
'రెండు జతల బట్టలతో మద్రాసు వెళ్లాను’
తిరుపతి : డిసెంబర్ 25న జనం ముందుకు రా నున్న ‘మామమంచు- అల్లుడు కంచు’ సినిమా కుటుంబానికి వినోదాన్ని అందించే మంచి సినిమా అని పద్మశ్రీ డాక్టర్ ఎం.మోహన్‌బాబు అన్నారు. ఈ సినిమా ఆడియో సక్సెస్ మీట్ శనివారం రాత్రి తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో మో హన్ బాబు మాట్లాడుతూ తన నట జీవితంలో 560 సినిమాల్లో నటించానన్నారు. సినీ జీవితం లో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాలో నటించినట్టు చెప్పారు. పిల్లలు పెద్దవారు కావడంతో బాధ్యతలన్నీ వారికి అప్పగిం చినట్టు చెప్పారు.
ఏడాదిలో ఏదో ఒక సినిమా చేయాలని ఉద్దేశంతో ఈ సినిమాలో నటిం చినట్టు చెప్పారు. నాతోపాటు మరో నటుడు కావాలనుకున్నప్పుడు ఈ పాత్రకు అల్లరి నరేష్ కరెక్టని మంచు విష్ణు అతన్ని తీసుకువచ్చాడన్నారు. ఆ పాత్రకు అల్లరి నరేష్ న్యాయం చేశారన్నారు. ఇద్దరం పోటీపడి నటించామన్నారు. ఏదో సాధించాలని రెండు జతల బట్టలతో మద్రాసుకు వెళ్లానన్నారు. అయితే ఆదిలోనే నువ్వు చిత్తూరు వాడివి, నీకు భాషరాదని అగౌరవ పరచారన్నారు. అయినా ధైర్యంగా ముందుకు సాగి, నటుడుగా శిఖరాగ్రాన్ని చేరుకున్నానన్నా రు. నా తర్వాత నా తమ్ముడు మోహన్‌బాబే డైలాగ్ చెప్పడంలో దిట్టని అన్నగారు ఎన్‌టీఆర్ చేత శభాష్ అనిపించుకున్నానన్నారు.
నా ఊపి రి, శ్వాస, ధ్యాస, చివరకు నేను తినే తిండి సినిమాలేనని అన్నారు. సినిమా నిర్మాత మంచు విష్ణు మాట్లాడుతూ కథ, సంగీతం, దీనికి తోడు మోహన్‌బాబు, అల్లరినరేష్ నటన సినిమాకు పెద్ద హైలెట్ అని తెలిపారు. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతారని అభిప్రాయపడ్డారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ తండ్రి సమానులైన మోహన్‌బాబు జిల్లా వాసికావడం మనందరి గౌరవాన్ని పెం చిందన్నారు. కేవలం సినీ దిగ్గజమే కాక ఆయనలో మంచి రాజకీయవేత్త, పారిశ్రామిక వేత్త, విద్యావేత్తగా ఉన్నత శిఖరాలను చేరుకున్న వ్యక్తి అని కొనియాడారు. అనంతరం సినీ టెక్నీషియన్లు, ఇతర నటులు నటులకు జ్ఞాపికలు అందజేశారు. సినిమా ట్రైలర్‌ను మంచు మనోజ్ ఆవిష్కరించారు.