లాయర్‌ రేఖ | Shweta Basu Prasad turns on Web Series | Sakshi
Sakshi News home page

లాయర్‌ రేఖ

Published Mon, Jun 22 2020 12:55 AM | Last Updated on Mon, Jun 22 2020 12:55 AM

Shweta Basu Prasad turns on Web Series - Sakshi

శ్వేతాబసు ప్రసాద్‌

ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. ముఖ్యంగా హీరోయిన్లు ఆ ట్రెండ్‌ను బాగా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సమంత, తమన్నా,  ప్రియమణి, కాజల్‌ అగర్వాల్, అమలాపాల్‌ వంటి హీరోయిన్లు  వెబ్‌ సిరీస్‌లలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ‘కొత్తబంగారు లోకం’ ఫేమ్‌ శ్వేతాబసు ప్రసాద్‌ ఈ జాబితాలో చేరిపోయారు. ‘డాక్టర్‌ డాన్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో రేఖ అనే లాయర్‌ పాత్రలో కనిపించనున్నారు శ్వేతాబసు. 1995–2003 మధ్యకాలంలో ఐఐటీ, ఏమ్‌బీబీఎస్, ఐఏఎస్, ఐపీఎస్‌ ఎంట్ర¯Œ ్స ఎగ్జామ్స్‌ పేపర్స్‌ను లీక్‌ చేయడంలో ఓ ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి జీవితం ఆధారంగా ఈ వెబ్‌ సిరీస్‌ రూపుదిద్దుకోనుందని బాలీవుడ్‌ సమాచారం.

ఈ విషయంపై శ్వేతాబసు మాట్లాడుతూ–‘‘ఆత్మవిశ్వాసం, మానసిక బలం మెండుగా ఉన్న లాయర్‌ రేఖ పాత్రలో నటించడానికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను. నమ్మిన వ్యక్తే విల¯Œ కు సాయం చేస్తున్నాడని రేఖ తెలుసుకునే సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తాయి. కొన్ని కథలకు ఇప్పటి రోజుల్లో వెబ్‌ సిరీస్‌లే సరైనవి’’ అన్నారు శ్వేతాబసు ప్రసాద్‌. ‘కొత్తబంగారులోకం’ (2008) సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయి¯Œ  శ్వేతాబసుప్రసాద్‌. ఆ తర్వాత తెలుగులో ‘కాస్కో’ (2009), ‘రైడ్‌’ (2009) వంటి చిత్రాల్లో నటించారు. ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంటా..’(2012) చిత్రం తర్వాత శ్వేతాబసు ప్రసాద్‌ మరో తెలుగు సినిమాలో నటించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement