
‘‘ఈ కథలో భాగమవ్వడం ఎగ్జయిటింగ్‌గా ఉంది. మధుర్ భండార్కర్ డైరెక్షన్‌లో షూటింగ్ త్వరగా మొదలవ్వా లని ఉంది’’ అన్నారు శ్వేతా బసు.
లాక్‌డౌన్ కాన్సెప్ట్‌తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్. ‘ఇండియా లాక్‌డౌన్’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. ఇందులో ప్రతీక్ బబ్బర్, శ్వేతాబసు ప్రసాద్, ఆహనా కుమ్రా ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. కోవిడ్ వల్ల ఏర్పడ్డ లాక్‌డౌన్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి వంటి అంశాల చుట్టూ ఈ సినిమా తిరగనుందట. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని చిత్రబందం ప్రకటించింది. వచ్చే వారం ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘‘ఈ కథలో భాగమవ్వడం ఎగ్జయిటింగ్‌గా ఉంది. మధుర్ భండార్కర్ డైరెక్షన్‌లో షూటింగ్ త్వరగా మొదలవ్వా లని ఉంది’’ అన్నారు శ్వేతా బసు.
Film India Lockdown is all set to go on floor next week. Here’s a teaser poster. Give your love. ❤️ @prateikbabbar @SaieTamhankar @AahanaKumra @shweta_official @ShihabZarin #PrakashBelawadi #IndiaLockdown pic.twitter.com/ZDnsWzajeX
— Madhur Bhandarkar (@imbhandarkar) January 21, 2021