కరోనా సృష్టించిన మారణహోమం అంతా ఇంతా కాదు. ఆ పేరు వింటేనే యావత్ ప్రపంచం వణికిపోయింది. ఎంతో మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంది ఆ మహమ్మారి. ఎందరో ఆత్మీయులను దూరం చేసి ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఆనాటి చేదు జ్ఞాపకాలను తెరపై చూపించేందుకు వస్తోంది 'ఇండియన్ లాక్‌డౌన్' చిత్రం. కరోనా నాటి వాస్తవ పరిస్థితుల ఆధారంగా వస్తున్న ఈ చిత్రానికి మధుర్ భండార్కర్ దర్శకుడు. శ్వేత బసు ప్రసాద్, ప్రతీక్ బబ్బర్, సాయి తమంకర్, ప్రకాశ్ బెలవాడి, అహన్‌కుమ్రాలు కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది.
లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? వలస కూలీలు అనుభవించిన వేదన ఎలాంటింది? అన్ని రంగాలపై కరోనా చూపిన ప్రభావమెంత? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను మధుర్ భండార్కర్ తెరపై చూపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ జీ5 వేదికగా డిసెంబరు 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
The tragedy you know, the untold stories you don't!#IndiaLockdown teaser, premieres 2nd Dec only on #ZEE5 🙌 @jayantilalgada @PenMovies @ZEE5India @prateikbabbar @SaieTamhankar @shweta_official @AahanaKumra @pjmotionpicture @itsmeamitjoshi @i_aradhana_ @ZEE5Global pic.twitter.com/g5LxbcEYoT
— Madhur Bhandarkar (@imbhandarkar) November 8, 2022
Comments
Please login to add a commentAdd a comment