భండార్కర్‌కు రాజ్‌కపూర్ అవార్డు | Madhur Bhandarkar to get Raj Kapoor Smriti Award | Sakshi
Sakshi News home page

భండార్కర్‌కు రాజ్‌కపూర్ అవార్డు

Published Thu, Aug 7 2014 4:47 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

భండార్కర్‌కు రాజ్‌కపూర్ అవార్డు - Sakshi

భండార్కర్‌కు రాజ్‌కపూర్ అవార్డు

బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం రాజ్‌కపూర్ స్మారక అవార్డు ప్రకటించింది. ముంబైలో ఈ నెల 12న జరగనున్న కార్యక్రమంలో భండార్కర్ ఈ అవార్డును అందుకోనున్నారు. ఇదే సందర్భంగా నిన్నటి తరం బాలీవుడ్ నటి తనూజ, మరాఠీ నటి ఉమా భెండేలు రాజ్‌కపూర్ స్మారక జీవితకాల సాఫల్య అవార్డులను అందుకోనున్నారు. ‘చాందినీ బార్’, ‘పేజ్ 3’ వంటి చిత్రాలను రూపొందించిన భండార్కర్ ప్రస్తుతం ‘కేలండర్ గర్ల్స్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
 
 బరువు తగ్గనున్న చోటా బచ్చన్
అమిత్ మెహ్రా దర్శకత్వంలో రూపొందించనున్న తన తదుపరి చిత్రం కోసం అభిషేక్ బచ్చన్ బరువు తగ్గే యత్నంలో ఉన్నాడు. చిత్రంలోని పాత్రకు అనుగుణంగా బరువు తగ్గేందుకు కొద్ది వారాలుగా ప్రశాంత్ సావంత్ అనే ఫిట్‌నెస్ కోచ్ శిక్షణలో కఠిన వ్యాయామాలు చేస్తున్నాడు. తిండి విషయంలోనూ నియంత్రణ పాటిస్తున్నాడు. వ్యాయామం చేయడంలో ఛోటా బచ్చన్ పూర్తి క్రమశిక్షణ పాటిస్తున్నాడని కోచ్ సావంత్ కితాబునిస్తున్నాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement