హైదరాబాద్‌ టు షిరిడీ | Mixture Potlam Movie Audio Success Meet | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ టు షిరిడీ

Published Sat, Mar 11 2017 10:41 PM | Last Updated on Tue, Sep 5 2017 5:49 AM

హైదరాబాద్‌ టు షిరిడీ

హైదరాబాద్‌ టు షిరిడీ

సువర్ణ సుందరిగా శ్వేతాబసు ప్రసాద్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘మిక్చర్‌ పొట్లం’. జయంత్, గీతాంజలి ఓ జంటగా ఏంవీ సతీశ్‌కుమార్‌ దర్శకత్వంలో కలపటపు శ్రీలక్షీప్రసాద్, కంటె వీరన్నచౌదరి, లంకలపల్లి శ్రీనివాస్‌ నిర్మించిన ఈ సినిమా ఆడియో సక్సెస్‌ మీట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ‘‘ఫస్ట్‌ కాపీ సిద్ధమైంది. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. ‘‘హైదరాబాద్‌ నుంచి షిరిడీ బయలుదేరిన సువర్ణ సుందరి ట్రావెల్స్‌ బస్సును కొందరు హైజాక్‌ చేస్తారు. వాళ్ల డిమాండ్స్‌ ఏంటి? ఏం జరిగింది? అనేది కథ’’ అన్నారు దర్శకుడు. భానుచందర్, సుమన్, పోసాని, కృష్ణభగవాన్‌ నటించిన ఈ చిత్రానికి సంగీతం: మాధవపెద్ది సురేశ్‌చంద్ర.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement