Madhur Bhandarkar
-
ఆరు సాంగ్స్ పెట్టమన్నారు.. ఇప్పటికీ ఏం మారలేదు!
లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీయడం అంత ఈజీ కాదంటున్నాడు ప్రముఖ దర్శకనిర్మాత, జాతీయ అవార్డు గ్రహీత మధుర్ భండార్కర్. మహిళా ప్రాధాన్యత చిత్రాలను కలర్ఫుల్గా మార్చేందుకు లేనిపోని సలహాలు, సూచనలు ఇస్తుంటారని పేర్కొన్నాడు.హిట్టు కోసం తప్పలేదుతాజాగా ముంబైలోని ఓ ఈవెంట్లో పాల్గొన్న మధుర్ భండార్కర్ మాట్లాడుతూ.. నేను సినిమాలు తీయడం మొదలుపెట్టిన తొలినాళ్లలో కమర్షియల్ చిత్రాలకు మంచి గిరాకీ ఉండేది. నాకేమో అలాంటి చిత్రాలు తీయాలనిపించలేదు. కానీ హిట్టు కోసం ఆ తరహా సినిమాలు చేయక తప్పలేదు. నా కెరీర్‌ను ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన మూవీ చాందిని బార్. అప్పటినుంచి నా ఆలోచనలో చాలా మార్పు వచ్చింది.ఆరు ఐటం సాంగ్స్ పెట్టమని సలహాఆ సినిమా కోసం చాలామందిని కలిశాను. అందరూ మంచి సబ్జెక్ట్ అని మెచ్చుకున్నారు, కానీ అందులో కనీసం ఆరు ఐటం సాంగ్స్ పెట్టమని సూచించారు. అందుకు నేను ఒప్పుకోలేదు. కొందరు నిర్మాతలు మాత్రమే ఇలాంటి మహిళా ప్రాధాన్యత సినిమాలను సపోర్ట్ చేసేందుకు ముందుకు వచ్చారు. అలాగే కరీనా కపూర్, టబు, ప్రియాంక చోప్రా.. పారితోషికం తగ్గించుకునైనా సరే నా సినిమాలు చేసేవారు. నచ్చిందే చేయండిఅంతెందుకు? హీరోలు కూడా కొంత తక్కువ మొత్తమే తీసుకుని ఇలాంటి సినిమాల్లో యాక్ట్ చేసేవారు. నేను దర్శకనిర్మాతలకు చెప్పేదొక్కటే! మహిళా ప్రాధాన్యత సినిమాలు చేయాలనుకున్నప్పుడు ఎంతోమంది ఎన్నో సలహాలు ఇస్తుంటారు. కానీ మీకు నచ్చిందే చేయండి. చాందిని బార్ బాలేదని ఎంతోమంది విమర్శించారు. అయినా సరే ఎన్నో అవార్డు వేదికలకు నామినేట్ అయింది. ఎవరూ ముందుకు రావట్లేదుఈ రోజు లాపతా లేడీస్ మూవీని ఉదాహరణగా తీసుకుంటే ఈ సినిమా గురించి ప్రపంచమే మాట్లాడుకుంటోంది. అయినా ఇప్పటికీ ఇలాంటి సినిమాలకు ఎక్కువ బడ్జెట్ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. హీరోయిన్లు కూడా తాము చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు సక్సెస్ అవకపోతే తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఆలోచిస్తున్నారు అని చెప్పుకొచ్చాడు.హేమ కమిటీపై స్పందనఅలాగే మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులను అరికట్టేందుకు ఏర్పడిన హేమ కమిటీ పనితీరుపైనా స్పందించాడు. హేమ కమిటీలో నిందితులుగా పేర్కొన్న పలువురూ శిక్ష అనుభవిస్తున్నారు. అలాగే మీటూ ఉద్యమం సమయంలోనూ చాలామందిపై నిషేధం విధించారు. అంటే ఇండస్ట్రీలో తప్పు చేసినవారిపై చర్యలు తీసుకుంటున్నారు అని మధుర్ భండార్కర్ తెలిపాడు.చదవండి: షో అయిపోగానే కావ్య దగ్గర వాలిపోతానన్న నిఖిల్.. ఇప్పుడేమో! -
ఆనాటి పరిస్థితులకు అద్దం పట్టేలా 'ఇండియన్ లాక్డౌన్'.. టీజర్ రిలీజ్
కరోనా సృష్టించిన మారణహోమం అంతా ఇంతా కాదు. ఆ పేరు వింటేనే యావత్ ప్రపంచం వణికిపోయింది. ఎంతో మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంది ఆ మహమ్మారి. ఎందరో ఆత్మీయులను దూరం చేసి ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఆనాటి చేదు జ్ఞాపకాలను తెరపై చూపించేందుకు వస్తోంది 'ఇండియన్ లాక్డౌన్' చిత్రం. కరోనా నాటి వాస్తవ పరిస్థితుల ఆధారంగా వస్తున్న ఈ చిత్రానికి మధుర్ భండార్కర్ దర్శకుడు. శ్వేత బసు ప్రసాద్, ప్రతీక్ బబ్బర్, సాయి తమంకర్, ప్రకాశ్ బెలవాడి, అహన్‌కుమ్రాలు కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? వలస కూలీలు అనుభవించిన వేదన ఎలాంటింది? అన్ని రంగాలపై కరోనా చూపిన ప్రభావమెంత? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను మధుర్ భండార్కర్ తెరపై చూపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ జీ5 వేదికగా డిసెంబరు 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. The tragedy you know, the untold stories you don't!#IndiaLockdown teaser, premieres 2nd Dec only on #ZEE5 🙌 @jayantilalgada @PenMovies @ZEE5India @prateikbabbar @SaieTamhankar @shweta_official @AahanaKumra @pjmotionpicture @itsmeamitjoshi @i_aradhana_ @ZEE5Global pic.twitter.com/g5LxbcEYoT — Madhur Bhandarkar (@imbhandarkar) November 8, 2022 -
నేరుగా ఓటీటీ రిలీజ్ కానున్న తమన్నా కొత్త సినిమా!
ప్రేక్షకులను అలరించేందుకు ఏ మాధ్యమమైనా సరే అంటోంది హీరోయిన్ తమన్నా. వెండితెర, బుల్లితెర, డిజిటల్ తెర.. కాదేదీ వినోదాన్ని అందించే సాధనం అంటూ అన్నింటా దూసుకుపోతోంది. ఇటీవలే ఎఫ్ 3తో వినోదాన్ని పంచిన ఈ బ్యూటీ తాజాగా బబ్లీ బౌన్సర్ మూవీ చేస్తోంది. మధుర్ భండార్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి బుధవారం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో తమన్నా లేడీ బౌన్సర్‌గా నిల్చుంది. ఇక ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. హాట్‌స్టార్ సెప్టెంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ అవుతున్నట్లు వెల్లడించారు. Oye bawale suna kya? Aa gaya hai Babli Bouncer ka time! Dilon ko yeh jodegi, ya khub haddiyaan todegi? Pata chalega jald hi! ❤️🔥 Here’s the first look of #BabliBouncer. Streaming from Sept 23 only on @DisneyPlusHS @imbhandarkar @starstudios_ #BikramDuggal @jungleepictures pic.twitter.com/cbC7nHFOKI — Tamannaah Bhatia (@tamannaahspeaks) July 20, 2022 చదవండి: హీరోయిన్‌తో సిద్దార్థ్ షికార్లు.. ఫొటోలు క్లిక్‌మనిపించినవారికి హీరో వార్నింగ్ చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు.. వెనక్కు తగ్గిన నారాయణ -
ఇండియా లాక్డౌన్.. టైటిల్ పోస్టర్ విడుదల
లాక్డౌన్ కాన్సెప్ట్‌తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్. ‘ఇండియా లాక్డౌన్’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. ఇందులో ప్రతీక్ బబ్బర్, శ్వేతాబసు ప్రసాద్, ఆహనా కుమ్రా ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. కోవిడ్ వల్ల ఏర్పడ్డ లాక్డౌన్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి వంటి అంశాల చుట్టూ ఈ సినిమా తిరగనుందట. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని చిత్రబందం ప్రకటించింది. వచ్చే వారం ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘‘ఈ కథలో భాగమవ్వడం ఎగ్జయిటింగ్‌గా ఉంది. మధుర్ భండార్కర్ డైరెక్షన్లో షూటింగ్ త్వరగా మొదలవ్వా లని ఉంది’’ అన్నారు శ్వేతా బసు. Film India Lockdown is all set to go on floor next week. Here’s a teaser poster. Give your love. ❤️ @prateikbabbar @SaieTamhankar @AahanaKumra @shweta_official @ShihabZarin #PrakashBelawadi #IndiaLockdown pic.twitter.com/ZDnsWzajeX — Madhur Bhandarkar (@imbhandarkar) January 21, 2021 -
అది నా సినిమా టైటిల్.. ఇచ్చేయ్
సాక్షి, ముంబై: బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ మధ్య కాలంలో తరచూ వివాదంలో చిక్కుకుంటున్నారు. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ నెపోటిజంపై తీవ్ర విమర్శలు నెటకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నెపోటిజానికి కారణం కరణ్ జోహార్ అని ఆయనపై ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక ఇటీవల గోవాలో జరిగిన షూటింగ్లో భాగంగా పేరుకుపోయిన చెత్తను కరణ్ ధర్మ ప్రొడక్షన్ సిబ్బంది సమీప గ్రామంలో చెత్త విసిరేసి వెళ్లడంపై గోవా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ధర్మ ప్రొడక్షన్ సిబ్బంది బాధ్యత రహితంగా ప్రవర్తించారని పేర్కొంటూ ధర్మ ప్రొడక్షన్‌పై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉండగా తాజాగా దర్శకుడు మధుర్ భండార్కర్.. కరణ్ తన టైటిల్‌ను వాడుకున్నారని ఐఎమ్‌పీఆర్‌కు ఫిర్యాదు చేశారు. అంతేగాక దీనిపై ఆయన శనివారం ట్వీట్ చేస్తూ.. ‘బాలీవుడ్ వైవ్స్’ అనే పేరుతో తను సినిమాను రూపొందిస్తున్నానని.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైందని చెప్పారు. అయితే ఈ టైటిల్‌ను కరణ్ తన వెబ్ సిరీస్‌కు వాడుకున్నారని ఆరోపించారు. (చదవండి: కరణ్ జోహార్ క్షమాపణలు చెప్పాల్సిందే) ‘డియర్ కరణ్ జోహార్ మీరు, అపూర్వ మెహతా బాలీవుడ్ వైవ్స్ అనే నా సినిమా టైటిల్ మీ వెబ్ సిరీస్ కోసం అడిగారు. అయితే అప్పటికే నా సినిమా షూటింగ్ ప్రారంభం కావడంతో మీకు ఆ టైటిల్ ఇచ్చేందుకు నిరాకరించాను. కానీ మీ వెబ్ సిరీస్‌కు ‘దిఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అది నా సినిమా టైటిల్. దీనిని మీరు వాడుకోవడం అనైతికం. దయచేసి ఆ టైటిల్‌ను మర్చాలని మిమ్మల్ని వెడుకుంటున్నాను’ అంటూ ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. అంతేగాక కరణ్, అపూర్వ మెహతాలపై ఇండియన్ మోషన్ పిక్చర్ అసోషియేషన్‌కు(ఐఎమ్‌పీఆర్)కు కూడా ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదును పరిశీలించిన ఐఎమ్‌పీఆర్ కరణ్, మెహతాలకు నోటీజుసులు జారీ చేసి దీనిపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఇంతవరకు కరణ్, మెహతాలు దీనిపై స్పందించకపోవడం గమనార్హం. కాగా ప్రముఖ బాలీవుడ్ నటుల భార్యల లైఫ్‌స్టైల్‌ను తెరపై చూపించే నేపథ్యంలో కరణ్ ‘ఫ్యాబులస్ లైఫ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. (చదవండి: నలుగురిదీ ఒక్కటే మాట..) Dear @karanjohar U & @apoorvamehta18 had asked me 4 the title #BollywoodWives for web,which I refused,as my project is underway. It is Morally & ethically wrong u to tweak it to #TheFabulousLivesofBollywoodWives. Pls do not dent my project. I humbly request u to change the title. — Madhur Bhandarkar (@imbhandarkar) November 20, 2020 -
చీకటి నీడ
-
సుప్రీం గ్రీన్‌సిగ్నల్.. రేపే విడుదల!
న్యూఢిల్లీ: దర్శకుడు మధుర్ భండార్కర్ తెరకెక్కించిన 'ఇందూ సర్కార్' సినిమా విడుదలపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సినిమా విడుదలపై స్టే విధించాలన్న పిటిషన్‌ను జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అమితావ్ రాయ్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్లతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఈ సినిమా చట్టబద్ధ పరిమితులకు లోబడిన కళాత్మక వ్యక్తీకరణ అని పేర్కొంది. 1975లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ ఇతివృత్తంగా 'ఇందూ సర్కార్' సినిమా తెరకెక్కింది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని, వాస్తవాలను వక్రీకరించి.. పూర్తిగా కించపరిచేలా ఈ సినిమాను తెరకెక్కించారని సంజయ్‌గాంధీ కూతురిగా చెప్పుకుంటున్న ప్రియా సింగ్ పాల్ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. రేపు (శుక్రవారం) ఇందూ సర్కార్ సినిమా దేశవ్యాప్తంగా విడుదలకానుంది. -
సెన్సార్ బోర్డ్‌పై ఫైర్ అయిన డైరెక్టర్
రియలిస్టిక్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మధుర్ బండార్కర్. తన సినిమాలతో ఎన్నో వివాదాలకు కారణమయ్యే మధుర్ మరో వివాదాస్పద చిత్రాన్ని తెర మీదకు తెచ్చాడు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించినప్పటి పరిస్థితుల నేపథ్యంలో ఇందు సర్కార్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో ఇందిరా గాంధీని పోలిన పాత్రతో పాటు సంజయ్ గాంధీ పాత్రలను తప్పుగా చూపించారన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఏకంగా 14 కట్లు సూచించారట. సినిమాలో చూపించిన మొరార్జీ దేశాయి, వాజ్ పేయ్, అధ్వానీ లాంటి ప్రముఖుల ఫోటోలను తొలగించాలని, 'అబ్ ఇస్ దేశ్ మే గాంధీ కే మైనే బదల్ చుకే హై (ఈ దేశంలో గాంధీని ఇప్పుడు నేను మార్చేశాను), భారత్ కి ఏక్ బేటీ నే దేశ్ కో బందీ బనాయా హువా హై (భారత్‌కు చెందిన ఓ కూతురు దేశం మొత్తాన్ని బందీ చేసింది), ఔర్ తుమ్ లోగ్ జిందగీ బర్ మా బేటే కి గులామీ కర్తే రహోగే (మీరు జీవితాంతం ఆ తల్లీ కొడుకులకు గులాంగిరీ చేస్తూనే బతికేస్తారా)' లాంటి డైలాగ్ లను తొలగించాలని సూచించారు. అంతేకాదు సినిమాలోఉపయోగించిన ప్రముఖుల పేర్లు వినిపించకుండా మ్యూట్ చేయాలని ఆదేశించారు. దీంతో దర్శకుడు మధుర్ బండార్కర్ సెన్సార్ బోర్డ్ పై ఫైర్ అవుతున్నాడు. గతంలో ట్రైలర్ సెన్సార్ చేసిన సమయంలో అభ్యంతరం పెట్టని సభ్యులు సినిమాకు కట్ చెప్పటం ఏంటని ప్రశ్నిస్తున్నాడు. అందుకే సెన్సార్ ఇచ్చిన కట్స్ పై రివైజింగ్ కమిటీని ఆశ్రయించాలని నిర్ణయించారు. -
'సెన్సార్ చేయకముందే ఆ మూవీ చూడాలి'
న్యూఢిల్లీ: ఎమర్జెన్సీ రోజులను నేపథ్యంగా ఎంచుకుని దర్శకుడు మధుర్ భండార్కర్ తీసిన ‘ఇందు సర్కార్’ మూవీపై కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ మూవీని బోర్డు సెన్సార్ చేయకముందుగానే తాను చూడాలని కోరుతూ సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లాజ్ నిహలానీకి మంగళవారం ఓ లేఖ రాశారు. తనతో పాటు మరికొందరు పార్టీ నేతలకు ఈ మూవీ స్టోరీపై అనుమానాలున్నట్లు తెలిపారు. 'ఈ మూవీ ట్రైలర్ చూశాను. ఎమర్జెన్సీ రోజుల్లో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీని, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను చూపించారు. ఇందిరాగాంధీ, సంజయ్ తో పాటు పార్టీకి చెందిన అగ్రనేతలను చెడు కోణంలో చూపించారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కారణం వల్ల మాకు ఇందు సర్కార్ మూవీని సెన్సార్ చేయకముందే ఓసారి ప్రత్యేక షో చూపించాలని' సీబీఎఫ్సీ చైర్మన్ పహ్లాజ్ నిహలానీని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ మూవీలో తరచుగా ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ పాత్రలు కూడా వచ్చి పోతుంటాయి. ఇందిరా గాంధీగా కొత్త నటి సుప్రియా వినోద్, సంజయ్ గాంధీగా నీల్ నితిష్ నటించాడు. కీర్తి కుల్హారి, అనుపమ్ ఖేర్ కీలకపాత్రల్లో కనిపిస్తారు. 1975 జూన్ 26న మొదలైన ఎమర్జెన్సీ దమనకాండ 21 నెలల తర్వాత 1977 మార్చి 21న ముగిసింది. అనంతరం జరిగిన ఎలక్షన్లలో జనం ఇందిరాగాంధీని చావుదెబ్బ తీయగా, జయప్రకాష్ నారాయణ్ ఆధ్వర్యంలోని జనతాపార్టీని అందలం ఎక్కించారు. మరోవైపు ఇందిరాగాంధీ జీవితంలోనే కాదు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కూడా ఎమర్జన్సీని మచ్చగా, దాచిపెట్టాల్సిన విషయంగా భావిస్తారన్న విషయం తెలిసిందే. -
ముంబై మోడల్ ప్రీతి జైన్ కు ఉపశమనం
ముంబయి: బాలీవుడ్ దర్శకుడు మాధుర్ భండార్కర్‌పై హత్యాయత్నం కేసులో దోషిగా తేలిన ముంబై మోడల్ ప్రీతి జైన్‌కు అరెస్ట్ నుంచి స్వల్పకాలిక ఉపశమనం లభించింది. ఈ నెల 26వరకూ ఆమెను అరెస్ట్ చేయరాదని బాంబే హైకోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది. ఖౠఘౠ మాధుర్ భండార్కర్‌పై హత్యాయత్నం కేసులో ప్రీతి జైన్‌కు ముంబై సెషన్స్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించిన విషయం తెలిసిందే. 2005లో భండార్కర్‌ను హత్యచేసేందుకు గ్యాంగ్‌స్టర్ అరుణ్ గావ్లీ సన్నిహితుడు నరేశ్ పరదేశీతో రూ.75 వేలకు ప్రీతి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే పరదేశీ పని పూర్తి చేయకపోవటంతో డబ్బులు తిరిగిచ్చేయాలని ఆమె డిమాండ్ చేయటంతో ఈ విషయం పోలీసులకు చేరింది. భండార్కర్ తనపై అత్యాచారం చేశారని 2004లో కేసు పెట్టిన ప్రీతి 2012లో దాన్ని వాపసు తీసుకున్నారు. -
భండార్కర్ కేసులో మోడల్‌కు జైలుశిక్ష
ముంబై: బాలీవుడ్ దర్శకుడు మాధుర్ భండార్కర్‌పై హత్యాయత్నం కేసులో దోషిగా తేలిన ముంబై మోడల్ ప్రీతి జైన్‌కు ముంబై సెషన్స్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించింది. జైన్ వెంటనే బెయిల్‌కోసం అప్పీల్ చేసుకోవటంతో 4 వారాల బెయిల్ ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. ఈ కేసులో ప్రీతికి సహకరించిన నరేశ్ పరదేశీ, శివరాం దాస్లకూ మూడేళ్ల జైలుశిక్ష విధించింది. 2005లో భండార్కర్‌ను హత్యచేసేందుకు గ్యాంగ్‌స్టర్ అరుణ్ గావ్లీ సన్నిహితుడు నరేశ్ పరదేశీతో రూ.75 వేలకు ప్రీతి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే పరదేశీ పని పూర్తి చేయకపోవటంతో డబ్బులు తిరిగిచ్చేయాలని ఈమె డిమాండ్ చేయటంతో ఈ విషయం పోలీసులకు చేరింది. భండార్కర్ తనపై అత్యాచారం చేశారని 2004లో కేసు పెట్టిన ప్రీతి 2012లో దాన్ని వాపసు తీసుకున్నారు. -
దర్శకుడి హత్యకు కుట్ర, మోడల్‌కు జైలు
ముంబై: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మాధుర్ భండార్కర్‌ను హత్య చేయించడానికి కుట్ర పన్నిన కేసులో ముంబై మోడల్ ప్రీతి జైన్‌ను ముంబై కోర్టు దోషీగా నిర్ధారించింది. ఈ కేసులో ఆమెకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కుట్రలో ఆమెకు సాయపడిన నరేష్ పరదేశీ, శివరామ్ దాస్‌లకు కూడా కోర్టు మూడేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. 2005లో మాధుర్ భండార్కర్‌ను హత్య చేయించడానికి గ్యాంగ్ స్టర్ అరుణ్ గావ్లీ అనుచరుడు నరేష్ పరదేశీతో ప్రీతి ఒప్పందం చేసుకుంది. నరేష్‌కు ఆమె 75 వేల రూపాయలు ఇచ్చింది. కాగా భండార్కర్‌ను నరేష్ హత్య చేయకపోవడంతో తన డబ్బులు వెనక్కు ఇవ్వాల్సిందిగా ఆమె డిమాండ్ చేసింది. ఈ విషయం అరుణ్ గావ్లీకి తెలియడంతో పోలీసులను అప్రమత్తం చేశాడు. ప్రీతితో పాటు ఆమెకు సహకరించిన నరేష్, శివరామ్‌లపై కేసు నమోదు చేశారు. భండార్కర్ హత్యకు ఈ ముగ్గురు కుట్ర పన్నారని కోర్టులో తేలడంతో శిక్ష విధించింది. ఇదిలావుండగా 2006లో ప్రీతి.. భండార్కర్‌పై రేప్ కేసు పెట్టింది. తనకు సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పి భండార్కర్ తనను శారీరకంగా వాడుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కాగా 2012లో భండార్కర్‌పై చేసిన అభియోగాలను ప్రీతి ఉపసంహరించుకోవడంతో కోర్టు ఈ కేసును కొట్టేసింది. పేజ్ 3, ట్రాఫిక్ సిగ్నల్, ఫ్యాషన్, చాందినీ బార్ వంటి సినిమాలను భండార్కర్ తీశారు. -
ఎమర్జెన్సీపై సినిమా తీస్తున్న స్టార్ డైరెక్టర్!
ముంబై: 'ఫ్యాషన్', 'పేజ్-3', 'హీరోయిన్' వంటి విభిన్నమైన సినిమాలు తెరకెక్కించి బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్న దర్శకుడు మధుర్ భండార్కర్. సమాజంలోని చీకటికోణాలపై అత్యంత సాహసోపేతంగా సినిమాలు తీసిన ఈ దర్శకుడు ఇప్పుడు మరో బోల్డ్ ప్రాజెక్టుతో రాబోతున్నాడు. భారత ప్రజాస్వామ్యంలో అత్యంత చీకటికాలంలో ఎమర్జెన్సీ. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశమంతటా అత్యవసర పరిస్థితి విధించారు. 1975 నుంచి 1977 వరకు 21 నెలలపాటు ఎమర్జెన్సీ కొనసాగింది. ఈ 21 నెలల ఎమర్జెన్సీకాలంలో ఏం జరిగిందన్న దానిని తెరకెక్కించేందుకు మధుర్ భండార్కర్ సిద్ధమవుతున్నాడు. 'ఇందూ సర్కార్' పేరిట తీస్తున్న ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తయిందని భండార్కర్ సోమవారం ట్వీట్ చేశాడు. 'ఎమర్జెన్సీ శకానికి చెందిన రాజకీయ నాయకులు, పాత్రికేయులు, ఫొటోగ్రాఫర్లు, రచయితలు, సామాన్యులను కలిసి కొన్ని నెలలపాటు పరిశోధించాను. ఎట్టకేలకు 'ఇందూ సర్కార్' స్క్రిప్ట్ పూర్తయింది' అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ సినిమాలో నటించే తారాగణం, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. -
డైరెక్టర్ వర్సెస్ డైరెక్టర్.. మాటల వార్!
బాలీవుడ్‌కు చెందిన ఇద్దరు టాప్ క్రియేటివ్ దర్శకుల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. పాకిస్థాన్ నటులపై నిషేధం విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ క్షమాపణ చెప్పాలని దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఘాటుగా స్పందించగా.. ఆయన విమర్శలపై మరో టాప్ దర్శకుడు మధుర్ బండార్కర్ మండిపడ్డారు. పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించారన్న కారణంతో కరణ్ జోహర్ తెరకెక్కించిన ’యే దిల్ హై ముష్కిల్’ సినిమా ప్రదర్శనపై నిషేధం విధించడాన్ని తప్పుబట్టిన అనురాగ్ కశ్యప్.. 'నరేంద్ర మోదీ సార్, మీరు పాకిస్థాన్‌కు వెళ్లి ఆ దేశ ప్రధానిని కలిసినందుకు ఇప్పటివరకు క్షమాపణలు చెప్పలేదు. మీరు గతేడాది డిసెంబర్లో అకస్మాత్తుగా పాక్‌కు వెళ్లారు. అదే సమయంలో కరణ్ జోహార్ ’యే దిల్ హై ముష్కిల్’ ను షూటింగ్ ప్రారంభించారు' అని కశ్యప్ ట్వీట్ చేశాడు. ప్రధాని మోదీ అకస్మాత్తుగా కరాచీ వెళ్లి నవాజ్ షరీఫ్ మానవరాలి పెళ్లిలో పాల్గొన్నారు. ఇదే సమయంలో ‘యే దిల్ హై ముష్కిల్’ షూటింగ్ ప్రారంభించిన కరణ్.. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొంటున్నాయన్న ఉద్దేశంతో పాకిస్థాన్ నటుడ్ని తన సినిమాలో తీసుకున్నారు. అప్పుడు దీనిని ఎవరూ వ్యతిరేకించలేదు. ఇటీవల ఉడీ ఉగ్రవాద దాడి, పాకిస్థాన్‌లో భారత సైన్యం సర్జికల్ దాడుల నేపథ్యంలో పాక్ నటులతో తీసిన భారతీయ సినిమాలను నిషేధిస్తామని ఎమ్మెన్నెస్ ప్రకటించడంతో కరణ్ సినిమాకు చిక్కులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కరణ్‌కు అండగా నిలిచిన అనురాగ్.. ఈ సినిమా నిషేధాన్ని తప్పుబట్టారు. అయితే, ఈ సినిమా నిషేధం విషయంలో నేరుగా ప్రధాని మోదీపై అనురాగ్ విమర్శలు చేయడాన్ని మధుర్ బండార్కర్ తప్పుబట్టారు. ‘అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలు తప్పు. బీజేపీగానీ, ప్రభుత్వంగానీ నిషేధించాలని చెప్పలేదు. ప్రధాని మోదీని విమర్శించడం ట్రెండ్‌గా మారింది’ అని మధుర్ పేర్కొన్నారు. -
ఎమర్జెన్సీ రోజులపై మధుర్ సినిమా
బాలీవుడ్లో రియలిస్టిక్ చిత్రాల దర్శకుడిగా పేరున్న మధుర్ బండార్కర్ మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే హీరోయిన్, క్యాలెండర్ గర్ల్స్, ఫ్యాషన్ లాంటి సినిమాలతో ఎన్నో చీకటి కోణాల్ని వెండితెర మీద ఆవిష్కరించిన మధుర్, భారత దేశ రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పబడిన ఎమర్జెన్సీ రోజుల నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ విషయాన్ని మధుర్ స్వయంగా ప్రకటించాడు. గత కొద్ది రోజులుగా మధుర్ బండార్కర్ దర్శకత్వంలో బాలీవుడ్ వైఫ్స్ లేదా ఎయిర్ హోస్టస్ అనే చిత్రాలు తెరకెక్కనున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాను అలాంటి చిత్రాలను చేయటం లేదని.. ప్రస్తుతం 1975లో 21 నెలల పాటు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో కథ రెడీ చేసే పనిలో ఉన్నానని ప్రకటించాడు. -
వారిని అగౌరవపరచినట్లే.. : మధుర్ భండార్కర్
రోజురోజుకూ దేశంలో చెలరేగిపోతున్న హింసను వ్యతిరేకిస్తూ గత కొంతకాలంగా పలువురు ప్రముఖులు తమకు కేంద్ర ప్రభుత్వం అందించిన సాహిత్య అకాడమీ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులతోపాటు పలు అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అవార్డుల తిరస్కరణ పరంపర సినీ దర్శకులను కూడా తాకింది. దీనిపై బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ స్పందిస్తూ.. 'అవార్డులను తిరిగి ఇచ్చేయడం మిమ్మల్ని మీరు అగౌరవ పరచుకోవడమే కాదు.. మిమ్మల్ని, మీ పనిని అభిమానించే ప్రేక్షకులను కూడా అగౌరవపరచినట్లేన్నారు. అంతేకాదు.. ఎంతో సునిశిత దృష్టితో మీ టాలెంట్‌ను గుర్తించి, సెలక్ట్ చేసిన జ్యూరీని.. మీ సినిమాల్లో నటించిన నటీనటులను కూడా అవమానించినట్లేనని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మధుర్ తెలిపారు. -
'ఆమె డేట్లు దొరికితే షూటింగ్ స్టార్ట్'
ముంబయి : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను చూసి భారతీయులు గర్వపడాలని దర్శకుడు, నిర్మాత మధూర్ బండార్కర్ వ్యాఖ్యానించాడు. 'ఫ్యాషన్' నటి మన సినిమాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందంటూ ప్రశంసలజల్లులు కురిపించారు. మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక విజయాలను చూసి దేశం గర్వించాలన్నాడు. ఆమె విజయాలు భారత ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో గుర్తించేలా చేశాయని పేర్కొన్నాడు. నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలలో నటించేందుకు ఇష్టపడే హీరోయిన్లలో ప్రియాంక ఒకరన్న విషయం తెలిసిందే. అమెరికన్ టీవీ సిరీస్ 'క్వాంటికో'తో ఆమె ప్రస్తుతం బిజీబిజీగా ఉంది. బండార్కర్ తన తదుపరి మూవీ ప్రియాంకతో చేయనున్నట్లు చెప్పాడు. ఆమెతో 'మేడమ్‌జీ' అనే ప్రాజెక్టు చేస్తానని, ఈ మూవీ నా జీవితానికి చాలా దగ్గరగా అనిపిస్తుందన్నాడు. ప్రియాంకకు కథ చాలా నచ్చిందని, నాలాగే తాను కూడా మూవీ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుందంటూ చెప్పుకొచ్చాడు. ఆమె డేట్లు దొరకకపోవడంతో షూటింగ్ ప్రారంభించలేదని, 60 రోజుల్లో ప్రాజెక్టు పూర్తవుతుందన్నాడు. ఈ 25న విడుదలకు సిద్ధంగా ఉన్న మూవీ 'క్యాలెండర్ గర్ల్స్' ప్రమోషన్లలో దర్శకుడు బండార్కర్ బిజీబిజీగా గడుపుతున్నాడు. -
వాళ్లిద్దరినీ చూశా! సినిమా తీశా!!
‘క్యాలెండర్ గళ్స్’... ఇప్పుడు హిందీ రంగంలో హాట్ టాపిక్‌గా మారిన చిత్రం ఇది. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. మేడిపండులా కనిపించే కొన్ని వ్యవస్థల వెనుక చీకటి కోణాలను ఆవిష్కరించడంలో ఆయన దిట్ట. మధుర్ గత చిత్రాలు ‘పేజ్-3’, ‘కార్పొరేట్’, ‘హీరోయిన్’, ‘ఫ్యాషన్’లే అందుకు ఉదాహరణ. ఇక, ‘క్యాలెండర్ గళ్స్’ విషయానికొస్తే... అయిదుగురు మోడల్స్ జీవితంలో జరిగే సంఘటనల నేపథ్యంలో జరిగే కథ అని ఇప్పటికే మధుర్ భండార్కర్ ప్రకటించారు. ఇద్దరు ప్రముఖ వ్యక్తుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఈ చిత్రాన్ని తెర కెక్కించా రట. వాళ్లెవరో కాదు... ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా, బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొనె. కింగ్‌ఫిషర్ క్యాలెండర్ పేరుతో ప్రతి ఏటా విజయ్ మాల్యా కొంత మంది మోడల్స్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ ఒక్క క్యాలెండర్‌తో సినిమా అవకాశాలు కొట్టేసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. వారిలో దీపికా పదుకొనే ఒకరు. అలా ఆమె బాలీవుడ్‌లోకి కూడా ఎంటరై, టాప్ పొజిషన్‌కు చేరుకున్నారు. ‘‘క్యాలెండర్ గళ్‌గా కెరీర్లో ఒక్కసారిగా తారస్థాయికి చేరిన మోడల్స్ ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించా. ప్రతి రంగంలోనూ మంచి, చెడులు ఉంటాయి. మోడలింగ్ రంగంలో కూడా అంతే. వాటినే ఈ సినిమాలో చూపించా. అంతే గానీ నేను ఆ రంగానికి వ్యతిరేకిని కాను’’ అని మధుర్ భండార్కర్ చెప్పారు. -
ఐదుగురు మోడల్స్ కథ!
కథలు ఎక్కడో పుట్టవ్. మన చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తే చాలని నమ్ముతారు హిందీ దర్శకుడు మధుర్ భండార్కర్. సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలు రూపొందించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. ‘చాందినీ బార్’, ‘పేజ్ 3’, ‘కార్పొరేట్’, ‘హీరోయిన్’ ...ఇలా ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో సమాజంలోని పాత్రలే కనిపిస్తాయి. తాజాగా, మధుర్ భండార్కర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘క్యాలెండర్ గాళ్స్’. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ప్రముఖ పారిశ్రామిక వేత్త - మద్యం వ్యాపారి విజయ్ మాల్యా గెటప్ నుంచి మధుర్ ప్రేరణ పొందారనిపిస్తోంది. ఎందుకంటే, ప్రచార చిత్రంలో ఉన్న పాత్రధారి వేషం అచ్చంగా విజయ్ మాల్యానే గుర్తుకు తెస్తోంది. ఈ పాత్రను సుహేల్ సేథ్ పోషిస్తున్నారు. ఒక ప్రముఖ క్యాలెండర్‌కి మోడలింగ్ చేయడంద్వారా ఐదుగురు మోడల్స్ ఎంత ప్రాచుర్యం సంపాదించుకున్నారు? అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఐదుగురు మోడల్స్‌గా ఆకాంక్షా పురి, అవనీ మోది, కైరా దత్, రూహీ సింగ్, సతరూపా ప్యానె నటిస్తున్నారు. -
ఎప్పటికైనా ఆయనతో చేస్తా!
మధుర్ భండార్కర్ ‘మేడమ్‌జీ’ లో హీరోయిన్‌గానే కాకుండా ఆ సినిమాతో నిర్మాతగా కూడా మారాలనుకున్నారు ప్రియాంకా చోప్రా. కానీ తన బిజీ షెడ్యూల్‌తో ప్రియాంక కోరిక తీరలేదు. ‘మేడమ్‌జీ’ కూడా సెట్‌కు వెళ్లలేదు. కానీ ఇప్పుడు ఎలాగైనా సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలని బలంగా డిసైడైపోయారామె. దాని గురించి ప్రియాంక మాట్లాడుతూ -‘‘ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ, కొత్తగా సినిమా తీయాలనే దే నా కోరిక. పైగా ఇప్పుడు రొటీన్ సినిమాలను ప్రేక్షకులను ఇష్టపడటం లేదు. హంగు, ఆర్భాటాల కన్నా విషయానికి ప్రాధాన్యమిస్తున్నారు. వారి అభిరుచికి తగ్గట్టే మనం మారాలి కదా. దానికి పెద్ద ఉదాహరణ ‘ఎన్ హెచ్ 10’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’, ‘పీకు’ చిత్రాలే. చాలా లో బడ్జెట్‌తోనే ఈ సిని మాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అందరూ అనుకుంటున్నట్టు నేను శ్రద్ధా కపూర్‌ను సంప్రతించలేదు. మా దగ్గర కథే రెడీ కానప్పుడు ఇక మేము ఎవరిని అడుగుతాం’’ అని చెప్పారు. ‘మేడమ్‌జీ’ గురించి చెబుతూ -‘‘కథ బాగా కుదిరింది. కానీ దానికి చాలా గ్రౌండ్ వర్క్ ఉంటుంది. ఇక నాకు వేరే కమిట్మెంట్స్ వ ల్ల ఈ సినిమా కుదర్లేదు. ఎప్పటికైనా మధుర్తో సినిమా చేస్తాను’’ అని ప్రియాంక చెప్పారు. -
ప్రియాంకా ‘మేడమ్‌జీ’..
‘కేలండర్ గర్ల్స్’ దర్శకుడు మధుర్ భండార్కర్ తదుపరి చిత్రం ‘మేడమ్‌జీ’లో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో కనిపించనుంది. తొలుత ఈ చిత్రం షూటింగ్ నవంబర్ 1 నుంచి మొదలవుతుందని ప్రకటించినా, ఇది అనివార్య కారణాల వల్ల నవంబర్ 30వ తేదీకి వాయిదా పడింది. ‘బాజీరావు మస్తానీ’ షూటింగ్ తర్వాత ప్రియాంకా కీళ్లనొప్పులకు గురికావడం వల్లనే ‘మేడమ్‌జీ’ షూటింగ్ వాయిదా పడినట్లు సమాచారం. రాజకీయ నాయకురాలిగా ఎదిగిన ఐటెమ్‌గర్ల్ పాత్రకు ప్రియాంకా న్యాయం చేయగలదని భండార్కర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. -
చాందినీ బార్.. మధుర్
మధుర్ భండార్కర్ దర్శకత్వంలో టబు, అతుల్ కుల్కర్ణి నటించిన ‘చాందినీ బార్’ చిత్రానికి పదమూడేళ్లు పూర్తయ్యాయి. తనకు జాతీయ అవార్డు సాధించిన పెట్టిన ఈ చిత్రం తన లైఫ్‌నే మార్చేసిందని మధుర్ భండార్కర్ చెబుతున్నాడు. ఇది తనకొక మరపురాని అనుభూతి అని ‘ట్విట్టర్’లో తన ఆనందాన్ని పంచుకున్నాడు. ‘చాందినీబార్’ సక్సెస్ తర్వాత ‘ఫ్యాషన్’, ‘పేజ్ 2’, ‘కార్పొరేట్’ వంటి విలక్షణ చిత్రాలు రూపొందించిన భండార్కర్, ప్రస్తుతం ‘క్యాలెండర్ గర్ల్స్’ను తెరకెక్కించే పనిలో నిమగ్నమై ఉన్నాడు. -
మరో అస్త్రంతో మధుర్ భండార్కర్ రెడీ!
ఇంతకుముందు ఫ్యాషన్, పేజ్3 లాంటి సినిమాలతో నగరాల్లో విశృంఖలంగా సాగుతున్న సంస్కృతిని, అందులోని భిన్న పార్శ్వాలను ఎండగట్టిన బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ ఇప్పుడు మరో అస్త్రం బయటకు తీస్తున్నారు. 'మేరీ కోమ్' సినిమా విజయంతో దూసుకెళ్తున్న ప్రియాంకా చోప్రా తొలిసారిగా నిర్మాతగా మారి.. 'మేడమ్ జీ' అనే చిత్రం తీయబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్ర్రిప్టు, ఇతర వ్యవహారాలన్నింటినీ మధుర్ భండార్కర్ చూసుకుంటున్నారు. సినిమాలో ఎవరెవరు నటిస్తారన్న విషయం ఇంకా తేలాల్సి ఉందని, అవన్నీ అయ్యేసరికి నవంబర్ అవుతుందని ప్రియాంకా చోప్రా చెబుతోంది. మేడమ్‌జీ సినిమాలో ప్రియాంకా చోప్రా ఎటూ ప్రధానపాత్రలో నటిస్తుంది. మిగిలినవాళ్ల సంగతే తేలాలి. భండార్కర్ తీసిన 'ఫ్యాషన్' సినిమాలో కూడా ఆమె నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో నటనకు ఆమెకు జాతీయ ఉత్తమనటి అవార్డు కూడా వచ్చింది. తాను మొట్టమొదటిసారిగా తీసే సినిమాకు దర్శకత్వం వహించడానికి మధుర్ భండార్కర్ అంగీకరించినందుకు తానెంతో కృతజ్ఞురాలినై ఉంటానని ప్రియాంక చెబుతోంది. -
మధుర్ భండార్కర్ ‘కేలండర్ గర్ల్స్’
బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ తన తదుపరి చిత్రం ‘కేలండర్ గర్ల్స్’ కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. తాజాగా ‘కేలండర్ గర్ల్స్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్లో బంగారు వన్నె బికినీలు ధరించిన ఐదుగురు భామల ముఖాలు కనిపించకుండా టోపీలు అడ్డుపెట్టడంతో వారెవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సినిమా పూర్తయ్యేంత వరకు వారెవరనేది గోప్యంగా ఉంచాలని భండార్కర్ భావిస్తున్నట్లు సమాచారం. ‘వీరా’తో గాయని శిబానీ తెరంగేట్రం బాలీవుడ్ గాయని శిబానీ కాశ్యప్ ‘వీరా’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేయనుంది. ఇప్పటి వరకు అడపా దడపా వీడియో ఆల్బమ్స్‌లో కనిపించిన శిబానీకి నటిగా ఇదే మొదటి చిత్రం కానుంది. ‘వీరా’లో తనకు ఆఫర్ చేసిన పాత్ర నచ్చిందని, ఇందులో పాత్ర తన జీవితానికి దగ్గరగా ఉండటంతో నటించడానికి అంగీకరించానని ఆమె చెప్పింది. పరుగు బాలుడి జీవితంపై చిత్రం నాలుగేళ్ల వయసులోనే మారథాన్ పూర్తి చేసిన ఒడిశా పరుగు బాలుడు బుధియా సింగ్ జీవితం ఆధారంగా త్వరలోనే చిత్రం తెరకెక్కనుంది. ఒరియా దర్శకుడు సౌమేంద్ర పాఢి దీని రూపకల్పన కోసం సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ చిత్రంలో బుధియా కోచ్ బిరంచి దాస్ పాత్రను బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయి పోషించనున్నాడు. -
స్వాతంత్య్ర దినోత్సవంపై బాలీవుడ్
న్యూఢిల్లీ: 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ అమితాబ్ సహా బాలీవుడ్ ప్రముఖులు జాతిజనులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్మాత శేఖర్‌కపూర్ మాట్లాడుతూ సంవత్సరంలో ఏదో ఒక్కరోజును కాకుండా కచ్చితంగా ప్రతిరోజునూ స్వాతంత్య్రదినోత్సవంగా పరిగణించాలన్నాడు. ‘ఇదొక సంఘటన కాదు. ఇదొక నిరంతర పరిణామం. ఒక దేశం ఎప్పటికీ స్వతంత్రం కాబోదు. అందులోని ప్రజలకు మాత్రమే స్వతంత్రం లభిస్తుంది’ అని అన్నాడు. నటి ప్రీతి జింతా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసింది. ‘స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు’అని అమితాబ్ ట్వీట్ చేశాడు. ‘జై భారతి. వందే భారతి’ అంటూ లతా మంగేష్కర్ ట్వీట్ చేశారు. ‘స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ శుభాకాంక్షలు. జైహో’ అని నటదర్శకురాలు ఫర్హాన్‌ఖాన్ పేర్కొన్నారు. నిర్మాత మాధుర్ భండార్కర్ మాట్లాడుతూ దేశంలో శాంతిసౌభ్రాతృత్వాలు పరిఢవించాలంటూ అభిలషించారు. వందేమాతరం అని పేర్కొన్నారు. గాయని ఆశా భోస్లే ‘జైహింద్’ అంటూ ట్వీట్ చేశారు. నటి అనుష్కశర్మ దేశసేవలో తరిస్తున్న జవానులనుఅభినందించారు. సహభారతీయులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ద్వేషం, భయాలను వంటి వాటినుంచి ఇకనైనా స్వాతంత్రం పొందాలంటూ సంగీత దర్శకుడు విశాల్ డఢ్లాని దేశప్రజలకు సూచించారు. అదే నిజమైన స్వాతంత్య్రమంటూ అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ తమ మనసులను కూడా స్వేచ్ఛగా ఉంచుకోవాలన్నారు. ఇంకా సుజయ్‌ఘోష్, ఆనంద్‌రాయ్, దియామీర్జా, వీర్‌దాస్, షాహిద్‌కపూర్, సంగీత దర్శకుడు శేఖర్ రవిజైని తమ తమ అభిమానులకు 68వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. -
భండార్కర్‌కు రాజ్‌కపూర్ అవార్డు
బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం రాజ్‌కపూర్ స్మారక అవార్డు ప్రకటించింది. ముంబైలో ఈ నెల 12న జరగనున్న కార్యక్రమంలో భండార్కర్ ఈ అవార్డును అందుకోనున్నారు. ఇదే సందర్భంగా నిన్నటి తరం బాలీవుడ్ నటి తనూజ, మరాఠీ నటి ఉమా భెండేలు రాజ్‌కపూర్ స్మారక జీవితకాల సాఫల్య అవార్డులను అందుకోనున్నారు. ‘చాందినీ బార్’, ‘పేజ్ 3’ వంటి చిత్రాలను రూపొందించిన భండార్కర్ ప్రస్తుతం ‘కేలండర్ గర్ల్స్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. బరువు తగ్గనున్న చోటా బచ్చన్ అమిత్ మెహ్రా దర్శకత్వంలో రూపొందించనున్న తన తదుపరి చిత్రం కోసం అభిషేక్ బచ్చన్ బరువు తగ్గే యత్నంలో ఉన్నాడు. చిత్రంలోని పాత్రకు అనుగుణంగా బరువు తగ్గేందుకు కొద్ది వారాలుగా ప్రశాంత్ సావంత్ అనే ఫిట్నెస్ కోచ్ శిక్షణలో కఠిన వ్యాయామాలు చేస్తున్నాడు. తిండి విషయంలోనూ నియంత్రణ పాటిస్తున్నాడు. వ్యాయామం చేయడంలో ఛోటా బచ్చన్ పూర్తి క్రమశిక్షణ పాటిస్తున్నాడని కోచ్ సావంత్ కితాబునిస్తున్నాడు. -
కథ నచ్చి నిర్మాతగా...
‘‘జీవితం చాలా విచిత్రమైనది. ఈరోజు ఉన్నట్లుగా రేపు ఉండదు. రేపు ఉన్నట్లు ఎల్లుండి ఉండదు. అందుకే ఎప్పుడేది అనిపిస్తే అది చేసేయాలి’’ అంటోంది ప్రియాంకా చోప్రా. కథానాయికగా మంచి స్థానంలో ఉన్న ప్రియాంక ఇటీవల మ్యూజికల్ ఆల్బమ్స్ కూడా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పడు ‘మేడమ్‌జీ’ చిత్రం ద్వారా నిర్మాతగా మారాలని నిర్ణయించుకుంది. మధుర్ బండార్కర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్ చేయనుంది ప్రియాంక. రాజకీయ నాయకురాలిగా మారిన ఐటమ్ సాంగ్ డాన్సర్ కథతో ఈ చిత్రం సాగుతుంది. ఈ కథ ప్రియాంకకు బాగా నచ్చడంతో ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తానని మధుర్ని అడిగిందట. అందుకు మధుర్ కూడా పచ్చజెండా ఊపారని సమాచారం. మధుర్ దర్శకత్వం వహించిన ‘ఫ్యాషన్’లో ప్రియాంక నటించడం, ఆ చిత్రం నటిగా ఆమెకు ప్లస్ కావడం తెలిసిందే. అందుకే ఆయన దర్శకత్వంలో మరో సినిమాకి అవకాశం రావడంతో ఆనందపడుతోంది ప్రియాంక. పైగా, కథ కూడా బ్రహ్మాండంగా ఉండటంతో పెట్టుబడి పెట్టాలని ఫిక్స్ అయ్యింది. మరి... నిర్మాతగా ఈ సినిమా ప్రియాంకకు ఎలాంటి అనుభూతినిస్తుందో కాలమే చెప్పాలి. -
జయలలితగా..?
ప్రియాంకా చోప్రా ఓ పక్క, ఆనందంతోనూ, మరో పక్క టెన్షన్తోనూ ఉన్నారు. ఆనందానికి కారణం ఏంటంటే - ఇద్దరు ప్రసిద్ధ మహిళల నిజజీవిత పాత్రలు చేసే అవకాశం రావడం. టెన్షన్‌కి కూడా అదే కారణం. ఎందుకంటే, ఆ పాత్ర పోషణలో ఎక్కడైనా తడబడితే తప్పుపట్టడానికి వెయ్యి నోళ్లు వెనకాడవు. బాక్సింగ్ చాంపియన్ మేరీ కోమ్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న ‘మేరీ కోమ్’ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్నారు ప్రియాంక. దీనికోసం మేరీ కోమ్ జీవితాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడంతో పాటు అసలు సిసలైన క్రీడాకారిణిగా కనిపించడానికి కొన్ని కసరత్తులు చేశారు. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే మరో నిజజీవిత పాత్ర చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో రాజకీయ నాయకురాలిగా మారిన నటి పాత్రను చేయనున్నారు. సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలను రూపొందించే మధుర్ బండార్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ‘మేడమ్‌జీ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. మాజీ నటి, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఈ పాత్రకు విద్యాబాలన్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా బాగుంటారని మధుర్ అనుకున్నా, చివరకు ప్రియాంకనే ఖరారు చేశారని బాలీవుడ్ టాక్. మామూలుగా ఏ కథానాయికతో అయినా ఒకే ఒక్క సినిమా చేసే అలవాటున్న మధుర్, ‘ఫ్యాషన్’ తర్వాత మళ్లీ ప్రియాంకను ఎంపిక చేయడం విశేషం. ఇక, జయలలితగా ఒదిగిపోవడానికి ప్రియాంక ఎలాంటి కసరత్తులు చేస్తారో చూడాలి. -
‘మేడమ్‌జీ’ ఎవరు?
వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కించడం మధుర్ భండార్కర్ స్టయిల్. ఇప్పటివరకు ఆయన దాదాపు డజను సినిమాలకు దర్శకత్వం వహిస్తే, వాటిలో ఈ కోవకు చెందిన కథాంశాలే ఎక్కువ. మధుర్ సినిమాల్లో కథానాయికలకు నటనపరంగా నిరూపించుకోవడానికి మంచి స్కోప్ ఉంటుంది. అందుకే, ఆయన సినిమాల్లో నటించడానికి చాలామంది ఆసక్తి కనబరుస్తారు. స్టార్ హీరోయిన్లు తమంతట తాము ముందుకొచ్చినా తన కథకు నప్పితేనే తీసుకుంటారు మధుర్. ప్రస్తుతం ఆయన ‘మేడమ్‌జీ’ అనే సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజకీయ నాయకురాలిగా మారిన ఓ నటి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో టైటిల్ రోల్ పోషించే అవకాశం ఏ కథానాయికకు దక్కుతుంది? అనే విషయమై బాలీవుడ్లో చర్చ జరుగుతోంది. మధుర్ మనసులో మాత్రం విద్యాబాలన్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే ఉన్నారట. ‘మేడమ్‌జీ’ పాత్రకు ఈ ముగ్గురూ బాగుంటారని ఆయన భావిస్తున్నారట. త్వరలో ఈ లలనామణులకు ఆయన ఈ చిత్రకథ చెప్పబోతున్నారని సమాచారం. ఈ కథ విన్న తర్వాత ముగ్గురిలో ఎవరు ఎక్కువగా ఎగ్జయిట్ అయితే వాళ్లని తీసుకోవాలనుకుంటున్నారట.