
బిగ్‌బాస్ ఫైనల్‌లో సూట్‌కేస్ ఆఫర్ చేయడమనేది గత కొన్నేళ్లుగా వస్తున్న ఆనవాయితీ! అయితే మధ్యలోనే టెంప్ట్ అయి సూట్‌కేస్ తీసుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు. దీనివల్ల విన్నర్ ఫుల్ ప్రైజ్‌మనీ అందుకోలేకపోతున్నాడు. పైగా ఈసారి కంటెస్టెంట్లకు చాలా హింట్స్ వెళ్లాయి.
సూట్‌కేస్ ఆఫర్
అసలు సిసలైన పోటీ నిఖిల్, గౌతమ్ మధ్యే అని అందరికీ క్లారిటీ వచ్చేసింది. అందుకే టాప్ 5 మెంబర్స్‌కు సూట్‌కేస్ ఆఫర్ చేయలేదు. కానీ ఎవరూ మొగ్గు చూపలేదట.. తర్వాత ముగ్గురు మిగిలినప్పుడు టెంప్ట్ చేసే ప్రయత్నం చేయగా ఎవరూ తలొంచలేదట!
అడుగు దూరంలో ఆగిపోయిన గౌతమ్
చివరి ప్రయత్నంగా టాప్ 2 అంటే నిఖిల్, గౌతమ్‌లకు సూట్‌కేస్ ఆఫర్ చేసినప్పటికీ తీసుకోవడానికి ఇద్దరూ వెనకడుగు వేశాడు. దీంతో విన్నర్‌కు రూ.55 లక్షల ప్రైజ్‌మనీ అందింది. మరి ఈ మొత్తం అందుకున్న కంటెస్టెంట్ ఎవరనేది ఆల్‌రెడీ లీకైపోయింది. గెస్టుగా వచ్చిన రామ్‌చరణ్.. నిఖిల్ మళయక్కల్‌ను విన్నర్‌గా ప్రకటించినట్లు సమాచారం. దీంతో గౌతమ్ కృష్ణ రన్నరప్ స్థానంతో సరిపెట్టుకున్నాడు.