Calender Girls
-
విమానం సీటు కింద బల్లి.. షాక్ తిన్న హీరోయిన్!
-
విమానం సీటు కింద బల్లి.. షాక్ తిన్న హీరోయిన్!
ఖరీదైన విమానంలో సీటు కింద నుంచి ఓ బల్లి వచ్చి తచ్చాడితే ఎలా ఉంటుంది. ఎవరికైనా ఒకింత వికారంగా, షాకింగ్‌గా ఉంటుంది. ఇలాంటి చేదు అనుభవమే వర్ధమాన నటి రూహి సింగ్‌కు ఎదురైంది. మధుర్ బండార్కర్ ‘క్యాలండర్ గర్ల్స్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో నటిస్తోంది. తమిళ చిత్రం ప్రమోషన్లో భాగంగా చెన్నైలో గడిపిన ఆమె స్పైస్‌జెట్ విమానంలో ముంబై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో మండిపడిన ఈ మాజీ మిస్ ఇండియా.. విమానాల్లో ఇంత దారుణమైన అపరిశ్రుభత ఎలా ఉంటుందంటూ విమానంలో బల్లి తచ్చాడుతున్న వీడియను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. స్పైస్‌జెట్ విమానంలో అధిక ధర చెల్లించి తాను ప్రీమియం టికెట్‌ను కొన్నానని, తీరికలేని షెడ్యూల్ నుంచి విశ్రాంతి తీసుకోవడానికి తాను ఈ టికెట్ కొంటే.. అందుకు భిన్నంగా తాను ఓ బల్లితో కలిసి ప్రయాణించాల్సి వచ్చిందని ఆమె తన పోస్టులో వాపోయింది. తన సీటు కింద నుంచి వచ్చిన బల్లి క్రమంగా విండో వద్దకు వెళ్లి అటు నుంచి పైనున్న లగేజ్ క్యాబిన్లోకి వెళ్లిపోయిందని, దీని గురించి తాను క్యాబిన్ సిబ్బందికి వెంటనే ఫిర్యాదు చేసినా.. ఇది సర్వసాధారణ ఘటనలా వారు స్పందించి నవ్వుకోవడం తనను షాక్ గురిచేసిందని పేర్కొంది. విమానం దిగేవరకు బల్లి గురించి తాము ఏమీ చేయలేమని, కాబట్టి వేరే సీటులో కూర్చోవాలని సిబ్బంది చెప్పారని ఆమె వివరించింది. ఎక్కువ డబ్బు చెల్లించిమరీ తాను స్పైస్మాక్స్ సీటు కొనుగోలు చేశానని, కానీ వాస్తవానికి ఓ బల్లి పక్కన తాను కూర్చోవాల్సి వచ్చిందని, విమానంలోని పరిశుభ్రత ప్రమాణాలు తనను తీవ్రంగా ఆందోళనకు గురిచేశాయని చెప్పింది. అయితే, రూహి సింగ్ పోస్టుపై స్పందించడానికి స్పైస్‌జెట్ ఇప్పటివరకు ముందుకురాలేదు. @flyspicejet @spicejetairlines last night on flight SG 612 Chennai to Mumbai, I booked myself a spicemax seat (for which I paid extra money) to be seated next to a lizard! I'm extremely worried about your hygiene standards now, and the fact that the cabin crew laughed it off as if it's a common occurrence got me quite shocked. #Lizardonspicejet A post shared by Ruhi Singh (@ruhisingh12) on May 29, 2017 at 1:00am PDT -
ఎమర్జెన్సీ రోజులపై మధుర్ సినిమా
బాలీవుడ్లో రియలిస్టిక్ చిత్రాల దర్శకుడిగా పేరున్న మధుర్ బండార్కర్ మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే హీరోయిన్, క్యాలెండర్ గర్ల్స్, ఫ్యాషన్ లాంటి సినిమాలతో ఎన్నో చీకటి కోణాల్ని వెండితెర మీద ఆవిష్కరించిన మధుర్, భారత దేశ రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పబడిన ఎమర్జెన్సీ రోజుల నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ విషయాన్ని మధుర్ స్వయంగా ప్రకటించాడు. గత కొద్ది రోజులుగా మధుర్ బండార్కర్ దర్శకత్వంలో బాలీవుడ్ వైఫ్స్ లేదా ఎయిర్ హోస్టస్ అనే చిత్రాలు తెరకెక్కనున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాను అలాంటి చిత్రాలను చేయటం లేదని.. ప్రస్తుతం 1975లో 21 నెలల పాటు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో కథ రెడీ చేసే పనిలో ఉన్నానని ప్రకటించాడు. -
'క్యాలెండర్ గర్ల్స్' రివ్యూ
టైటిల్: క్యాలెండర్ గర్ల్స్ జానర్: డ్రామా తారాగణం: ఆకాంక్షపూరి, అవనీ మోది, కైరా దత్, రుహి సింగ్, సత్రూపా పైనె దర్శకత్వం: మధుర్ బండార్కర్ సంగీతం: మీట్ బ్రోస్ అంజన్, అమాల్ మాల్లిక్ నిర్మాత: బండార్కర్ ఎంటర్టైన్మెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా మాస్ మాసాలా ఎంటర్టైన్మెంట్స్ వెంట పరుగెడుతుంటే, రియలిస్టిక్ సినిమాలు తీసే సాహసం చేస్తున్న ఒకే ఒక్క దర్శకుడు మధుర్ బండార్కర్. చాందినీ బార్, పేజ్ 3, కార్పొరేట్, ట్రాఫిక్ సిగ్నల్, ఫ్యాషన్, హీరోయిన్ ఇలా ఇప్పటివరకు అన్నీ గ్లామర్ ఇండస్ట్రీ చాటున ఉన్న చీకటి కోణాల్ని తెరకెక్కిస్తూ వచ్చిన మధుర్, మరోసారి క్యాలెండర్ గర్ల్స్‌తో అదే ఫార్ములాను కంటిన్యూ చేశాడు. హీరోయిన్ ఫెయిల్యూర్‌తో నిరాశపడ్డ మధుర్ అభిమానులు క్యాలెండర్ గర్ల్స్‌తో సంతృప్తి చెందారా.. రివ్యూలో చూద్దాం. కథ: తన గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా గ్లామర్ ఇండస్ట్రీలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు మధుర్ బండార్కర్. సినిమా ప్రారంభంలోనే ఐదుగురు అమ్మాయిలు క్యాలెండర్ గర్ల్స్‌గా పరిచయం అవుతారు. ఎన్నో కష్టాల తరువాత ఆ స్ధాయికి వచ్చిన ఆ అమ్మాయిలు ఒక్కరాత్రిలో స్టార్స్‌గా మారిపోతారు. ఆ తర్వాత వారి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. గ్లామర్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి వాళ్లు ఎలాంటి తప్పటడుగులు వేశారన్నదే మిగతా కథ. కథాపరంగా కొత్తదనం లేకపోయినా కథనంలో చాలా కొత్తదనం చూపించిన మధుర్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. నటీనటులు, సాంకేతిక నిపుణులు: లీడ్ రోల్స్లోనటించిన వారంతా కొత్తవారు కావడంతో వారి గురించి మాట్లాడుకోవటానికి పెద్దగా ఏమీ లేదు. అయితే గ్లామర్ డాల్స్‌గా మాత్రం ఆకట్టుకున్నారు. ఇతర పాత్రల్లో కూడా గుర్తుపట్టగలిగే నటీనటులు ఎవరూ లేకపోవటం, పర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న పాత్రలు కూడా కనిపించకపోవడంతో నటనపరంగా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక సినిమా అంతా డైరెక్టర్స్ మూవీగా సాగుతుంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ మధుర్ బండార్కర్ తన మార్క్ ఉండేలా చూసుకున్నాడు. అయితే ఈ ప్రయత్నంలో తన గత సినిమాల ఛాయలు ఎక్కువగా కనిపించటం ఆడియన్స్‌ను ఇబ్బంది పెడుతుంది. హరి వేదాంతం సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. మీట్ బ్రోస్ అంజన్, అమాల్ మాల్లిక్ల సంగీతం ఆశించిన స్ధాయిలో వర్కవుట్ కాలేదు. చాలా సందర్భాల్లో పాత మ్యూజిక్ వింటున్న ఫీల్ కలిగించారు. విశ్లేషణ: తన గత సినిమాల మాదిరిగానే రియలిస్టిక్ అప్రోచ్‌తో మధుర్ బండార్కర్ తెరకెక్కించిన క్యాలెండర్ గర్ల్స్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ను మాత్రమే ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మధుర్ బండార్కర్ గత సినిమాల ప్రభావం ఎక్కువగా కనిపించటం, గే డిజైనర్స్, మేనేజర్స్, కార్పొరేట్స్ లాంటి పాత్రలు రెగ్యులర్‌గా మధుర్ సినిమాల్లో కనిపించే పాత్రలు కావటంతో ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారు. తన గత సినిమాలతో పోలిస్తే రచయితగా మాత్రం బెస్ట్ అనిపించాడు మధుర్ బండార్కర్. హీరోయిన్ సినిమాతో పోలిస్తే క్యాలెండర్ గర్ల్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నా ఫ్యాషన్ స్థాయి సినిమాగా మాత్రం ఆకట్టుకోలేకపోవచ్చు. ప్లస్ పాయింట్స్ రియలిస్టిక్ అప్రోచ్ సినిమాటోగ్రఫీ డైలాగ్స్ మైనస్ పాయింట్స్ రొటీన్ టేకింగ్ స్టార్స్ లేకపోవటం మ్యూజిక్ ఓవరాల్‌గా క్యాలెండర్ గర్ల్స్ ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ను మాత్రమే ఆకట్టుకునే డ్రామా ఫిలిం -
ప్రియాంకా ‘మేడమ్‌జీ’..
‘కేలండర్ గర్ల్స్’ దర్శకుడు మధుర్ భండార్కర్ తదుపరి చిత్రం ‘మేడమ్‌జీ’లో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో కనిపించనుంది. తొలుత ఈ చిత్రం షూటింగ్ నవంబర్ 1 నుంచి మొదలవుతుందని ప్రకటించినా, ఇది అనివార్య కారణాల వల్ల నవంబర్ 30వ తేదీకి వాయిదా పడింది. ‘బాజీరావు మస్తానీ’ షూటింగ్ తర్వాత ప్రియాంకా కీళ్లనొప్పులకు గురికావడం వల్లనే ‘మేడమ్‌జీ’ షూటింగ్ వాయిదా పడినట్లు సమాచారం. రాజకీయ నాయకురాలిగా ఎదిగిన ఐటెమ్‌గర్ల్ పాత్రకు ప్రియాంకా న్యాయం చేయగలదని భండార్కర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. -
మధుర్ భండార్కర్ ‘కేలండర్ గర్ల్స్’
బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ తన తదుపరి చిత్రం ‘కేలండర్ గర్ల్స్’ కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. తాజాగా ‘కేలండర్ గర్ల్స్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్లో బంగారు వన్నె బికినీలు ధరించిన ఐదుగురు భామల ముఖాలు కనిపించకుండా టోపీలు అడ్డుపెట్టడంతో వారెవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సినిమా పూర్తయ్యేంత వరకు వారెవరనేది గోప్యంగా ఉంచాలని భండార్కర్ భావిస్తున్నట్లు సమాచారం. ‘వీరా’తో గాయని శిబానీ తెరంగేట్రం బాలీవుడ్ గాయని శిబానీ కాశ్యప్ ‘వీరా’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేయనుంది. ఇప్పటి వరకు అడపా దడపా వీడియో ఆల్బమ్స్‌లో కనిపించిన శిబానీకి నటిగా ఇదే మొదటి చిత్రం కానుంది. ‘వీరా’లో తనకు ఆఫర్ చేసిన పాత్ర నచ్చిందని, ఇందులో పాత్ర తన జీవితానికి దగ్గరగా ఉండటంతో నటించడానికి అంగీకరించానని ఆమె చెప్పింది. పరుగు బాలుడి జీవితంపై చిత్రం నాలుగేళ్ల వయసులోనే మారథాన్ పూర్తి చేసిన ఒడిశా పరుగు బాలుడు బుధియా సింగ్ జీవితం ఆధారంగా త్వరలోనే చిత్రం తెరకెక్కనుంది. ఒరియా దర్శకుడు సౌమేంద్ర పాఢి దీని రూపకల్పన కోసం సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ చిత్రంలో బుధియా కోచ్ బిరంచి దాస్ పాత్రను బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయి పోషించనున్నాడు.