సుప్రీం గ్రీన్‌సిగ్నల్.. రేపే విడుదల!
న్యూఢిల్లీ: దర్శకుడు మధుర్ భండార్కర్ తెరకెక్కించిన 'ఇందూ సర్కార్' సినిమా విడుదలపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సినిమా విడుదలపై స్టే విధించాలన్న పిటిషన్‌ను జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అమితావ్ రాయ్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్‌లతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఈ సినిమా చట్టబద్ధ పరిమితులకు లోబడిన కళాత్మక వ్యక్తీకరణ అని పేర్కొంది.
1975లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ ఇతివృత్తంగా 'ఇందూ సర్కార్' సినిమా తెరకెక్కింది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని, వాస్తవాలను వక్రీకరించి.. పూర్తిగా కించపరిచేలా ఈ సినిమాను తెరకెక్కించారని సంజయ్‌గాంధీ కూతురిగా చెప్పుకుంటున్న ప్రియా సింగ్ పాల్ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. రేపు (శుక్రవారం) ఇందూ సర్కార్ సినిమా దేశవ్యాప్తంగా విడుదలకానుంది.