Audio Success Meet
-
గ్రాండ్‌గా ఐక్యూ ఆడియో ఫంక్షన్ (ఫొటోలు)
-
హైదరాబాద్ టు షిరిడీ
సువర్ణ సుందరిగా శ్వేతాబసు ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘మిక్చర్ పొట్లం’. జయంత్, గీతాంజలి ఓ జంటగా ఏంవీ సతీశ్‌కుమార్ దర్శకత్వంలో కలపటపు శ్రీలక్షీప్రసాద్, కంటె వీరన్నచౌదరి, లంకలపల్లి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా ఆడియో సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ‘‘ఫస్ట్ కాపీ సిద్ధమైంది. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. ‘‘హైదరాబాద్ నుంచి షిరిడీ బయలుదేరిన సువర్ణ సుందరి ట్రావెల్స్ బస్సును కొందరు హైజాక్ చేస్తారు. వాళ్ల డిమాండ్స్ ఏంటి? ఏం జరిగింది? అనేది కథ’’ అన్నారు దర్శకుడు. భానుచందర్, సుమన్, పోసాని, కృష్ణభగవాన్ నటించిన ఈ చిత్రానికి సంగీతం: మాధవపెద్ది సురేశ్‌చంద్ర. -
నేను విద్వాంసుణ్ణి కాదు.. నిత్య విద్యార్థిని : కేజే ఏసుదాసు
‘‘మా నాన్నే నా తొలి గురువు. ఐదో ఏట సంగీత సాధన ప్రారంభించా. ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నా. ఎప్పుడైతే మనకన్నీ తెలుసనుకుంటామో అక్కడితో మన వృద్ధి ఆగినట్లే. నేను నిత్య విద్యార్థినే.. విద్వాంసుణ్ణి కాదు. ఇతర భాషల సంస్కృతి నేర్చుకున్నప్పటికీ.. మన భారతీయ సంస్కృతిని గౌరవించడం నేర్చుకోవాలి. మన సంస్కృతి గురించి తెలుసుకోవాలి’’ అని ప్రముఖ గాయకులు కేజే ఏసుదాసు అన్నారు. ఆర్పీ పట్నాయక్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘మనలో ఒకడు’. గురజాల జగన్మోహన్ నిర్మాత. ఆర్పీనే స్వరకర్త. పాటలకు ప్రేక్షకాదరణ లభించిన నేపథ్యంలో తిరుపతిలో మిలియన్ క్లిక్స్ వేడుక పేరుతో ఆడియో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు ఏసుదాసు హాజరయ్యారు. ‘‘ఇప్పుడు ప్రేక్షకులు సీడీల కంటే క్లిక్స్కి అలవాటు పడ్డారు. మిలియన్ క్లిక్స్ అంటే రెండున్నర లక్షల సీడీలు అమ్ముడ యినట్లే’’ అని ఆర్పీ అన్నారు. ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే సుగుణమ్మ, చిత్ర నిర్మాత జగన్మోహన్, పాటల రచయితలు చైతన్య ప్రసాద్, వనమాలి, పులగం చిన్నారాయణ, సహ నిర్మాతలు ఉమేశ్గౌడ, బాలసుబ్రమణ్యం, క్రియేటివ్ హెడ్ గౌతమ్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సరదాగా..‘చిరు’
సాక్షి,సిటీబ్యూరో: ఫిలింనగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం రాత్రి శ్రీరస్తు శుభమస్తు సినిమా ఆడియో సక్సెస్ మీట్లో చిరంజీవి సందడి చేశారు. కార్యక్రమంలో అల్లు శిరీష్, లావణ్యత్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. -
'రెండు జతల బట్టలతో మద్రాసు వెళ్లాను’
తిరుపతి : డిసెంబర్ 25న జనం ముందుకు రా నున్న ‘మామమంచు- అల్లుడు కంచు’ సినిమా కుటుంబానికి వినోదాన్ని అందించే మంచి సినిమా అని పద్మశ్రీ డాక్టర్ ఎం.మోహన్‌బాబు అన్నారు. ఈ సినిమా ఆడియో సక్సెస్ మీట్ శనివారం రాత్రి తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో మో హన్ బాబు మాట్లాడుతూ తన నట జీవితంలో 560 సినిమాల్లో నటించానన్నారు. సినీ జీవితం లో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాలో నటించినట్టు చెప్పారు. పిల్లలు పెద్దవారు కావడంతో బాధ్యతలన్నీ వారికి అప్పగిం చినట్టు చెప్పారు. ఏడాదిలో ఏదో ఒక సినిమా చేయాలని ఉద్దేశంతో ఈ సినిమాలో నటిం చినట్టు చెప్పారు. నాతోపాటు మరో నటుడు కావాలనుకున్నప్పుడు ఈ పాత్రకు అల్లరి నరేష్ కరెక్టని మంచు విష్ణు అతన్ని తీసుకువచ్చాడన్నారు. ఆ పాత్రకు అల్లరి నరేష్ న్యాయం చేశారన్నారు. ఇద్దరం పోటీపడి నటించామన్నారు. ఏదో సాధించాలని రెండు జతల బట్టలతో మద్రాసుకు వెళ్లానన్నారు. అయితే ఆదిలోనే నువ్వు చిత్తూరు వాడివి, నీకు భాషరాదని అగౌరవ పరచారన్నారు. అయినా ధైర్యంగా ముందుకు సాగి, నటుడుగా శిఖరాగ్రాన్ని చేరుకున్నానన్నా రు. నా తర్వాత నా తమ్ముడు మోహన్‌బాబే డైలాగ్ చెప్పడంలో దిట్టని అన్నగారు ఎన్టీఆర్ చేత శభాష్ అనిపించుకున్నానన్నారు. నా ఊపి రి, శ్వాస, ధ్యాస, చివరకు నేను తినే తిండి సినిమాలేనని అన్నారు. సినిమా నిర్మాత మంచు విష్ణు మాట్లాడుతూ కథ, సంగీతం, దీనికి తోడు మోహన్‌బాబు, అల్లరినరేష్ నటన సినిమాకు పెద్ద హైలెట్ అని తెలిపారు. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతారని అభిప్రాయపడ్డారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ తండ్రి సమానులైన మోహన్‌బాబు జిల్లా వాసికావడం మనందరి గౌరవాన్ని పెం చిందన్నారు. కేవలం సినీ దిగ్గజమే కాక ఆయనలో మంచి రాజకీయవేత్త, పారిశ్రామిక వేత్త, విద్యావేత్తగా ఉన్నత శిఖరాలను చేరుకున్న వ్యక్తి అని కొనియాడారు. అనంతరం సినీ టెక్నీషియన్లు, ఇతర నటులు నటులకు జ్ఞాపికలు అందజేశారు. సినిమా ట్రైలర్‌ను మంచు మనోజ్ ఆవిష్కరించారు. -
S/O సత్యమూర్తి ఆడియో రిలీజ్ హైలెట్స్