కథ నచ్చి నిర్మాతగా... | As a producer after liking story | Sakshi
Sakshi News home page

కథ నచ్చి నిర్మాతగా...

Published Wed, May 21 2014 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM

కథ నచ్చి నిర్మాతగా...

కథ నచ్చి నిర్మాతగా...

‘‘జీవితం చాలా విచిత్రమైనది. ఈరోజు ఉన్నట్లుగా రేపు ఉండదు. రేపు ఉన్నట్లు ఎల్లుండి ఉండదు. అందుకే ఎప్పుడేది అనిపిస్తే అది చేసేయాలి’’ అంటోంది ప్రియాంకా చోప్రా. కథానాయికగా మంచి స్థానంలో ఉన్న ప్రియాంక ఇటీవల మ్యూజికల్ ఆల్బమ్స్ కూడా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పడు ‘మేడమ్‌జీ’ చిత్రం ద్వారా నిర్మాతగా మారాలని నిర్ణయించుకుంది. మధుర్ బండార్కర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్ చేయనుంది ప్రియాంక. రాజకీయ నాయకురాలిగా మారిన ఐటమ్ సాంగ్ డాన్సర్ కథతో ఈ చిత్రం సాగుతుంది. ఈ కథ ప్రియాంకకు బాగా నచ్చడంతో ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తానని మధుర్‌ని అడిగిందట. అందుకు మధుర్ కూడా పచ్చజెండా ఊపారని సమాచారం. మధుర్ దర్శకత్వం వహించిన ‘ఫ్యాషన్’లో ప్రియాంక నటించడం, ఆ చిత్రం నటిగా ఆమెకు ప్లస్ కావడం తెలిసిందే. అందుకే ఆయన దర్శకత్వంలో మరో సినిమాకి అవకాశం రావడంతో ఆనందపడుతోంది ప్రియాంక. పైగా, కథ కూడా బ్రహ్మాండంగా ఉండటంతో పెట్టుబడి పెట్టాలని ఫిక్స్ అయ్యింది. మరి... నిర్మాతగా ఈ సినిమా ప్రియాంకకు ఎలాంటి అనుభూతినిస్తుందో కాలమే చెప్పాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement