మోసగాళ్ల కథ చెబుతా! | Victory Venkatesh Voiceover For Vishnu Manchu is Mosagallu | Sakshi
Sakshi News home page

మోసగాళ్ల కథ చెబుతా!

Published Sat, Oct 17 2020 12:16 AM | Last Updated on Sat, Oct 17 2020 12:25 AM

Victory Venkatesh Voiceover For Vishnu Manchu is Mosagallu - Sakshi

విష్ణు మంచు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విష్ణు సోదరిగా కాజల్‌ అగర్వాల్‌ నటించగా, విష్ణుకి జోడీగా రుహీ సింగ్‌ నటించారు. తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో రూపొందిన ఈ చిత్రం తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది. కాగా ఈ చిత్రానికి హీరో వెంకటేశ్‌ వాయిస్‌ ఓవర్‌ను అందించడం విశేషం. ఈ సినిమా కథను ప్రారంభం నుంచి ముగింపు దాకా నరేట్‌ చేస్తారు వెంకటేశ్‌.

‘‘అల్లు అర్జున్‌ రిలీజ్‌ చేసిన ఈ సినిమా టీజర్‌కి మంచి స్పందన లభించింది. టీజర్‌ రిలీజ్‌ అయినప్పటి నుంచి ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో సినిమా మీద మంచి బజ్‌ క్రియేట్‌ అయింది. టైటిల్‌ కీ థీమ్‌ మ్యూజిక్‌ని విడుదల చేసిన వెంకటేష్‌ వాయిస్‌ ఓవర్‌ కూడా ఇవ్వడం ఈ చిత్రానికి మరింత ఆకర్షణ’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: శ్యామ్‌ సీఎస్, కెమెరా: షెల్డన్‌ చౌ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌కుమార్‌ ఆర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement