Ruhi Singh
-
మోసగాళ్ల కథ చెబుతా!
విష్ణు మంచు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విష్ణు సోదరిగా కాజల్ అగర్వాల్ నటించగా, విష్ణుకి జోడీగా రుహీ సింగ్ నటించారు. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో రూపొందిన ఈ చిత్రం తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది. కాగా ఈ చిత్రానికి హీరో వెంకటేశ్ వాయిస్ ఓవర్‌ను అందించడం విశేషం. ఈ సినిమా కథను ప్రారంభం నుంచి ముగింపు దాకా నరేట్ చేస్తారు వెంకటేశ్. ‘‘అల్లు అర్జున్ రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్‌కి మంచి స్పందన లభించింది. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయింది. టైటిల్ కీ థీమ్ మ్యూజిక్‌ని విడుదల చేసిన వెంకటేష్ వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడం ఈ చిత్రానికి మరింత ఆకర్షణ’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: శ్యామ్ సీఎస్, కెమెరా: షెల్డన్ చౌ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్ ఆర్. -
అందాల మోహిని
బాలీవుడ్ బ్యూటీ రుహీ సింగ్ ‘మోసగాళ్లు’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ఇది. ఇందులో విష్ణు సరసన రుహీ సింగ్ నటించారు. ఆమె పాత్ర పేరు మోహిని. ఈ సినిమాలో రుహీ గ్లామరస్‌గా కనిపిస్తారని గురువారం విడుదల చేసిన మోహిని లుక్ స్పష్టం చేస్తోంది. హాలీవుడ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ది వరల్డ్ బిఫోర్ హర్’ (2012)తో కెరీర్‌ను ప్రారంభించిన రుహీ సింగ్ తర్వాత హిందీలో ‘క్యాలండర్ గర్ల్స్’, ‘ఇష్క్ ఫరెవర్’ చిత్రాల్లో నటించారు. ‘మోసగాళ్లు’తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న రుహీ సింగ్ ‘ఈ సినిమాలో నటించడం చాలా కిక్ ఇచ్చింది. మోహిని పాత్ర చేయడం చాలా సరదాగా అనిపించింది’ అన్నారు. -
విమానం సీటు కింద బల్లి.. షాక్ తిన్న హీరోయిన్!
-
విమానం సీటు కింద బల్లి.. షాక్ తిన్న హీరోయిన్!
ఖరీదైన విమానంలో సీటు కింద నుంచి ఓ బల్లి వచ్చి తచ్చాడితే ఎలా ఉంటుంది. ఎవరికైనా ఒకింత వికారంగా, షాకింగ్‌గా ఉంటుంది. ఇలాంటి చేదు అనుభవమే వర్ధమాన నటి రూహి సింగ్‌కు ఎదురైంది. మధుర్ బండార్కర్ ‘క్యాలండర్ గర్ల్స్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో నటిస్తోంది. తమిళ చిత్రం ప్రమోషన్లో భాగంగా చెన్నైలో గడిపిన ఆమె స్పైస్‌జెట్ విమానంలో ముంబై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో మండిపడిన ఈ మాజీ మిస్ ఇండియా.. విమానాల్లో ఇంత దారుణమైన అపరిశ్రుభత ఎలా ఉంటుందంటూ విమానంలో బల్లి తచ్చాడుతున్న వీడియను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. స్పైస్‌జెట్ విమానంలో అధిక ధర చెల్లించి తాను ప్రీమియం టికెట్‌ను కొన్నానని, తీరికలేని షెడ్యూల్ నుంచి విశ్రాంతి తీసుకోవడానికి తాను ఈ టికెట్ కొంటే.. అందుకు భిన్నంగా తాను ఓ బల్లితో కలిసి ప్రయాణించాల్సి వచ్చిందని ఆమె తన పోస్టులో వాపోయింది. తన సీటు కింద నుంచి వచ్చిన బల్లి క్రమంగా విండో వద్దకు వెళ్లి అటు నుంచి పైనున్న లగేజ్ క్యాబిన్లోకి వెళ్లిపోయిందని, దీని గురించి తాను క్యాబిన్ సిబ్బందికి వెంటనే ఫిర్యాదు చేసినా.. ఇది సర్వసాధారణ ఘటనలా వారు స్పందించి నవ్వుకోవడం తనను షాక్ గురిచేసిందని పేర్కొంది. విమానం దిగేవరకు బల్లి గురించి తాము ఏమీ చేయలేమని, కాబట్టి వేరే సీటులో కూర్చోవాలని సిబ్బంది చెప్పారని ఆమె వివరించింది. ఎక్కువ డబ్బు చెల్లించిమరీ తాను స్పైస్మాక్స్ సీటు కొనుగోలు చేశానని, కానీ వాస్తవానికి ఓ బల్లి పక్కన తాను కూర్చోవాల్సి వచ్చిందని, విమానంలోని పరిశుభ్రత ప్రమాణాలు తనను తీవ్రంగా ఆందోళనకు గురిచేశాయని చెప్పింది. అయితే, రూహి సింగ్ పోస్టుపై స్పందించడానికి స్పైస్‌జెట్ ఇప్పటివరకు ముందుకురాలేదు. @flyspicejet @spicejetairlines last night on flight SG 612 Chennai to Mumbai, I booked myself a spicemax seat (for which I paid extra money) to be seated next to a lizard! I'm extremely worried about your hygiene standards now, and the fact that the cabin crew laughed it off as if it's a common occurrence got me quite shocked. #Lizardonspicejet A post shared by Ruhi Singh (@ruhisingh12) on May 29, 2017 at 1:00am PDT -
అదే అసలు కిక్..
చిట్‌చాట్ జీవితం ప్లాన్ చేసుకోకుండా సాగితేనే మజాగా ఉంటుందంటోంది మిస్ యూనివర్సల్ ‘పీస్ అండ్ హ్యుమానిటీ’ రుహి సింగ్. అలా అన్ప్లాన్డ్గా ఉంటేనే లైఫ్‌లో కిక్ ఎంజాయ్ చేయగలమని చెబుతోంది. బంజారాహిల్స్ తాజ్‌కృష్ణలో ప్రారంభమైన ఖ్వాయిష్ ఎగ్జిబిషన్ అండ్ సేల్‌ను రుహిసింగ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ బ్యూటీ క్వీన్‌తో సిటీప్లస్ చిట్‌చాట్.. ..:: శిరీష చల్లపల్లి నేను పుట్టింది, పెరిగింది జైపూర్‌లో. కొన్నాళ్లు ముంబైలో ఉన్నాను. నాకు హైదరాబాద్‌కు రావడం సంతోషంగా ఉంది. ఇదొక రాయల్ సిటీ. నేను 2011 నుంచి బ్యూటీ ఫీల్డ్‌లో అనేక కాంపిటీషన్స్‌లో పాల్గొంటున్నాను. 2012లో మిస్ ఇండియా ఫైనలిస్ట్‌గా కూడా ఎంపికయ్యాను. 145 దేశాలు పోటీ చేసిన మిస్ యూనివర్సల్ ‘పీస్ అండ్ హ్యుమానిటీ’లో బ్యూటీ కిరీటం దక్కించుకోవడం ఆనందంగా ఉంది. బ్రేక్‌ఫాస్ట్ విత్ బిర్యానీ.. నా ఫిట్నెస్ మంత్రం లైఫ్‌స్టైలే. నేను పెద్ద ఫుడీని. బట్టర్, చీస్, నెయ్యి, గ్రిల్డ్ మీట్ ఇవన్నీ నా మెనూలో ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్‌కి బిర్యానీ తింటాను. ఎంత తింటానో అంత వర్కవుట్ చేస్తాను. ఉదయాన్నే జిమ్, సాయంత్రాలు ఎరోబిక్స్ చేస్తుంటాను. ట్రెక్కింగ్‌కి కూడా వెళ్తుంటాను. నా కాళ్లు ఒక దగ్గర ఉండవు. రోజంతా బిజీగా ఉంటాను. అందుకే ఎంత తిన్నా నా ఫిట్‌నెస్‌లో తేడా రాదు. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం టాంగో డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాను. నాగ్ మూవీలో చాన్స్ వస్తే.. తొందర్లోనే నేను వెండితెరపై కనిపించబోతున్నాను. బాలీవుడ్ సినిమాకు సైన్ చేశాను. టాలీవుడ్లో నటించాలని ఆశగా ఉంది. అందుకే తెలుగు కూడా నేర్చుకుంటున్నాను. పూరి జగన్నాథ్ సినిమాలో చేయాలని ఉంది. నాగార్జున సినిమాలో చాన్స్ వస్తే వదులుకోను. నా లైఫ్‌లో ఏదీ ప్లాన్ చేసుకోలేదు. నేను ఇలా కిరీటంతో ఉంటానని ఐదేళ్ల కిందట అనుకోలేదు. ఇంకో ఐదేళ్ల తర్వాత ఎలా ఉంటానో ఊహించలేను. అందుకే నేనేం ప్లాన్ చేసుకోను. అప్పుడే ఎక్సైటెడ్‌గా ఉంటుంది. -
‘బ్యూటీ స్పీక్స్ ఫర్ పీస్’
బుధవారం లెబనాన్‌లోని బీరుట్లో జరిగిన మిస్ యూనివర్సల్ పీస్ అండ్ హ్యూమానిటీ టైటిల్‌ను గెలుచుకున్న రూహీ సింగ్. 145 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్న ఈ పోటీలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన రూహీ సింగ్ విజేతగా నిలవడంతోపాటు రూ.32 లక్షల బహుమతిని గెలుచుకున్నారు. ఈ అందాల పోటీని ఓ భారతీయురాలు గెలుచుకోవడం ఇదే ప్రథమం. ‘బ్యూటీ స్పీక్స్ ఫర్ పీస్’ పేరిట ఈ అందాల పోటీలను వరల్డ్ పీస్ మిషన్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తోంది. ఈ పోటీల విజేత శాంతి సందేశాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేసేందుకు కృషి చేస్తారు.