Shweta Basu Prasad Shocking Comments About Her Divorce With Rohit Mittal - Sakshi
Sakshi News home page

నాకు నేనే ఓ మంచి స్నేహితురాలిగా మరాను..

Published Thu, Feb 4 2021 2:51 PM | Last Updated on Thu, Feb 4 2021 3:58 PM

Shweta Basu Prasad: Separating From Rohit Felt Like A Break Up - Sakshi

బాల నటిగా కెరియర్‌ ప్రారంభించిన శ్వేతా బసు ప్రసాద్‌.. కొత్తబంగారు లోకం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించినా శ్వేతాకు పెద్దగా సినిమా అవకాశాలు లభించలేదు. అదే సమయంలో ఆమెను పలు వివాదాలు కూడా చుట్టూ ముట్టాయి. దీంతో ఆమె అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2018 డిసెంబర్‌ 13న ఆమె బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌ మిట్టల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైయినా ఏడాదిలోపే వారిద్దరు విడాకులు తీసుకున్నారు. తాజాగా దీనిపై స్పందించిన శ్వేతా పరస్పర అంగీకారంతో విడిపోయామని, అది ఒక బ్రేకప్‌లా జరిగిందన్నారు. (డిప్రెషన్‌లో నటి శ్వేతా బసు..! )

'పెళ్లయిన పదేళ్లు అంతకంటే ఎక్కువ సంవత్సరాలైన తర్వాత కూడా చాలా మంది దంపతులు విడిపోవడం చేస్తుంటాం. కానీ తామిద్దరం మాత్రం ఏడాదిలోనే మా బంధానికి ముగింపు పలకాలనుకున్నాం. కాబట్టి దీన్ని విడాకులు అని పెద్ద పదంతో పోల్చడం కంటే, బ్రేకప్‌ అనడం కరెక్ట్‌ అనిపిస్తుంది. ఆ సమయంలో నాకు నా కుటుంబం, స్నేహితులు అండగా నిలిచారు. ఇప్పడు నాకు నేనే ఓ మంచి స్నేహితురాలిగా మరాను..ఇప్పుడు అంతా బాగానే ఉంది' అని వివరించింది. కాగా 2019లో తన భర్త రోహిత్‌ నుంచి విడిపోతున్నట్లు శ్వేతా ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా 2002లో మక్దే అనే ఓ హిందీ సినిమాలో బాల నటిగా  జాతీయ అవార్డును అందుకుంది. అయితే 2014లో సెక్స్ రాకెట్లో శ్వేతా బసు పట్టుబడటం అప్పట్లో సంచలనం రేపింది. తర్వాత ఆమె ఆ కేసులో నిర్దోషి అని తేలింది. ఆ సంఘటన తర్వాత శ్వేతా బసు జీవితం పూర్తిగా మారిపోయింది.  కొంతకాలం పాటు ఆమె సినిమాలకు దూరం అయ్యింది.  (హీరోయిన్‌ నగ్న ఫోటో అడిగిన ఫ్యాన్‌.. )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement