బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు నాగార్జున ఒక టీచర్‌లాగా! పొరపాట్లు చేస్తే సరిదిద్దుకోమని హెచ్చరిస్తాడు. మంచి చేస్తే చప్పట్లు కొడతాడు. బాధలో ఉంటే మోటివేట్ చేస్తాడు. సంతోషాన్ని నలుగురితో పంచుకోమంటాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నన్ని రోజులు కంటెస్టెంట్లకు గురువుగా, అండగా ఉండేది నాగార్జున ఒక్కరే!
గత సీజన్‌లో..
అయితే వీకెండ్‌లో నాగార్జున వేసుకొచ్చే షర్ట్స్‌కు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. పోయిన సీజన్‌లో షర్ట్ కావాలని శోభా శెట్టి ఇలా అడగ్గానే నాగ్ అలా ఇచ్చేశాడు. అమర్‌దీప్ అడిగితే మాత్రం అసలు లెక్కచేయలేదు. ఈ సీజన్‌లో టేస్టీ తేజ కూడా తనకు చొక్కా కావాలని సిగ్గు విడిచి అడిగాడు. సన్నబడితే షర్ట్ ఇస్తానని నాగ్ మాటిచ్చాడు. అందుకోసం తేజ కష్టపడ్డాడు కానీ ఫలితం లేకపోయింది. బరువు తగ్గకుండానే హౌస్ నుంచి వెళ్లిపోయాడు.
నేను ఫిక్స్ చేస్తా
తాజాగా ఫినాలేకు వచ్చిన తేజ మీ షర్ట్ దక్కలేదన్న కోరిక అలాగే మిగిలిపోయిందన్నాడు. అందుకు నాగ్ ముందు పెళ్లి ఫిక్స్ చేసుకో.. అప్పుడు నీకు పెళ్లి డ్రెస్ నేను ఫిక్స్ చేస్తా అని హామీ ఇచ్చాడు. ఊహించని బంపరాఫర్ తగలడంతో తేజ తెగ సంతోషపడిపోయాడు.
చదవండి: కప్పు గెలిచేసిన నిఖిల్.. అడుగుదూరంలో ఆగిపోయిన గౌతమ్!
Comments
Please login to add a commentAdd a comment