Actress Shweta Basu Prasad Birthday Special, Her Latest Look Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Shweta Basu Prasad Latest Look: కొత్త బంగారు లోకం హీరోయిన్‌ బర్త్‌డే.. ఫోటోలు వైరల్‌

Jan 13 2023 12:01 PM | Updated on Jan 13 2023 12:56 PM

Shweta Basu Prasad Birthday Pics Goes Viral - Sakshi

సినిమాల ఎంపికలో తప్పటడుగులు వేసి వరుస ఫ్లాపులు కొనితెచ్చుకుంది. తర్వాత జీనియస్‌ సినిమాలో డిబిరి డిబిరి అనే ఐటం సాంగ్‌లోనూ ఆడిపాడింది. ఏడేళ్లపా

కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్వేతా బసు ప్రసాద్‌. అమాయకపు చూపు, నిష్కల్మషమైన నవ్వుతో తొలి చిత్రంతోనే ఎంతోమంది గుండెలు కొల్లగొట్టిందీ హీరోయిన్‌. టాలీవుడ్‌లో ఫస్ట్‌ సినిమాతోనే కావాల్సినంత పాపులారిటీ వచ్చినా దాన్ని కాపాడుకోలేకపోయింది. సినిమాల ఎంపికలో తప్పటడుగులు వేసి వరుస ఫ్లాపులు కొనితెచ్చుకుంది. తర్వాత జీనియస్‌ సినిమాలో డిబిరి డిబిరి అనే ఐటం సాంగ్‌లోనూ ఆడిపాడింది. ఏడేళ్లపాటు తెలుగు తెరకు దూరమైన ఆమె 2018లో విజేతతో పలకరించింది. కానీ ఈ సినిమా కూడా ఆమెకు మంచి కమ్‌బ్యాక్‌ ఇవ్వలేకపోయింది.

దీంతో టాలీవుడ్‌ను వదిలి హిందీలోనే సినిమాలు, సిరీస్‌లు, సీరియళ్లు చేసుకుంటోంది. కెరీర్‌ పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు చూసిందీ హీరోయిన్‌. 2018లో డైరెక్టర్‌ రోహిత్‌ మిట్టల్‌ను పెళ్లాడగా విభేదాల కారణంగా మరుసటి ఏడాదే విడాకులు ఇచ్చేసింది. కాగా బుధవారం (జనవరి 11న) ఆమె బర్త్‌డే. ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అవి వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లు.. కొన్నింటిలో శ్వేతను అసలు గుర్తుపట్టలేకుండా ఉన్నామని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: ఇన్నాళ్లకు మళ్లీ కన్నీళ్లు వచ్చాయి: దిల్‌ రాజు
క్యాన్సర్‌తో చచ్చిపోయినా సరే కానీ ట్రీట్‌మెంట్‌ వద్దన్నా: సంజయ్‌ దత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement