Shwetha Basu Prasad
-
ఒంపు సొంపులతో అనసూయ.. హీరోయిన్ మంజరి హాటెస్ట్ లుక్!
సోయగాలు చూపిస్తూ రెచ్చిపోయిన యాంకర్ అనసూయనడుపు ఒంపు సొంపులతో యువ నటి ప్రీతి శర్మసీనియర్ హీరోయిన్ మంజరి.. యమ హాట్ లుక్స్ఫారెన్లో ఫుల్ చిల్ అవుతున్న హీరోయిన్ శ్వేత బసుఅంబానీ పెళ్లి కోసం క్లాస్ విత్ హాట్ లుక్‌లో జాన్వీ కపూర్నవ్వుతూ మాయ చేస్తున్న హీరోయిన్ సిమ్రన్ చౌదరిఅమెరికాలో ఎంజాయ్ చేస్తున్న డస్కీ బ్యూటీ ఐశ్వర్యా రాజేశ్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Manjima Mohan (@manjimamohan) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Manjari Fadnnis 🇮🇳 (@manjarifadnis) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by Pracchi Desai (@prachidesai) View this post on Instagram A post shared by Suhana Khan (@suhanakhan2) View this post on Instagram A post shared by प्रीति शर्मा (@preethi__sharma__official) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) -
వీడియో షేర్ చేసిన శ్వేతా బసు ప్రసాద్, అప్పటికీ, ఇప్పటికీ అదే అందం..
ఎ..క..డ.., ఎ..పు..డు.. ఇలా దీర్ఘాలు తీస్తూ మాట్లాడుతూ.. ముద్దుముద్దు మాటలతో ఫేమస్ అయింది శ్వేతా బసు ప్రసాద్. తన నవ్వుతో, యాక్టింగ్‌తో యూత్ ఫేవరెట్ హీరోయిన్గా మారిన ఆమె ఆ తర్వాత మాత్రం తన ఛార్మ్ కోల్పోతూ వచ్చింది. కొత్త బంగారు లోకంతో స్టార్డమ్ సంపాదించిన ఈమె ఆ తర్వాత మాత్రం దాన్ని కాపాడుకోలేకపోయింది. తన హవా తగ్గిపోవడంతో ఐటం సాంగ్‌లోనూ నటించింది. ఆమె చివరగా విజేత సినిమాలో నటించింది. అనంతరం ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చి అక్కడే సెటిలైంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ఇందులో శ్వేతా బసు ప్రసాద్ సితార వాయించింది. 'హోటల్ గదిలో అసిస్టెంట్ డైరెక్టర్స్, నా టీమ్ మొత్తానికి చిన్నపాటి కచేరీ చేశాను. షూటింగ్ కోసం లొకేషన్‌కు వెళ్లడానికి ముందు అంటే సుమారుగా 6.45 గంటల ప్రాంతంలో ఈ కచేరీ జరిగింది' అని ట్విటర్లో రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ 'మీలో చాలా టాలెంట్ దాగి ఉంది', 'అప్పటికీ, ఇప్పటికీ అదే అందం' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా శ్వేతా 18 ఏళ్ల వయసులోనే సితార నేర్చుకుంది. కాగా తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగిన శ్వేతా బసు ప్రసాద్ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. గతంలో వ్యభిచార రాకెట్లో పట్టుబడినా తిరిగి నిలదొక్కుకుంది. కానీ ఈ ఘటన తన కెరీర్‌ను తీవ్రంగా దెబ్బకొట్టింది. 2018లో దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను పెళ్లాడగా మరుసటి ఏడాదే విడాకులు ఇచ్చేసింది. ప్రస్తుతం సింగిల్‌గా ఉంటూ ఓటీటీలో తనకు నచ్చిన పాత్రలు చేసుకుంటూ పోతోంది. ఆమె ఓటీటీలో చివరగా జూబ్లీ వెబ్ సిరీస్‌లో కనిపించింది. A little mini concert at my hotel room for my team and the AD (assistant directors) team before heading out for the shooting location 😁😁 6:45 am #Rajasthan #shwetabasuprasad#sitar pic.twitter.com/g0eusx13xi — Shweta Basu Prasad (@shweta_official) June 28, 2023 View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) చదవండి: సలార్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ -
కొత్త బంగారు లోకం హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?
కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్వేతా బసు ప్రసాద్. అమాయకపు చూపు, నిష్కల్మషమైన నవ్వుతో తొలి చిత్రంతోనే ఎంతోమంది గుండెలు కొల్లగొట్టిందీ హీరోయిన్. టాలీవుడ్లో ఫస్ట్ సినిమాతోనే కావాల్సినంత పాపులారిటీ వచ్చినా దాన్ని కాపాడుకోలేకపోయింది. సినిమాల ఎంపికలో తప్పటడుగులు వేసి వరుస ఫ్లాపులు కొనితెచ్చుకుంది. తర్వాత జీనియస్ సినిమాలో డిబిరి డిబిరి అనే ఐటం సాంగ్‌లోనూ ఆడిపాడింది. ఏడేళ్లపాటు తెలుగు తెరకు దూరమైన ఆమె 2018లో విజేతతో పలకరించింది. కానీ ఈ సినిమా కూడా ఆమెకు మంచి కమ్‌బ్యాక్ ఇవ్వలేకపోయింది. దీంతో టాలీవుడ్‌ను వదిలి హిందీలోనే సినిమాలు, సిరీస్‌లు, సీరియళ్లు చేసుకుంటోంది. కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు చూసిందీ హీరోయిన్. 2018లో డైరెక్టర్ రోహిత్ మిట్టల్‌ను పెళ్లాడగా విభేదాల కారణంగా మరుసటి ఏడాదే విడాకులు ఇచ్చేసింది. కాగా బుధవారం (జనవరి 11న) ఆమె బర్త్‌డే. ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లు.. కొన్నింటిలో శ్వేతను అసలు గుర్తుపట్టలేకుండా ఉన్నామని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) చదవండి: ఇన్నాళ్లకు మళ్లీ కన్నీళ్లు వచ్చాయి: దిల్ రాజు క్యాన్సర్‌తో చచ్చిపోయినా సరే కానీ ట్రీట్మెంట్ వద్దన్నా: సంజయ్ దత్ -
రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లా: శ్వేతాబసు ప్రసాద్
'కొత్త బంగారు లోకం'తో టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి పెట్టినప్పటికీ తర్వాత చేసిన సినిమాలు నిరాశనే మిగిల్చాయి. అదే సమయంలో సెక్స్ రాకెట్లో ఇరుక్కోవడంతో విమర్శలపాలైంది. కానీ తర్వాతి కాలంలో ఈ కేసులో ఆమె నిర్దోషిగా తేలింది. మరోవైపు బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను పెళ్లాడినప్పటికీ, ఏడాది తిరిగేలోగా వారు విడాకులు తీసుకున్నారు. ఇలా వ్యక్తిగత జీవితంలో సమస్యలు వెంటాడటంతో ఆమె కెరీర్ అర్ధాంతరంగా ఆగిపోయింది. తెలుగులో సరైన హిట్టు లేకపోవడంతో బాలీవుడ్‌కు మకాం మార్చిన ఆమె ప్రస్తుతం "ఇండియా లాక్డౌన్" అనే సినిమా చేస్తోంది. ఇందులో ఆమె సెక్స్ వర్కర్ మెహ్రునిస్సాగా కనిపించనుంది. లాక్డౌన్లో ఎవరెవరు ఎలాంటి ఇబ్బందులను చవిచూశారన్న అంశంతో మధుర్ బండార్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కోవిడ్ లాక్డౌన్ వల్ల అన్ని రంగాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ముంబైలోని రెడ్‌లైట్ ప్రాంతంలో నివసించే సెక్స్ వర్కర్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారో స్వయంగా తెలుసుకోవాలనుకుంది శ్వేతా. ఇందుకోసం ముంబైలోని రెడ్‌లైట్ ఏరియా కామాటిపురను సందర్శించిందట. (చదవండి: ఏ సినిమాకు శ్వేతా జాతీయ అవార్డు అందుకున్నారు?) ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. "నేను చేసే పాత్రలు నిజమని నమ్ముతాను, అందులో లీనమైపోతాను. లేదంటే ప్రేక్షకులు ఆ పాత్రతో మమేకం కాలేరు. నా పాత్ర ఇంకా మెరుగ్గా వచ్చేందుకు మధుర్ సర్, నేను, నా టీమ్ మొత్తం రెండు వారాల క్రితం కామాటిపుర వెళ్లాం. అక్కడ వారి యాసను బట్టి నేను సినిమాలో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నా. అంతే కాకుండా వాళ్ల ఆలోచనా విధానం ఎలా ఉంది? వారి జీవితాలేంటో తెలుసుకున్నా. లాక్డౌన్ వాళ్ల వ్యాపారం మీదనే కాదు, వారి జీవితాల మీద కూడా గట్టి దెబ్బ కొట్టింది. కానీ అక్కడకు వెళ్లడం లైఫ్‌టైమ్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలిచింది. ముఖ్య విషయమేంటంటే నేను అక్కడ మెహ్రునిస్సాను కలిశా. అచ్చంగా నా పాత్రే కళ్లముందు కనిపించినట్లైంది. కనుక నా పాత్రను ఆమెకు అంకితం చేస్తున్నా" అని చెప్పుకొచ్చింది. బాలీవుడ్లో ఇప్పటివరకు పలువురు నటీమణులు వేశ్యపాత్రలను పోషించారు. చాందినీ బార్(2001)లో టబు, చమేలీ(2003)లో కరీనా కపూర్, ట్రాఫిక్ సిగ్నల్(2007)లో కొంకొణ సెన్శర్మ, మండీ(1983)లో శబానా అజ్మీ, స్మిత పాటిల్ సెక్స్ వర్కర్లుగా కనిపించిన విషయం తెలిసిందే. (చదవండి: ఇష్టమైన ఆహారంపై స్పష్టతనిచ్చిన ప్రియాంక చోప్రా) -
ఇండియా లాక్డౌన్.. టైటిల్ పోస్టర్ విడుదల
లాక్డౌన్ కాన్సెప్ట్‌తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్. ‘ఇండియా లాక్డౌన్’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. ఇందులో ప్రతీక్ బబ్బర్, శ్వేతాబసు ప్రసాద్, ఆహనా కుమ్రా ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. కోవిడ్ వల్ల ఏర్పడ్డ లాక్డౌన్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి వంటి అంశాల చుట్టూ ఈ సినిమా తిరగనుందట. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని చిత్రబందం ప్రకటించింది. వచ్చే వారం ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘‘ఈ కథలో భాగమవ్వడం ఎగ్జయిటింగ్‌గా ఉంది. మధుర్ భండార్కర్ డైరెక్షన్లో షూటింగ్ త్వరగా మొదలవ్వా లని ఉంది’’ అన్నారు శ్వేతా బసు. Film India Lockdown is all set to go on floor next week. Here’s a teaser poster. Give your love. ❤️ @prateikbabbar @SaieTamhankar @AahanaKumra @shweta_official @ShihabZarin #PrakashBelawadi #IndiaLockdown pic.twitter.com/ZDnsWzajeX — Madhur Bhandarkar (@imbhandarkar) January 21, 2021 -
లాయర్ రేఖ
ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా హీరోయిన్లు ఆ ట్రెండ్‌ను బాగా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సమంత, తమన్నా, ప్రియమణి, కాజల్ అగర్వాల్, అమలాపాల్ వంటి హీరోయిన్లు వెబ్ సిరీస్‌లలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ‘కొత్తబంగారు లోకం’ ఫేమ్ శ్వేతాబసు ప్రసాద్ ఈ జాబితాలో చేరిపోయారు. ‘డాక్టర్ డాన్’ అనే వెబ్ సిరీస్‌లో రేఖ అనే లాయర్ పాత్రలో కనిపించనున్నారు శ్వేతాబసు. 1995–2003 మధ్యకాలంలో ఐఐటీ, ఏమ్‌బీబీఎస్, ఐఏఎస్, ఐపీఎస్ ఎంట్ర¯Œ ్స ఎగ్జామ్స్ పేపర్స్‌ను లీక్ చేయడంలో ఓ ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి జీవితం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపుదిద్దుకోనుందని బాలీవుడ్ సమాచారం. ఈ విషయంపై శ్వేతాబసు మాట్లాడుతూ–‘‘ఆత్మవిశ్వాసం, మానసిక బలం మెండుగా ఉన్న లాయర్ రేఖ పాత్రలో నటించడానికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను. నమ్మిన వ్యక్తే విల¯Œ కు సాయం చేస్తున్నాడని రేఖ తెలుసుకునే సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తాయి. కొన్ని కథలకు ఇప్పటి రోజుల్లో వెబ్ సిరీస్‌లే సరైనవి’’ అన్నారు శ్వేతాబసు ప్రసాద్. ‘కొత్తబంగారులోకం’ (2008) సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయి¯Œ శ్వేతాబసుప్రసాద్. ఆ తర్వాత తెలుగులో ‘కాస్కో’ (2009), ‘రైడ్’ (2009) వంటి చిత్రాల్లో నటించారు. ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంటా..’(2012) చిత్రం తర్వాత శ్వేతాబసు ప్రసాద్ మరో తెలుగు సినిమాలో నటించలేదు. -
విడాకులపై పెదవి విప్పిన నటి శ్వేతాబసు
తెలుగులో 'కొత్త బంగారు లోకం' చిత్రంతో ప్రేక్షకుల మదిని దోచుకున్న నటి శ్వేతాబసు ప్రసాద్. ఆ తర్వాత అనేక సినిమాలు చేసినా అవేవీ ఆమెకు పెద్దగా పేరు తెచ్చిపెట్టలేకపోయాయి. అయితే.. శ్వేతాబసు 2018లో రోహిత్ మిట్టల్ అనే డైరెక్టర్ని పెళ్లాడిన విషయం తెలిసిందే. పెళ్లయిన కొద్ది రోజులకే వారి వైవాహిక దాంపత్యంపై అనేక ఊహాగానాలు వెలువడగా.. తాజాగా ఈ విషయంపై శ్వేతాబసు క్లారిటీ ఇచ్చింది. మేం చట్టపరంగా విడాకులకు దరఖాస్తు చేసుకున్నాం కానీ.. భార్యాభర్తల కంటే ముందు నుంచి తాము మంచి స్నేహితులమని చెప్పింది. అతడు అద్భుతమైన దర్శకుడు. ఏదో ఒకరోజు మళ్లీ కలిసి పనిచేస్తామన్న నమ్మకముంది. మేం ఐదేళ్లుగా ఎంతో ప్రేమగా, ఆరోగ్యంగా నిజాయితీగా అనుబంధాన్ని కొనసాగించాం. రోహిత్, తాను పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకొని విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రతి పుస్తకాన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదవలేమని, అంతమాత్రాన ఆ పుస్తకం చెడ్డది కాదని, తమ వైవాహిక జీవితం కూడా ఓ అసంపూర్ణ పుస్తకం లాంటిదేనని నిర్వేదం వెలిబుచ్చింది. విడిపోయినా తాము ఎప్పటికీ స్నేహితుల్లానే ఉంటామని శ్వేతా స్పష్టం చేసింది. (దారుణం: 17వ తేదీన పెళ్లి.. 18న గ్యాంగ్ రేప్) -
స్క్రీన్ టెస్ట్
కొత్త సంవత్సరం వచ్చింది. కొత్త నిర్ణయాలు, కొత్త ఆశయాలు, కొత్త కలలు... ఏడాదంతా బాగుండాలనే పాజిటివ్ ఫీలింగ్‌తో 2019 స్టార్ట్ అయింది. సంవత్సరంలో తొలి నెల, తొలి వారంలో ‘తొలి కబుర్లు’ ఈ వారం క్విజ్ స్పెషల్. 1. సిల్వర్ స్క్రీన్‌పై మొదటిసారి యన్టీఆర్ నటించిన చిత్రం ‘మన దేశం’. కానీ యన్టీఆర్ ఏ చిత్రం ద్వారా మాస్ హీరోగా చిత్రపరిశ్రమలో నిలబడ్డారో తెలుసా? ఎ) పాతాళ భైరవి బి) గులేబకావళి కథ సి) గుండమ్మకథ డి) పాండవ వనవాసం 2. ప్రముఖ నటి విజయశాంతి తెలుగులో నటించిన మొదటి సినిమా ‘కిలాడి కృష్ణుడు’. ఆ చిత్రంలో హీరో ఎవరో చెప్పుకోండి? ఎ) చిరంజీవి బి) మోహన్‌బాబు సి) నాగార్జున డి) కృష్ణ 3. తెలుగులో మొట్టమొదటి సూపర్‌స్టార్ ఈ ప్రముఖ నటి. ఆమె నటి, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, సింగర్, రచయిత. ఇంతకీ ఆమెఎవరు? ఎ) అంజలీదేవి బి) జమున సి) సావిత్రి డి) భానుమతి 4. తెలుగులో వచ్చిన మొదటి 70 యం.యం సినిమా పేరేంటో తెలుసా? ఎ) అల్లూరి సీతారామరాజు బి) ఈనాడు సి) తెలుగువీర లేవరా డి) సింహాసనం 5. ‘బంగారక్క’ చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్గా పరిచయమైన నటి ఎవరో తెలుసా? ఎ) రాధ బి) జయప్రద సి) శ్రీదేవి డి) సుహాసిని 6. తాను హీరోయిన్గా నటించిన మొదటి చిత్రం హీరోనే పెళ్లి చేసుకున్న నటి ఎవరో కనుక్కోండి? ఎ) శ్రియ బి) సమంత సి) శ్వేతాబసు ప్రసాద్ డి) స్వాతి 7. నటుడు నాని నటించిన మొదటి చిత్రదర్శకుడెవరో చెప్పుకోండి? ఎ) ఇంద్రగంటి మోహనకృష్ణ బి) ‘పిల్లజమిందార్’ అశోక్ సి) సత్యం బెల్లంకొండ డి) నందినీరెడ్డి 8. వెంకటేశ్ నటించిన మొదటి చిత్రం ‘కలియుగ పాండవులు’. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయమైన ప్రముఖ నటి ఎవరో తెలుసుకుందామా? ఎ) నగ్మా బి) ఖుష్బూ సి) సౌందర్య డి) రోజా 9. ‘సిరివెన్నెల’ చిత్రంలో పాటలు రాసినందుకు ఆయనకు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అనే పేరొచ్చింది. రచయితగా ఆయన తొలి సినిమా హీరో ఎవరో తెలుసా? ఎ) సర్వధమన్ బెనర్జీ బి) బాలకృష్ణ సి) సోమయాజులు డి) కృష్ణంరాజు 10. ప్రముఖ గాయకుడు యస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏ హీరోకి తన మొదటి తెలుగు సినిమా పాట పాడారో తెలుసా? ఎ) శోభన్‌బాబు బి) చంద్రమోహన్ సి) రంగనాథ్ డి) గిరిబాబు 11. రామ్‌గోపాల్ వర్మ ‘రక్తచరిత్ర’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ నటి ఎవరు? ఎ) ఊర్మిళా మటోండ్కర్ బి) మైరా సరీన్ సి) రాధికా ఆప్టే డి) నిషా కొఠారి 12. ‘మంచి మనుషులు’ చిత్రంలో బాలనటునిగా నటించిన నటుడెవరు? చిన్న క్లూ: హీరోగా మెప్పించి, ఇప్పుడు నటుడిగా చాలా బిజీగా ఉన్నారాయన? ఎ) జగపతిబాబు బి) వెంకటేశ్ సి) నాగార్జున డి) కమల్‌హాసన్ 13. సుకుమార్‌కి దర్శకునిగా తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత ఎవరో కనుక్కోండి? ఎ) అశ్వనీదత్ బి) సురేశ్‌బాబు సి) ‘దిల్’ రాజు డి) అల్లు అరవింద్ 14. అఖిల్ హీరోగా పరిచయమైన చిత్రం ‘అఖిల్’. ఆ చిత్రానికి దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) శ్రీను వైట్ల బి) వీవీ వినాయక్ సి) పూరి జగన్నాథ్ డి) విక్రమ్ కె. కుమార్ 15. దేవిశ్రీ ప్రసాద్‌కి సంగీత దర్శకునిగా తొలి చిత్రం ‘దేవి’. ఆ చిత్రాన్ని యం.యస్. రాజు నిర్మించారు. చిత్ర దర్శకుడెవరు? ఎ) కోడి రామకృష్ణ బి) కృష్ణవంశీ సి) ఈవీవీ డి) శ్రీను వైట్ల 16. దర్శకుడు పూరీ జగన్నాథ్ 2000లో ఏ చిత్రం ద్వారా దర్శకునిగా మెగా ఫోన్ పట్టారో తెలుసా? ఎ) బాచీ బి) బద్రి సి) ఇడియట్ డి) శివమణి 17. నటుడు సుమంత్ హీరోగా పరిచయమైన చిత్రం ‘ప్రేమకథ’. ఆ చిత్రంలో సుమంత్ సరసన నటించిన నటి ఎవరు? ఎ) ఆంత్ర మాలి బి) ప్రీతీ జింతా సి) ప్రీతీ జింగ్యాని డి) అంజలా జవేరి 18. బాలీవుడ్ ప్రముఖ నటి కంగనారనౌత్ నటించిన ఒకే ఒక్క తెలుగు చిత్రానికి దర్శకుడు పూరి జగన్నాథ్. మరి ఆ చిత్ర హీరో ఎవరో తెలుసా? ఎ) మహేశ్‌బాబు బి) నితి¯Œ ∙సి) రానా డి) ప్రభాస్ 19. దాసరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘తాతా మనవడు’. ఆ చిత్రంలో తాతగా యస్వీఆర్ నటించారు. మరి మనవడిగా మురిపించిన నటుడెవరో గుర్తుందా? ఎ) చలం బి) శరత్‌బాబు సి) రాజనాల డి) రాజబాబు 20. హీరో రామ్ కెరీర్లో తొలి హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) హన్సిక బి) జెనీలియా సి) ఇలియానా డి) అక్ష మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) డి 3) డి 4) డి 5) సి 6) బి 7) ఎ 8) బి 9) ఎ 10) ఎ 11) సి 12) ఎ 13) సి 14) బి 15) ఎ 16) బి 17) ఎ 18) డి 19) డి 20) సి నిర్వహణ: శివ మల్లాల -
ముడిపడింది
నాలుగేళ్ల ప్రేమబంధాన్ని మూడు ముళ్లతో మరింత బలంగా మార్చుకున్నారు శ్వేతా బసు ప్రసాద్. డిసెంబర్ 13న తన బాయ్‌ఫ్రెండ్, బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకున్నారు. ఈ వేడుక పూణేలో జరిగింది. పెళ్లిలో బెంగాలీ పెళ్లి కూతురిలా రెడీ అయ్యారు శ్వేతా. రోహిత్ బ్లాక్ షేర్వాణీలో కనిపించారు. ఈ పెళ్లి ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు శ్వేతా. బాలీవుడ్లో పెళ్లిల ట్రెండ్ కంటిన్యూ చేస్తూ ఈ జంట ఒకటయ్యారు. శ్వేతాబసు, రోహిత్ శ్వేతాబసు -
పెళ్లికళ వచ్చేసింది
సినిమా ఇండస్ట్రీలో ఏది జరిగినా ఒక ట్రెండ్‌లా నడుస్తుంటుంది. ఒక సినిమా హిట్ అయితే అలాంటి ఫార్ములాతో వరుసగా సినిమాలు వస్తుంటాయి. ఇప్పుడు బాలీవుడ్లో పెళ్లిళ్ల ట్రెండ్ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. మొన్నే ‘దీప్‌వీర్’ (దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్) ఒక్కటయ్యారు. డిసెంబర్ 2న ప్రియానిక్ (ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్) జో«ద్‌పూర్‌లో పెళ్లి చేసుకోనున్నారు. పెళ్లి పనులన్నీ సక్రమంగా జరగాలని ముంబైలోని ప్రియాంకా చోప్రా నివాసంలో బుధవారం పూజ చేశారు. పెళ్లి పీటలెక్కనున్న ఈ జాబితాలోకి తాజాగా రాఖీ సావంత్, శ్వేతాబసు ప్రసాద్ చేరారు. శ్వేతాబసు ప్రసాద్ బాయ్‌ఫ్రెండ్, దర్శకుడు రోహిత్ మిట్టల్ జూన్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 13న వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారని బాలీవుడ్ టాక్. మరోవైపు ఎప్పటికప్పుడు ఏదోఒక సెన్సేషన్తో వార్తల్లో నిలిచే రాఖీసావంత్ కూడా పెళ్లి కూతురు కాబోతున్నట్టు ప్రకటించారు. టెలివిజన్ యాక్టర్ దీపక్ కలాల్‌ను వివాహం చేసుకోబుతున్నట్టు సోషల్ మీడియాలో తెలిపారామె. డిసెంబర్ 31 సాయంత్రం 5: 55 నిమిషాలకు వీరి వివాహం లాస్ ఏంజెల్స్‌లో జరగనున్నట్టు పేర్కొన్నారు. ‘‘మేం ఒక్కటవ్వాలనుకుంటున్నాం. ఇండస్ట్రీలో చాలా మంది ఒక్కటవుతున్నారు. ఇదే రైట్ టైమ్ అనిపించింది. అందరి ఆశీర్వాదం మాకు కావాలి’’ అని రాఖీ సావంత్ బాలీవుడ్ మీడియాకు తెలిపారు. సో.. బాలీవుడ్‌కి పెళ్లికళ వచ్చేసిందన్నమాట. -
ప్రతీ ప్రయాణానికి ముగింపు ఉంటుంది : శ్వేతా బసు
కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన శ్వేతా బసు ప్రసాద్ తరువాత వివాదాలతో వెండితెరకు దూరమైంది. లాంగ్ గ్యాప్ తరువాత సిల్వర్ స్క్రీన్ మీద రీ ఎంట్రీకి ట్రై చేసినా ఆశించిన స్థాయిలో అవకావాలు రాలేదు. దీంతో బుల్లితెర మీద దృష్టిపెట్టింది. ఏక్తా కపూర్ నిర్మాణంలో తెరకెక్కిన చంద్రనందిని సీరియల్ ప్రధాన పాత్రలో నటించింది. అయితే ఈ సీరియల్ షూటింగ్ పూర్తి కావటం సోషల్ మీడియాలో స్పందించిన శ్వేతా ఆవేదన వ్యక్తం చేసింది. ‘ప్రతీ ప్రయాణానికి ఒక ముగింపు ఉంటుంది. ప్రస్తుతం నా భావాలను చెప్పేందుకు మాటలు సరిపోవటం లేదు. నాకు ఈ అవకావం ఇచ్చిన ఏక్లా కపూర్ కు కృతజ్ఞతలు. చంద్రనందిని సీరియల్ కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ నా కృతజ్ఞతలు. సీరియల్‌ను ఆదరించిన అభిమానులకు కూడా థ్యాంక్స్’ అంటూ తన ఫేస్ బుక్ పేజ్‌లో సుధీర్ఘమైన స్పందనను తెలిపింది. Every journey comes to an end and so has the journey of Chandra Nandini. I fail to find words to express my mixed emotions right now. Thank you @ektaravikapoor for this lovely experience. I thank the entire cast and crew of Chandra Nandini - the creative team, the directors, co actors, make up, hair, setting, camera, spot, production departments ❤️ I thank my friends and family for their constant love and support. And above all, I bow my head and join my hands to thank all the Chandra Nandini fans, our audience for so much love and making Maharani Nandini so unforgettable 🙂 @starplus #chandranandni 🤗 Sujata Rao Chloe Ferns Ruchikaa Kapoor Anil Jha Arpit Ranka Papia Sengupta Saanvi Talwar Manoj Kolhatkar Ranjan Singh Mukesh Kumar Singh Hamavvand Chwda Pankhuri Priyadarshani 🙏🏻 Posted by Shweta Basu Prasad on Wednesday, November 1, 2017 -
హైదరాబాద్ టు షిరిడీ
సువర్ణ సుందరిగా శ్వేతాబసు ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘మిక్చర్ పొట్లం’. జయంత్, గీతాంజలి ఓ జంటగా ఏంవీ సతీశ్‌కుమార్ దర్శకత్వంలో కలపటపు శ్రీలక్షీప్రసాద్, కంటె వీరన్నచౌదరి, లంకలపల్లి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా ఆడియో సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ‘‘ఫస్ట్ కాపీ సిద్ధమైంది. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. ‘‘హైదరాబాద్ నుంచి షిరిడీ బయలుదేరిన సువర్ణ సుందరి ట్రావెల్స్ బస్సును కొందరు హైజాక్ చేస్తారు. వాళ్ల డిమాండ్స్ ఏంటి? ఏం జరిగింది? అనేది కథ’’ అన్నారు దర్శకుడు. భానుచందర్, సుమన్, పోసాని, కృష్ణభగవాన్ నటించిన ఈ చిత్రానికి సంగీతం: మాధవపెద్ది సురేశ్‌చంద్ర.