ఖరీదైన విమానంలో సీటు కింద నుంచి ఓ బల్లి వచ్చి తచ్చాడితే ఎలా ఉంటుంది. ఎవరికైనా ఒకింత వికారంగా, షాకింగ్‌గా ఉంటుంది. ఇలాంటి చేదు అనుభవమే వర్ధమాన నటి రూహి సింగ్‌కు ఎదురైంది. మధుర్ బండార్కర్ ‘క్యాలండర్ గర్ల్స్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో నటిస్తోంది.