢీ కొట్టేవాడే లేడన్నంతగా రెచ్చిపోయాడు.
నిందలు పడ్డ చోటే నిలబడ్డాడు
నిఖిల్ ఆటలో అడుగుపెడితే వార్ వన్‌సైడ్ అయిపోద్ది అన్న లెవల్‌లో ఆడాడు. ఈ క్రమంలో తనకు దెబ్బలు తగిలినా లెక్కచేయలేదు. కంటెస్టెంట్ల సూటిపోటి మాటల వల్ల హౌస్‌ను వీడాలనుకున్నాడు. కానీ తనను ప్రేమించిన ప్రేక్షకుల కోసం మాటలు పడ్డ చోటే నిలబడాలనుకున్నాడు. ఆటతోనే సమాధానం చెప్పాడు. వేలెత్తి చూపించినవారితోనే చప్పట్లు కొట్టేలా చేశాడు.
సంపాదన ఎంత?
సీరియల్ యాక్టర్‌గా పేరు గడించిన నిఖిల్ బిగ్‌బాస్ ప్రియుల మనసు గెలుచుకుని ఏకంగా టైటిల్ విజేతగా నిలిచాడు. రూ.55 లక్షల ప్రైజ్‌మనీ అందుకున్నాడు. దీనితోపాటు మారుతి డిజైర్ కారు అదనపు బహుమతిగా లభించనుంది. ఇకపోతే నిఖిల్ వారానికి రూ.2.25 లక్షల పారితోషికం తీసుకున్నాడట! ఈ లెక్కన పదిహేనువారాలకుగానూ రూ.33,75,000 సంపాదించినట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా రూ. 88 లక్షలు వెనకేశాడు.
Comments
Please login to add a commentAdd a comment