
ప్రియాంకా ‘మేడమ్‌జీ’..
‘కేలండర్ గర్ల్స్’ దర్శకుడు మధుర్ భండార్కర్ తదుపరి చిత్రం ‘మేడమ్‌జీ’లో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో కనిపించనుంది. తొలుత ఈ చిత్రం షూటింగ్ నవంబర్ 1 నుంచి మొదలవుతుందని ప్రకటించినా, ఇది అనివార్య కారణాల వల్ల నవంబర్ 30వ తేదీకి వాయిదా పడింది. ‘బాజీరావు మస్తానీ’ షూటింగ్ తర్వాత ప్రియాంకా కీళ్లనొప్పులకు గురికావడం వల్లనే ‘మేడమ్‌జీ’ షూటింగ్ వాయిదా పడినట్లు సమాచారం. రాజకీయ నాయకురాలిగా ఎదిగిన ఐటెమ్‌గర్ల్ పాత్రకు ప్రియాంకా న్యాయం చేయగలదని భండార్కర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.