పగిలిన విండో.. స్పైస్‌ జెట్‌కు తప్పిన ప్రమాదం | Slight crack in windshield delays Spicejet's Pune-Delhi flight | Sakshi
Sakshi News home page

పగిలిన విండో.. స్పైస్‌ జెట్‌కు తప్పిన ప్రమాదం

Published Wed, Feb 22 2017 7:46 PM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM

పగిలిన విండో.. స్పైస్‌ జెట్‌కు తప్పిన ప్రమాదం

పగిలిన విండో.. స్పైస్‌ జెట్‌కు తప్పిన ప్రమాదం

పుణె: పైలట్‌ పక్కనే ఉన్న అద్దం స్వల్పంగా పగిలినట్లు ముందస్తుగా గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అప్పటికప్పుడు విమానాన్ని ఆపేసి మరమ్మత్తు పూర్తి చేసి తొమ్మిదిగంటలు ఆలస్యంగా ఆ విమానం ఎగిరేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ పరిస్థితి ఢిల్లీకి చెందిన స్పైస్‌ జెట్‌ విమానానికి ఎదురైంది. లోహెగావ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బుధవారం ఉదయం స్పైస్‌ జెట్‌కు చెందిన విమానం ఉదయం 7.20గంటలకు ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది.

అయితే, ముందస్తు తనఖీలో భాగంగా పైలట్‌ సీటుపక్కనే ఉన్న కిటికీ అద్దం పగిలి ఉండటం గుర్తించారు. దీంతో దానికి తిరిగి కొత్త అద్దాన్ని ఫిక్స్‌ చేసిన తర్వాత సాయంత్రం 4.25 గంటల ప్రాంతంలో విమానానికి అనుమతిచ్చారు. ‘పుణె నుంచి ఢిల్లీ మధ్య నడిచే ఎస్‌జీ999 స్పైస్‌ జెట్‌ విమానం బయలుదేరడానికి కాస్త ముందుగా పైలట్‌ పక్కనే ఉండే కిటికీ అద్దం కొంచెం పగిలి ఉండటం గమనించాం. దీంతో విమానాన్ని ఆపేసి తొమ్మిదిగంటలు ఆలస్యంగా పంపించాం’ అని స్పైస్‌ జెట్‌ ఒక ప్రకటనలతో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement