రోజురోజుకూ దేశంలో చెలరేగిపోతున్న హింసను వ్యతిరేకిస్తూ గత కొంతకాలంగా పలువురు ప్రముఖులు తమకు కేంద్ర ప్రభుత్వం అందించిన సాహిత్య అకాడమీ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులతోపాటు పలు అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్న విషయం తెలిసిందే.
రోజురోజుకూ దేశంలో చెలరేగిపోతున్న హింసను వ్యతిరేకిస్తూ గత కొంతకాలంగా పలువురు ప్రముఖులు తమకు కేంద్ర ప్రభుత్వం అందించిన సాహిత్య అకాడమీ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులతోపాటు పలు అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అవార్డుల తిరస్కరణ పరంపర సినీ దర్శకులను కూడా తాకింది.
దీనిపై బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ స్పందిస్తూ.. 'అవార్డులను తిరిగి ఇచ్చేయడం మిమ్మల్ని మీరు అగౌరవ పరచుకోవడమే కాదు.. మిమ్మల్ని, మీ పనిని అభిమానించే ప్రేక్షకులను కూడా అగౌరవపరచినట్లేన్నారు. అంతేకాదు.. ఎంతో సునిశిత దృష్టితో మీ టాలెంట్ను గుర్తించి, సెలక్ట్ చేసిన జ్యూరీని.. మీ సినిమాల్లో నటించిన నటీనటులను కూడా అవమానించినట్లేనని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మధుర్ తెలిపారు.