Mosagallu
-
Mosagallu: ఓటీటీలోకి వచ్చేసిన మంచు విష్ణు ‘మోసగాళ్లు’
మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐటీ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి మంచి స్పందన వచ్చింది. పాన్ ఇండియా లెవల్లో వచ్చిన ఈ సినిమా మంచు విష్ణు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో నిజ జీవిత సంఘటనల నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ ఇంగ్లీష్, తమిళం, మలయాళం, కన్నడలో ఒకేసారి విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్దమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో నేటి నుంచి (జూన్ 16) ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో మంచు విష్ణుకు సోదరిగా కాజల్ నటించింది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, నవదీప్, నవీన్‌చంద్ర కీలక పాత్రల్లో నటించారు. -
‘మోసగాళ్లు’ మూవీ రివ్యూ
టైటిల్ : మోసగాళ్లు జానర్ : క్రైమ్ థ్రిల్లర్ నటీనటులు : మంచు విష్ణు, కాజల్, సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర, రాజా రవీంద్ర తదితరులు నిర్మాణ సంస్థ : ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కథ, నిర్మాత : మంచు విష్ణు దర్శకత్వం : జెఫ్రీ గీ చిన్ సంగీతం : సామ్ సి.ఎస్ సినిమాటోగ్రఫీ : షెల్డన్ చావ్ ఎడిటర్ : గౌతమ్ రాజు విడుదల తేది : మార్చి 19, 2021 స్టార్ హీరో మోహన్ బాబు కుమారుడిగా పరిచయమై మంచు విష్ణు గత కొన్నేళ్లుగా కెరీర్లో సరైన హిట్ పడక సతమతమవుతున్నాడు. ఇటీవల ఆయన హీరోగా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి.దీంతో సినిమాల నుంచి లాంగ్ గ్యాప్ తీసుకున్న విష్ణు.. ఓ భారీ స్కామ్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి థ్రిల్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో 'మోసగాళ్లు' అనే పాన్ఇండియా సినిమాతో బరిలోకి దిగాడు. రూ.50 కోట్లకు పైగా కేటాయించి హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ మూవీ తెరకెక్కించారు. ఈ సినిమాకు నిర్మాతగానే కాకుండా రచయితగా కూడా మంచు విష్ణు పనిచేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ మంచి స్పందన వచ్చింది.దీనికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘మోసగాళ్లు’పై భారీ అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘మోసగాళ్లు’అందుకున్నారా? ఈ సినిమా మంచు విష్ణుని హిట్ ట్రాక్ ఎక్కించిందా? ఈ ‘మోసగాళ్ల’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం. కథ అను(కాజల్), అర్జున్(మంచు విష్ణు) కవల అక్కా తముళ్లు. చిన్నప్పటి నుంచి పేదరికంలో పెరుగుతారు. తండ్రి (తనికెళ్ల భరణి) నిజాయతీ వల్లే తాము పేదలుగా మిగిలిపోయామని ఫీలవుతుంటారు. ఉన్నవాడిని మోసం చేసి రిచ్ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఈ క్రమంలోనే విజయ్ (నవదీప్)తో కలిసి ఒక ఫేక్ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి మోసాలు చేద్దామని ప్లాన్ వేస్తారు. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ పేరుతో అమెరికన్లకు ఫోన్ చేసి పన్ను బకాయిలు చెల్లించాలని బెదిరించి అక్రమంగా డబ్బు సంపాదించడం మొదలుపెడతారు. అలా దాదాపు రూ.2,600 కోట్లు కొట్టేస్తారు. భారీ మోసాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఫెడరల్ ట్రేడ్ కమిషన్, భారత ప్రభుత్వం విచారణ కోసం ఎసీపీ కుమార్ (సునీల్ శెట్టి) నియమిస్తుంది. ఈ మోసగాళ్లును పట్టుకోవడానికి ఏసీపీ కుమార్ చేసిన ప్రయత్నాలు ఏంటి? ఆయన నుంచి తప్పించుకోవడానికి అను, అర్జున్ ఎలాంటి ఎత్తులు వేశారు. చివరకు ఈ మోసగాళ్లు ఎలా చిక్కారు? అనేదే మిగతా కథ. నటీనటులు అర్జున్ పాత్రలో మంచు విష్ణు ఒదిగిపోయాడు. తెరపై ఇంతవరకూ చూడని విష్ణుని ఈ సినిమాలో చూడొచ్చు. కన్నింగ్ ఫెలోగా, సీరియస్ లుక్‌లో విష్ణు కనిపిస్తాడు. అను పాత్రలో కాజల్ పర్వాలేదనిపించింది. ఆమె పాత్రను ఇంకాస్త బలంగా తీర్చిదిద్దితే బాగుండేది. ఎసీపీ కుమార్ భాటియాగా సునీశ్ శెట్టి నటన బాగుంది. తన అనుభవాన్ని తెరపై చూడొచ్చు. నవీన్ చంద్రా, నవదీప్ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. విశ్లేషణ ‘అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా ‘మోసగాళ్ళు’ సినిమా తెరకెక్కింది. హైదరాబాద్‌లోని బస్తీలో ఉండే అక్కాతమ్ముళ్లు టెక్నాలజీ సహాయంతో వేల కోట్లను ఎలా దోచుకున్నారు అనేదే ‘మోసగాళ్లు’ సినిమా కథ. అయితే ఇలాంటి కథను ఎంచుకోవడం సులభమే కానీ, దాన్ని తెరపై ఎలా థ్రిల్లింగ్ చూపించారు అనేదే ముఖ్యం. దానిపైనే సినిమా విజయం ఆధారపడుతుంది. ఈ విషయంలో చిత్ర దర్శకుడు కాస్త తడబడినట్టు అనిపిస్తోంది. సినిమా ఆరంభంలో అను, అర్జున్‌లనేపథ్యాన్ని క్లుప్తంగా చూపించేసి, ప్రేక్షకుడిని అసలు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు జెఫ్రీ గీ చిన్. తర్వాత అర్జున్ ఓ కాల్ సెంటర్లో పనిచేయడం.. దాని ద్వారా అక్రమంగా అమెరికన్ల డేటాను సేకరించి అమ్మడం.. ఈ క్రమంలో విజయ్ కలిసి ఓ భారీ స్కాంకి స్కెచ్ వేయడం.. ఇలా కథని చకచకగా నడిపించి బోర్ కొట్టకుండా నడిపించేశాడు. అయితే అను ఎంట్రీ తర్వాత కొన్ని సన్నివేశాలు కాస్త నెమ్మదిగా, సాదాసీదాగా అనిపిస్తాయి. అలాగే నవీన్ చంద్ర, సునీల్ శెట్టి మధ్య వచ్చే కొన్ని సీన్లు స్పీడ్‌గా సాగుతున్న కథకు బ్రేకులు వేసినట్లుగా అనిపిస్తాయి. మరోవైపు ఈ మోసగాళ్లను పట్టుకునేందుకు ఎసీపీ కుమార్ వేసే ఎత్తులు కూడా రొటీన్‌గానే ఉంటాయి. అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. క్లైమాక్స్‌లో సునీల్ శెట్టి, మంచు విష్ణులకి మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్ బాగుంటుంది.. ప్రీ ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్ హైలైట్. ఈ సినిమాకు ప్రధాన బలం సామ్ సి.ఎస్ నేపథ్య సంగీతం. కొన్ని సన్నివేశాలకు తన బీజీఎంతో ప్రాణం పోశాడు. రొటీన్ కథలకు బిన్నంగా ఉన్న ఈ మూవీలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కాస్త థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
‘వరుణ్ తేజ్ ‘గని’ కోసం శరీరాకృతి మార్చాలి’
‘‘మోసగాళ్ళు’ టీమ్‌తో పని చేయడం హ్యాపీగా ఉంది. తినడం, ప్యాకప్ చెప్పడం, రిహార్సల్స్.. ఇలా ప్రతి ఒక్కటీ అనుకున్న సమయంలో అయిపోయేవి. అదే దక్షిణాది పరిశ్రమ గొప్పతనం’’ అని బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి అన్నారు. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్ళు’. జెఫ్రీ గీ చిన్ దర్శకుడు.ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు సునీల్ శెట్టి. ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా సునీల్ శెట్టి చెప్పిన విశేషాలు. ► అదిరిపోయే కథ, మంచి దర్శకుడు, హాలీవుడ్ స్థాయి స్టాండర్డ్స్.. అన్నీ కలిసి ‘మోసగాళ్ళు’ సినిమాను ఒప్పుకునేలా చేశాయి. అక్కాతమ్ముడు కలిసి ఓ కుంభకోణం చేయడమనే ఈ కథ నన్ను ఆకట్టుకుంది. వారిని పట్టుకోవడమే నా పాత్ర. వాస్తవ ఘటనల ఆధారంగా తీసే సినిమాలు వర్కవుట్ అవుతుంటాయి. ► తెలుగు భాష మాట్లాడటం కష్టం కానీ, అర్థం చేసుకోవడం సులభమే. నాకు ఫిట్‌గా ఉండటం ఇష్టం. ఏం తింటున్నాను.. ఎంత తినాలి? అనేదానిపై నాకంటూ ఓ అవగాహన ఉంది. ప్రతిరోజూ యోగా, వర్కవుట్లు కచ్చితంగా చేస్తాను. విష్ణు కొత్త తరానికి చెందిన నటుడు. ఫిట్నెస్ గురించి మాకంటే తనకే ఇంకా బాగా తెలుస్తాయి. ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య యాక్షన్ సీక్వెన్స్‌లున్నాయ్. ఫైట్స్ చేసేటప్పుడు టైమింగ్‌తో చేయాలి.. లేదంటే గాయాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో ‘గని’ చేస్తున్నాను. ఈ సినిమా కోసం మళ్లీ నా శరీరాకృతిని మార్చాలి. -
ఫ్రైడే మూవీస్: ఈ వారం 3 భారీ సినిమాలు.. విజేత ఎవరు?
శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి. అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకులను అలరించి కాసులను సొమ్ము చేసుకుంటాయి. మరికొన్ని ఫ్లాపులను మూటగట్టుకొని పోతాయి. అందుకే శుక్రవారం నిర్మాతకు టెన్షన్ డేగా మారుతుంది. గత వారం టాలీవుడ్లో నాలుగు సినిమాలు.. జాతిరత్నాలు, శ్రీకారం, గాలి సంపత్, లవ్ లైఫ్ అండ్ పకోడి సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో జాతిరత్నాలు పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇక ఈ శుక్రవారం (మార్చి 19)కూడా పలు భారీ చిత్రాలు విడుదల కాబోతుంది. మంచు విష్ణు ’మోసగాళ్ళు’, కార్తికేయ ‘చావు కబురు చల్లగా’, ఆది సాయికుమార్ ‘శశి’ తో పాటు ‘ఇదే మా కథ’, ‘ఈ కథలో పాత్రలు కల్పితం’లాంటి చిన్న సినిమా కూడా శుక్రవారం విడుదల అవుతున్నాయి. ఐటి స్కామ్ నేపథ్యంలో వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘మోసగాళ్లు’. ఇందులో కాజల్, మంచు విష్ణు అక్కాతమ్ముళ్లుగా నటిస్తున్నారు. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు విష్ణు నిర్మించి ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో శుక్రవారం విడుదల అవుతుంది. యంగ్ హీరో కార్తికేయ, హీరోయిన్ లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా’. గీతాఆర్ట్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి భర్త కోల్పోయిన వితంతువుగా కనిపిస్తోంది. హీరో కార్తికేయ అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తుంటారు. వీరిద్దరి మధ్య చోటుచేసుకునే ఒక విచిత్రమైన ప్రేమకథా నేపథ్యంలో చావు కబురు చల్లగా సినిమా తెరకెక్కుతోంది. ప్రేమ కావాలి ఫేమ్ ఆది హీరోగా నటించిన చిత్రం ‘శశి’. శ్రీనివాస్ నాయుడు రూపొందించిన ఈ చిత్రంలో ఆది సరసన సురభి నటిస్తున్నారు. ప్రేమలో పడ్డ ఓ మధ్యతరగతి కుర్రాడి ఇబ్బంది ఎలా ఉంటుంది? ప్రేమ తర్వాత కుటుంబంతో, స్నేహితులతో అతనికి రిలేషన్స్ ఎలా మారతాయి? అనే అంశాలతో ‘శశి’ సినిమా తెరకెక్కింది. మరి ఈ నాలుగు చిత్రాల్లో ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. -
అప్పులు చేశా.. నాపై నాకే కోపం వచ్చింది : మంచు విష్ణు
‘‘నాకు ఉన్నదంతా ఊడ్చి ‘మోసగాళ్ళు’ సినిమాకి పెట్టేశా.. అందుకే రెండు వారాలుగా ఒత్తిడిగా ఉంది. ఏ సినిమా తీసినా అందరికీ భయం ఉంటుంది. సినిమా విడుదల రోజు ఎవరికైనా ఆందోళన ఉంటుంది’’ అని మంచు విష్ణు అన్నారు. జెఫ్రీ గీచిన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్ళు’. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించారు. ఈ సినిమా రేపు విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో విష్ణు విలేకరులతో చెప్పిన విశేషాలు... ► అమెరికాలో జరిగిన ఐటీ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్ళు’. ఈ కథపై నమ్మకంతో నాకున్న మార్కెట్ విలువ కంటే రెండు రెట్లు అధికంగా ఖర్చు పెట్టాను. బాగా ఆడి మంచి వసూళ్లు సాధిస్తేనే సేఫ్. ఈ సినిమా విషయంలో నన్ను నమ్మి, ప్రోత్సహించింది మా నాన్నగారు (మోహన్ బాబు), నా భార్య విరానికా. సినిమా కోసం అప్పులు కూడా తెచ్చాను. వడ్డీలు పెరిగిపోతున్నాయి. నా ఆందోళన చూసి వాళ్లు కూడా ఒత్తిడికి లోనయ్యేవారు. నాపై నాకే కోపం వచ్చింది. ► ఈ సినిమా మొదటి డ్రాఫ్ట్ కథ నేనే రాశాను. ఆ తర్వాత రచయిత ‘డైమండ్’ రత్నబాబు సపోర్ట్ తీసుకున్నాను. ఓ బస్తీలో ఉండే అక్క–తమ్ముడు తెల్లవాళ్లని మోసం చేసి, ఆన్ లైన్ మోసం ద్వారా అమెరికాలోని కొన్ని వేల మంది కుటుంబాలను నాశనం చేస్తారు. తెల్లవాళ్లందరూ ధనవంతులే అనుకుంటారు వారు. కానీ పేదవాళ్లు కూడా వీళ్ల బారిన పడి మోసపోతుంటారు. ► అమెరికాలో ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలా నేర్చుకున్నా. ఈ కుంభకోణానికి సంబంధించి పేపర్లో వచ్చిన వార్తల హక్కుల్ని కూడా మేం కొన్నాం. అక్కడ సినిమాతో పాటు సాంకేతిక నిపుణులకు ఇన్సూరెన్స్ చేయించాం. వీటికే 20శాతం బడ్జెట్ అయింది. హాలీవుడ్లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా చేస్తారు. మన దృష్టిలో నిర్మాత అంటే డబ్బులు పెట్టేవాడు. వాళ్ల దృష్టిలో డబ్బులు పెట్టేవాణ్ణి స్టూడియో ఫైనాన్షియర్ అంటారు. నిర్మాతను వాళ్లు ఎంచుకుని జీతం ఇచ్చి, ఎగ్జిక్యూట్ చేయమని అంటారు. భవిష్యత్‌లో పెద్ద బడ్జెట్ సినిమా తీస్తే హాలీవుడ్ నుంచి నిర్మాతను తీసుకొస్తాను. ► ఈ సినిమాని ముందు ఇంగ్లీష్‌లోనే చేద్దామనుకున్నాం. అయితే భారీ బడ్జెట్ పెడుతున్నాం కదా తెలుగులోనూ తీస్తే సేఫ్ అవుతామని రెండు భాషల్లోనూ తెరకెక్కించాం. యూఎఫ్ఓ వారు మా సినిమాని ఇండియా మొత్తం విడుదల చేస్తున్నారు. ఛత్తీస్‌ఘడ్‌లో 40 థియేటర్లలో సినిమా విడుదలవుతుంటే వాటిలో 30 థియేటర్లలో తెలుగు వెర్షనే రిలీజ్ చేస్తున్నాం. నాకు తెలుగు–కన్నడ భాషల్లో మంచి మార్కెట్ ఉంది. కన్నడంలో 130 థియేటర్లలో రిలీజవుతుండగా 30 థియేటర్లలో మాత్రమే కన్నడ డబ్బింగ్ సినిమా రిలీజ్ అవుతోంది. మలయాళంలో నా డబ్బింగ్ సినిమాలకు కూడా మంచి ఆదరణ ఉంటుంది. సునీల్ శెట్టి, కాజల్ ఉండటంతో హిందీ, తమిళాల్లోనూ రిలీజ్ చేస్తున్నాం. ► మంచి కథ కుదిరితే మా కుటుంబమంతా కలసి నటించడానికి అభ్యంతరం లేదు. నా తర్వాతి సినిమా ‘డీ అండ్ డీ’ కోసం దర్శకుడు శ్రీను వైట్ల వల్ల రోజుకి ఐదు గంటలు జిమ్‌లోనే కష్టపడుతున్నా. ఏప్రిల్‌లో సెట్స్‌కి వెళుతుంది. 3 వెబ్ సిరీ స్లు నిర్మించేందుకు చర్చలు జరుగుతున్నాయి. ‘మోసగాళ్ళు’ సినిమా రఫ్ వెర్షన్ చూసిన నాన్నగారు కొన్ని సందేహాలు వ్యక్తపరిచారు. కొన్ని సన్నివేశాలు నాన్నకే అర్థం కాలేదంటే సాధారణ ప్రేక్షకులకు ఏం అర్థం అవుతుంది? అనిపించి అందరికీ సులభంగా అర్థం అయ్యేలా ఐదు సన్నివేశాలు యాడ్ చేశాం. ‘మోసగాళ్ళు’ ఇంగ్లీష్ వెర్షన్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. మేలో పూర్తి చేయాలనుకుంటున్నాం. -
నవదీప్ దరిద్రమైన అలవాట్లు అవే: విష్ణు
మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో కాజల్ అగర్వాల్ విష్ణుకి అక్కగా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, నవదీప్, నవీన్‌చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూల్లో పాల్గొన్న విష్ణు.. నవదీప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నవదీప్‌ని పొగుడుతూనే.. అతని చెడు అలవాట్లు ఏంటో బయటపెట్టేశాడు. నా దృష్టిలో మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ నవదీప్. అతని టాలెంట్‌కి తగ్గ గుర్తింపు రాలేదు. అతని కెపబిలిటీకి ఇప్పుడున్న గుర్తింపు నథింగ్. అతను ఇప్పుడు నా సినిమాలో చేశాడని నా మందు ఉన్నాడని పొగడటం కాదు.. దానివల్ల తొక్క ఏం రాదు. ఐదుసార్లు ఫోన్ చేస్తే ఒక్కసారి కూడా ఎత్తడు. అలాంటి దరద్రమైన అలవాట్లు ఉన్నాయి అతనికి. కానీ.. అతని దగ్గర టాలెంట్ చాలా ఉంది.. ఎఫర్ట్ పెట్టి చేస్తాడు. నేను ఒక సెక్షన్ అయినతరువాత బ్రదర్ దీన్ని మనం తెలుగులో ఎలా చేద్దాం.. అని డిస్కష్ చేశా. ముఖ్యంగా నవదీప్‌కి ఓన్లీ యాక్టింగ్ అనే కాదు.. రైటింగ్ మీద ఫుల్ గ్రిప్ ఉంది. ఆ విషయంలో నేను చాలా లక్కీ. ఈ సినిమాలో నవదీప్ చాలా స్టైలిష్‌గా చేశాడు.. అతనితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది’ అంటూ నవదీప్‌ని పొగుడుతూనే, అతని చెడు అలవాట్లను బయటపెట్టేశాడు. అయితే దీనిపై నవదీప్ సెటైరికల్‌గా స్పందించాడు.. ‘నాకు ఉన్న దరిద్రమైన అలవాట్లలో విష్ణు ఒక ఉదాహరణ మాత్రమే చెప్పాడు. అలాంటివి చాలా ఉన్నాయి’అని నవదీప్ చెప్పడంతో యాంకర్‌తో పాటు విష్ణు, నవీన్ చంద్ర ఘోల్లున్న నవ్వారు. చదవండి: ఇదే తొలిసారి.. ‘చందమామ’తో నాగ్ రొమాన్స్! జాతిరత్నాలు’ డైరెక్టర్‌తో వైష్ణవ్ తేజ్ సినిమా -
రియల్ లైఫ్‌లో ఓసారి మోసపోయాను: కాజల్
‘‘పెళ్లయ్యాక మహిళలపై నాకు మరింత గౌరవం పెరిగింది. ఒక మహిళగా నాకు సంతోషంగా ఉంది. మహిళలు మల్టీటాస్కింగ్ చేస్తున్నారు. మా అమ్మ కష్టం ఏంటో పెళ్లి చేసుకున్న తర్వాత నాకు తెలిసొచ్చింది’’ అని అన్నారు కాజల్ అగర్వాల్. మంచు విష్ణు, కాజల్, సునీల్ శెట్టి ప్రధాన పాత్రల్లో జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మోసగాళ్ళు’. మంచు విష్ణు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ చెప్పిన విశేషాలు. ►అను, అర్జున్ అనే అక్కాతమ్ముళ్ల కథే ‘మోసగాళ్ళు’ చిత్రం. ముంబయ్ మురికివాడల నుంచి వచ్చిన సిస్టర్ అండ్ బ్రదర్ అమెరికాలో ఎలా స్కామ్ చేశారన్నది ప్రధానాంశం. దర్శకుడు జెఫ్రీ చెప్పిన ఈ కథ నాకు బాగా నచ్చింది. అందుకే సినిమాలో విష్ణుకు అక్క పాత్ర చేశాను. ‘మోసగాళ్ళు’ సినిమా నిర్మాణ విలువలు బాగుంటాయి. సునీల్ శెట్టిగారి కాంబినేషన్లో నాకు పెద్దగా సీన్స్ లేవు. నవదీప్, నవీన్ చంద్రలతో కొన్ని సీన్స్ ఉన్నాయి. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీతో వర్క్ చేయడం న్యూ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. మోహన్‌బాబుగారి వంటి లెజండరీ యాక్టర్ సినిమా చూసి విష్ణు, నా యాక్టింగ్‌ను మెచ్చుకున్నారంటే సంతోషంగా ఉంది. రియల్ లైఫ్‌లో ఓసారి ఆన్లైన్లో నేను మూడు వేల రూపాయలు మోసపోయాను. అప్పుడు మా నాన్నగారు కోప్పడ్డారు. ఇలాంటి ఘటనలు రెండు మూడు జరిగాయి. ►గౌతమ్ (కాజల్ భర్త) గురించి మా ఇంట్లో, నా గురించి గౌతమ్ ఇంట్లో తెలుసు. లాక్డౌన్లో పెళ్లి గురించి ముందు నేనే మా ఇంట్లో చెప్పాను. ఆ తర్వాత గౌతమ్ వాళ్లు వచ్చి మా ఇంట్లోవాళ్లతో మాట్లాడారు. ఉదయాన్నే గౌతమ్ గురించి మా ఇంట్లో చెప్పి, మధ్యాహ్నం గౌతమ్‌ను రమ్మన్నాను. గౌతమ్ నాకు పదేళ్లుగా తెలుసు. మా స్నేహమే పెళ్లిగా మారింది. పెళ్లి జరిగిన వారానికే సినిమా సెట్స్‌కు వచ్చాను. నా సినిమా సెట్స్‌కు గౌతమ్ వచ్చాడు. హీరోల్లో గౌతమ్‌కు చరణ్, తారక్ అంటే ఇష్టం. హీరోయిన్స్‌లో నేనే ఇష్టం.. ఆప్షన్ లేదు (నవ్వుతూ). ►నాకు రిస్క్ తీసుకోవడం ఇష్టమే. ‘సీత, అ!’ సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేశాను. ఇప్పుడు ‘మోసగాళ్ళు’ చేశాను. ఇందులో నేను కథ రీత్యా స్మోక్ చేస్తాను. నిజానికి నాకు స్మోకింగ్ పడదు. ఇబ్బందిగా అనిపించినప్పుడు ఇన్హేలర్ వాడాను. నెగటివ్ రోల్స్ చేయడానికి ప్రాబ్లమ్ లేదు. కానీ కథ ఎగ్జయి టింగ్‌గా ఉండాలి. ఎక్స్ట్రీమ్ బోల్డ్ సీన్స్‌లో నటించాలా? లేదా అనేది నా నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ రూల్స్ ఎలా ఉన్నా.. నాకంటూ ఓ సెల్ఫ్ సెన్సార్ ఉంది. ►చిరంజీవిగారి ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాను. నాగార్జునగారితో ఓ సినిమా చేయాల్సి ఉంది. తమిళంలో ‘గోస్టీ’తో పాటు మరో సినిమా కమిటయ్యాను. ‘ఇండియన్ 2’ ప్రస్తుతానికి ఆగిపోయింది. నేను హోస్ట్‌గా ఓ వెబ్ షో ఉండొచ్చు. -
'మోసగాళ్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
ఆ ఇద్దరి నటన చూసి కన్నీళ్లొచ్చాయి: మోహన్‌బాబు
‘‘జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా మోసపోతారు. ‘మిమ్మల్ని పెళ్లి చేసుకుని నేను మోసపోయాను?’ అని నా భార్య (నిర్మల) నాతో చెప్పింది (నవ్వుతూ...). ఆ మాట ఎందుకు అన్నదో నాకు అర్థం కాలేదు. ఆమె నన్ను మోసం చేసిందో... నేను ఆమెను మోసం చేశానో లక్ష్మి, విష్ణు, మనోజ్లకే తెలియాలి’’ అని నటుడు మంచు మోహన్‌బాబు సరదాగా అన్నారు. విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్ళు’. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. మంచు విష్ణు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో మోహన్‌బాబు మాట్లాడుతూ–‘‘సునీల్ శెట్టి అద్భుతమైన నటుడు. ‘మోసగాళ్ళు’లో కూడా బాగా నటించారు. కాజల్ మంచి నటి. పాత్ర నిడివితో సంబంధం లేకుండా ఈ చిత్రంలో విష్ణుకి అక్కగా చేసినందుకు కాజల్‌ని అభినందిస్తున్నాను. హీరోయిన్గా ఉన్న నువ్వు అక్క పాత్ర చేయడం గ్రేట్. జానపద గాయని కోమలికి మన తర్వాతి సినిమాలో పాడే అవకాశం ఇద్దామని విష్ణు చెప్పాడు. కచ్చితంగా ఆ అవకాశం ఇస్తాను. రానాని చూస్తే ‘బాహుబలి’ గుర్తొస్తుంది. తను మంచి నటుడు. రానా నిర్మాతగా త్వరలోనే నాతో సినిమా చేస్తున్నాడు. ‘మోసగాళ్ళు’ అద్భుతమైన కథ. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రమిది. ధైర్యం చేసి ఈ సినిమా తీశాడు విష్ణు. ఈ చిత్రంలో కాజల్– విష్ణు మధ్య సీన్స్ చూసి కన్నీళ్లొచ్చాయి. ఒళ్లు జలదరించింది. ఫ్యామిలీ, సెంటిమెంట్, అర్థం, పరమార్థం ఉన్న ‘మోసగాళ్ళు’ చిత్రాన్ని మహిళలు, యూత్‌తో పాటు అందరూ చూడొచ్చు. మార్చి 19న నా పుట్టినరోజు. అందుకే ఆ రోజు విడుదల చేస్తున్నాడు విష్ణు’’ అన్నారు. సునీల్ శెట్టి మాట్లాడుతూ– ‘‘మోహన్‌బాబుగారు ఒక నటుడిగా, ఫ్రెండ్‌గా నాకెంతో ఇష్టం. ఆయన ఫ్యామిలీతో నటించడమంటే నా కల నెరవేరినట్టుంది. ‘మోసగాళ్ళు’ కథ అందరి హృదయాలకు బాగా దగ్గరైంది.. అందుకే ఎంతో మనసు పెట్టి చేశాం. ప్రతి రోజూ మధ్నాహ్నం మోహన్‌బాబుగారి ఇంటి నుంచి వచ్చే భోజనం తిని నా బరువు కూడా పెరిగాను. ఆయన శ్రీమతిగారికి థ్యాంక్స్’’ అన్నారు. హీరో మంచు విష్ణు మాట్లాడుతూ– ‘‘అడిగిన వెంటనే మా సినిమా చేసిన సునీల్ శెట్టికి, మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్గా ఉంటూ నా అక్క పాత్ర చేసిన కాజల్‌కు, నవదీప్, ఎడిటర్ గౌతమ్రాజుగారితో పాటు సహకరించిన మొత్తం టీమ్‌కి థ్యాంక్స్. సునీల్ శెట్టిగారితో చేసిన ఓ యాక్షన్ సీక్వెన్స్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. నాన్నగారి పుట్టినరోజున ‘మోసగాళ్ళు’ విడుదలవడం నా లక్’’ అన్నారు. ‘‘పెళ్లి తర్వాత విడుదలవుతున్న నా తొలి చిత్రం ‘మోసగాళ్ళు’’ అన్నారు కాజల్. అతిథిగా వచ్చిరానా మాట్లాడుతూ– ‘‘మోహ్రా’ సినిమాలో సునీల్ శెట్టి కండలు చూసి 8వ తరగతిలోనే నేనూ జిమ్‌కి వెళ్లడం మొదలెట్టా. ఈ నెల 19న ఒక ప్రత్యేకమైన వ్యక్తి (మోహన్‌బాబు) పుట్టినరోజు. ఆ రోజు థియేటర్‌కి వెళ్లి ‘మోసగాళ్ళు’ సినిమా చూసి ఎంజాయ్ చేయండి’’ అని అన్నారు. -
కొందరు దర్శకులు నన్ను మోసం చేశారు
‘‘మోసగాళ్ళు’ సినిమా కోసం నా వద్ద ఉన్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టాను. సినిమా బాగా రావడంతో విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ప్రేక్షకుల రిజల్ట్ కోసం చూస్తున్నాం’’ అని హీరో మంచు విష్ణు అన్నారు. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్ళు’. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో ‘మోసగాళ్ళు’ చిత్రం 10 నిమిషాల ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. మంచు విష్ణు మాట్లాడుతూ– ‘‘తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో నిర్మించిన చిత్రం ‘మోసగాళ్ళు’. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో డబ్ చేశాం. ఇంగ్లీష్ మినహా ఐదు భాషల్లో ఒకేరోజు నా సినిమా విడుదలవుతుండటం ఇదే మొదటిసారి. దీంతో చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ఈ సినిమాలో సునీల్ శెట్టి మినహా అందరూ మోసగాళ్లే. నిజ జీవితంలో కొందరు దర్శకులు నన్ను మోసం చేశారు’’ అన్నారు. కార్యక్రమంలో నవదీప్ పాల్గొన్నారు. ఉక్కు పోరాటం న్యాయమైనదే: మంచు విష్ణు వైజాగ్ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న పోరాటం న్యాయమైనదే. ‘వైజాగ్ ఉక్కు–ఆంధ్రుల హక్కు’ అని 1962లో ఎన్నో ఆందోళనలు చేసి సాధించుకున్న పరిశ్రమ అది అని నాన్నగారు (మోహన్‌బాబు) కూడా చెప్పారు. నరేంద్ర మోదీగారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు నేను పెద్ద అభిమానిని. కానీ ఇప్పుడు కాదు. కేంద్రం నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తోంది. ఉక్కు ఉద్యమానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తాం అంటూ మంత్రి కేటీఆర్ చెప్పడం సంతోషం. చదవండి: (స్నేహం.. యాక్షన్.. థ్రిల్) -
స్నేహం.. యాక్షన్.. థ్రిల్
‘‘అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధా రంగా ‘మోసగాళ్ళు’ చిత్రాన్ని రూపొందించాం. ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాం. మా నాన్న (మంచు మోహన్‌బాబు) పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 19న సినిమాను విడుదల చేస్తున్నాం. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని మంచు విష్ణు అన్నారు. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్ళు’. ఇందులో విష్ణు సోదరిగా కాజల్ అగర్వాల్ నటించారు. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ చిన్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, నవదీప్, నవీన్‌చంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన దాదాపు పది నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను శుక్రవారం వైజాగ్ మెలోడి థియేటర్లో ప్రేక్షకులకు చూపించారు. అనంతరం విలేకరులతో మంచు విష్ణు మాట్లాడుతూ – ‘‘విశాఖలో అభిమానులతో ఈ ప్రీమియర్ షో చూడడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్‌గా ఉంటుంది. ఈ చిత్రంలో స్నేహం, యాక్షన్, థ్రిల్లింగ్ అన్నీ ఉంటాయి’’ అన్నారు. నవదీప్ కూడా పాల్గొన్నారు. -
ఆ పేరొస్తే చాలు
‘‘నేను నటుడవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాను.. అంతేకానీ హీరోనా, విలనా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానా? అని ఏదో ఒకదానికి ఫిక్స్ అవ్వాలనుకోలేదు. ఒక మంచి కథలో నా పాత్రకు ప్రాధాన్యం ఉంటే చేయడానికి అభ్యంతరం లేదు. ‘నవీన్ చంద్ర అన్ని రకాల పాత్రలూ చేయగలడు.. చేస్తాడు’ అనే పేరొస్తే చాలు’’ అని నవీన్ చంద్ర అన్నారు. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్ళు’. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. అందులో ప్రధాన పాత్రలో పోషించిన నవీన్ చంద్ర విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఐటీ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ‘మోసగాళ్ళు’ కథ విన్నప్పుడు ఇంతపెద్ద కుంభకోణం జరిగిందా? అనిపించింది. ఈ సినిమాలో విష్ణు–కాజల్ అగర్వాల్‌లకు కజిన్ గా నటించా. వారికి ఎటువంటి ఆపద వచ్చినా నేను రక్షిస్తుంటా. ఎంత మేధావి అయినా తప్పు చేస్తే చివరికి శిక్ష తప్పదు? అనేది చూపిస్తున్నాం. ఇందులో నా పాత్ర డ్రగ్స్‌కి, మద్యానికి బానిసై ఉంటుంది. ‘ఎవరు’, ‘అరవింద సమేత వీరరాఘవ’ల్లో నా పాత్రలకు మంచి పేరొచ్చింది. ఇప్పటివరకూ నాకంటూ ఎటువంటి ఇమేజ్ లేకుండా నటుడిగా కొనసాగుతుండటం సంతృప్తిగా ఉంది’’ అన్నారు. -
మోసగాళ్లు వచ్చేది అప్పుడే!
మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్ళు’. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదల తేదీని ప్రకటించి, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు నటుడు మంచు మోహన్‌బాబు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు. ‘‘అమెరికాలో జరిగిన ఐటీ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఈ భారీ స్కామ్ వల్ల అక్కడి కొన్ని వేల కుటుంబాలు అతలాకుతలం అయ్యాయి. 4వేల కోట్ల స్కామ్ చేసిన వారు దొరికారా? లేదా? దోచుకున్న డబ్బుని ఎక్కడ దాచిపెట్టారు? అనే కథతో చిత్రాన్ని రూపొందించాం. చిరంజీవిగారు విడుదల చేసిన ట్రైలర్‌కి చాలా మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రబృందం పేర్కొంది. నవదీప్, నవీన్ చంద్ర, వైవా హర్ష తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్యామ్ సి.ఎస్, షెల్డన్ చౌ. -
నచ్చినవే చేయాలనుకుంటున్నాను
‘‘ఇన్ని రోజులూ నాకు వచ్చిన రోల్స్ చేయాలా? లేక నచ్చినవి చేయాలా? అనే కన్ ఫ్యూజన్ ఉండేది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. నాకు నచ్చినవే చేయాలని డిసైడ్ అయ్యాను’’ అన్నారు నవదీప్. మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్‌శెట్టి ప్రధాన పాత్రధారులుగా జెఫ్రీ చిన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మోసగాళ్ళు’. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన నవదీప్ చెప్పిన విశేషాలు. ► ఓ మోస్తరుగా చదువు వచ్చిన బ్రదర్ అండ్ సిస్టర్ కలిసి కాల్ సెంటర్ ఆధారంగా అమెరికాలో 150 మిలియన్ డాలర్ల స్కామ్‌ను ఎలా చేశారు? అనే అంశంతో ‘మోసగాళ్ళు’ సినిమా ఉంటుంది. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ చిన్ తో సినిమా చేయడం కొత్త అనుభూతిని ఇచ్చింది. మంచు విష్ణు సినిమా స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా ఆసక్తి అనిపించింది. టెక్నాలజీలోని లోటుపాట్లను వాడుకుని స్కామ్ చేయడమనే అంశం ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుంది. ► ఈ సినిమాలో నాది వైట్ కాలర్ క్రిమినల్ జాబ్. మహిళలను తక్కువగా అంచనా వేసే పాత్ర. కథ ప్రకారం మంచు విష్ణు, కాజల్ నన్ను మోసం చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే సునీల్ శెట్టిగారు తప్ప మేమందరం మోసగాళ్ళమే. ► నా స్నేహితుడు పవన్ తో కలిసి ఆరంభించిన ‘సీ స్పేస్’లో దాదాపు 40 మంది రైటర్స్ ఉన్నారు. ఓ పేపర్ కటింగ్ తీసుకువచ్చి మా ‘సీ స్పేస్’లో ఇచ్చి సినిమాకు కథ కావాలంటే చేసిన ఇస్తాం. వెబ్ సిరీస్‌గా డెవలప్ చేయమన్నా చేస్తాం. ఓ ఫ్యాంటసీ లవ్‌స్టోరీలో హీరోగా నటించబోతున్నాను. -
అందుకే నా మార్కెట్‌ని మించి ఖర్చుపెట్టాను
‘‘నా కెరీర్లో పెద్ద బడ్జెట్ సినిమా ‘మోసగాళ్ళు’. నా మార్కెట్ అంత లేదు. కానీ సినిమాపై నమ్మకంతో నా మార్కెట్‌ని మించి ఖర్చు పెట్టా. ఏ సినిమా అయినా నిర్మాతకి రిస్కే. కాకపోతే ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు రిస్క్ తీసుకుంటామని ముందుకెళ్లా’’ అని హీరో మంచు విష్ణు అన్నారు. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్ళు’. హీరోయిన్ కాజల్ అగర్వాల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు. ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై రూపొందిన ‘మోసగాళ్ళు’ చిత్రం ట్రైలర్‌ని హీరో చిరంజీవి సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో మంచు విష్ణు మాట్లాడుతూ– ‘‘అడిగిన వెంటనే ట్రైలర్‌ని రిలీజ్ చేసిన చిరంజీవిగారికి, వాయిస్ ఓవర్ ఇచ్చిన వెంకటేష్‌గారికి ధన్యవాదాలు. 2015 నుంచి 2017 వరకూ ఓ అక్క, తమ్ముడు కలసి ముంబయ్, గుజరాత్‌లలో ఉండి ఒక సింపుల్ ఐడియాతో అమెరికా డబ్బుని 4వేల కోట్ల స్కామ్ చేశారు. అమెరికాలో జరిగిన ఈ స్కామ్‌ని ఎందుకు సినిమాగా చేయకూడదనిపించింది? ‘మోసగాళ్ళు’ కథని అమెరికాలో ఉండి మూడేళ్లు డెవలప్ చేశాం. హాలీవుడ్‌కి ధీటుగా జెఫ్రీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నా అక్క పాత్ర చేయమని ప్రీతీ జింతాని అడిగితే, ఈ పాత్ర చేస్తే బయట తనకు ఇబ్బందులు వస్తాయని చేయనన్నారు. ఆ తర్వాత కాజల్‌కి కథ చెప్పగానే ఎంతో స్పోర్టివ్‌గా తీసుకొని చేసింది. నిజంగా చెప్పాలంటే ఈ చిత్రంలో హీరో నేను కాదు.. కాజల్. సునీల్ శెట్టిగారికి కథ చెప్పగానే ఒప్పుకున్నారు. సునీల్ శెట్టిగారి పాత్రని నేను చేయాల్సింది, కానీ కుదరలేదు. ‘మోసగాళ్ళు’ చూసిన నాన్నగారు (మోహన్ బాబు), డైరెక్టర్ శ్రీను వైట్లగారు ‘నువ్వేంటి విలన్ గా చేశావ్?’ అన్నారు. మా అమ్మ (నిర్మల) మాత్రం బాగా చేశావన్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేరోజు, వేర్వేరు టైటిల్స్‌లో మా సినిమా విడుదలవుతుంది.. ఎప్పుడు రిలీజ్ చేస్తామన్నది మరో వారంలో ప్రకటిస్తాం. ‘భక్త కన్నప్ప’ నా డ్రీమ్ ప్రాజెక్ట్. అది స్టార్ట్ అయ్యేందుకు కొంచెం సమయం పడుతుంది’’ అన్నారు. -
మోసగాళ్లు ట్రైలర్.. ఇంత డబ్బు ఎక్కడ దాచిపెట్టాలి!
హీరో మంచు విష్ణు తాజాగా నటిస్తున్న చిత్రం మోసగాళ్లు. ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ స్కాం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఫిబ్రవరి 25(గురువారం) విడుదలైంది. ఈ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ మేరకు ట్విటర్లో మోసగాళ్లు చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. ఇక ట్రైటర్ విషయానికొస్తే ‘డబ్బు సంతోషాన్ని ఇస్తుందనుకున్నా.. డబ్బు సెక్యూరిటీ ఇస్తుందనుకున్నా.. ఒట్టేసుకున్నా ఈ పేదరికం నుంచి దూరంగా వెళ్లిపోవాలని’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. కాజల్, విష్ణుల డైలాగులు బాగున్నాయి. ట్రైలర్ చూస్తున్నంతసేపు తరువాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠను రేపుతోంది. సినిమాపై ఉన్న అంచనాలను ట్రైలర్ తారాస్థాయికి తీసుకొని వెళుతోందని చెప్పవచ్చు. ఇక ఎప్పటినుంచో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న విష్ణు ఈ సినిమాతో అనుకున్న స్థాయి హిట్ అందుకుంటారని ప్రేక్షకులు భావిస్తున్నారు. జాఫ్రె చిన్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో మంచు విష్ణు సోదరి పాత్రలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు నవదీప్, నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. చదవండి: సీఎం జగన్‌తో మంచు విష్ణు లంచ్ ఆచార్య షూటింగ్: వీడియో తీసిన ఫ్యాన్స్! Here is the trailer of #Mosagallu ,Based on a true story, one of the biggest IT scams that shook the USA. All the best Dear @iVishnuManchu & Best wishes to the entire team 💐#Mosagallu Trailer ▶️ (link)https://t.co/7ylGl02i7p — Chiranjeevi Konidela (@KChiruTweets) February 25, 2021 -
వాలంటైన్స్ డే: 'టక్ జగదీష్' నుంచి లవ్ సాంగ్
వేలంటైన్స్ డే స్పెషల్‌గా ‘టక్ జగదీష్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాల్లోని ప్రేమ పాటలను రిలీజ్ చేశారు. ఆ విశేషాలు... ఇంకోసారి ఇంకోసారి ‘ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరి’ అని తన ప్రేయసి గురించి పాడుకుంటున్నారు టక్ జగదీష్. ఈ పాట వెనుక కథేంటో సినిమా చూసి తెలుసుకోవాలి. నాని హీరోగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టక్ జగదీష్’. ఈ సినిమాలోని మొదటి పాట ‘ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరి’ని విడుదల చేశారు. తమన్ సంగీతం అందించిన ఈ పాటను శ్రేయా ఘోషల్, కాలభైరవ ఆలపించారు. చైతన్య ప్రసాద్ రచించారు. ఏప్రిల్‌లో సినిమా విడుదల. గుచ్చే గులాబీ ‘గుచ్చే గులాబీలా నా గుండెలోతునే తాకినదే..’ అంటూ తన ప్రేయసి కోసం పాడుతున్నారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అఖిల్. ఆయన హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమాలోని రెండో పాటను శనివారం విడుదల చేశారు. గోపీసుందర్ సంగీతంలో అనంత్ శ్రీరామ్ రచించిన ఈ పాటను అర్మాన్ మాలిక్ పాడారు. జూన్ 19న విడుదల కానున్న ఈ సినిమాను ‘బన్నీ’ వాసు, వాసు వర్మ నిర్మించారు. మస్తీ చేస్కో ‘డబ్బే ఉంటే మస్తీ చేస్కో’ అంటు న్నారు విష్ణు మంచు. ఆయన హీరోగా నటించి, నిర్మించిన తాజా చిత్రం ‘మోసగాళ్లు’. భారీ ఐటీ స్కామ్ ఆధారంగా హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ ఈ సినిమాను తెరకెక్కించారు. కాజల్ అగర్వాల్, రుహీ సింగ్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో రెండవ పాట ‘డబ్బే మనది కుమ్మేస్కో.. మస్తీ మస్తీ చేస్కో.. కాస్ట్లీ మందే వేసేస్కో...’ని శుక్రవారం రిలీజ్ చేశారు. సామ్ సీయస్ సంగీతం అందించిన ఈ పాటకు సిరాశ్రీ సాహిత్యం అందించగా హేమచంద్ర ఆలపించారు. ఈ పాటకు విశేష స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. రూ. 51 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మార్చి 19న, మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని అనుకుంటున్నారు. -
మంచి డేట్‌ను బుక్ చేసేసుకుంటున్నాం
ఈ మూడు చిత్రాల రిలీజ్ డేట్స్ బుధవారం అధికారికంగా ప్రకటించారు. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్లు’. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ చిన్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. నటుడు, మంచు విష్ణు తండ్రి మోహన్‌బాబు పుట్టినరోజు మార్చి 19. తండ్రి బర్త్‌డే స్పెషల్‌గా ఈ సినిమాను మార్చి 19న విడుదల చేయనున్నారు విష్ణు. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా అల్లు అరవింద్ సమర్పణలో ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. బన్నీ వాసు, దర్శకుడు వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 19న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉండగా, ‘‘మేం మా సినిమాకు ఓ మంచి డేట్‌ను బుక్ చేసేసుకుంటున్నాం. టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేయకముందే అక్టోబర్ 1న సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం’’ అని ప్రకటించాయి – జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఈ సంస్థలు ఓ సినిమా నిర్మించనున్నాయి. ఈ సినిమా ఇంకా షూటింగ్ సెట్‌కి వెళ్లకముందే రిలీజ్ డేట్ సెట్ చేయడం విశేషం. మార్చి నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. -
సినీ పండగ కళ
సంక్రాంతి మనకు పెద్ద పండగ. సినిమావాళ్లకు ఇంకా పెద్ద పండగ. ఆల్రెడీ థియేటర్స్‌లో పలు సినిమాలు సందడి చేస్తున్నాయి. త్వరలో రాబోయే సినిమాల మీటరేంటో.. మ్యాటరేంటో.. పోస్టర్స్, ప్రోమో రూపంలో వచ్చాయి. సంక్రాంతికి సందడి తీసుకొచ్చిన సినిమాల విశేషాలేంటో చూద్దాం. ► రవితేజ డబుల్ యాక్షన్ చేస్తున్న తాజా చిత్రం ‘ఖిలాడీ’. రమేశ్ వర్మ దర్శకుడు. సంక్రాంతి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ► 2019లో ‘ఎఫ్2’కి సంక్రాంతి అల్లుళ్లుగా సందడి చేశారు వెంకటేశ్, వరుణ్ తేజ్. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ ‘ఎఫ్ 3’ చేస్తున్నారు. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈసారి ఈ తోడల్లుళ్ల ఫుల్ టార్గెట్ డబ్బు సంపాదనే అట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ► విష్ణు మంచు హీరోగా తెరకెక్కుతున్న థ్రిల్లర్ చిత్రం ‘మోసగాళ్లు’. కాజల్ అగర్వాల్, రుహానీ శర్మ ముఖ్య పాత్రలు చేశారు. భారీ ఐటీ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు జెఫ్రీ చిన్ దర్శకుడు. ఈ సినిమా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ► ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’గా మారారు అఖిల్. పూజా హెగ్డే జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ రొమాంటిక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకుడు. ► సాయి తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. కృతీ శెట్టి కథానాయిక. విజయ్ సేతుపతి విలన్. బుచ్చిబాబు సన దర్శకుడు. ఈ సినిమా టీజర్ బుధవారం విడుదలయింది. ► రానా, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘విరాట పర్వం’. నక్సలిజమ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకుడు. ఈ సినిమాను వేసవిలో విడుదల చేస్తున్నట్టు కొత్త పోస్టర్ ద్వారా ప్రకటించారు. ► మాఫియా నేపథ్యంలో ఉపేంద్ర హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘కబ్జా’. ఆర్. చంద్రు దర్శకుడు. ఈ సినిమాలో సుదీప్ కీలక పాత్రలో నటించనున్నారు. సుదీప్ లుక్‌ను విడుదల చేశారు. ► బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్లాక్ రోజ్’. మోహన్ భరద్వాజ్ దర్శకుడు. సంక్రాంతికి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ► ‘వెయ్యి అబద్ధాలు ఫేమ్ ఎస్తేర్ ముఖ్య పాత్రలో ‘హీరోయిన్’ అనే సినిమా ప్రకటించారు. తిరుపతి ఎస్ఆర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ఎస్తేర్ శృంగార తారగా నటించనున్నారు. ► వశిష్ట సింహా, హెబ్బా పటేల్, సాయి రోనక్, పూజిత ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘ఓదెల రైల్వేస్టేషన్’ పోస్టర్ విడుదలయింది. ► -
మాస్ సిద్
పుట్టినరోజు సందర్భంగా నవీన్‌చంద్ర కొత్త లుక్‌లో కనిపించారు. మంచు విష్ణు నిర్మాతగా, హీరోగా చేస్తున్న ‘మోసగాళ్లు’ చిత్రంలో నవీన్‌చంద్ర చేస్తున్న ‘సిద్’ పాత్ర లుక్‌ని బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఫిలిమ్స్ పతాకంపై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో అతి పెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కీలక పాత్రలో నవీన్‌చంద్ర కనిపిస్తారు. పోస్టర్ చూస్తుంటే తనది మాస్ క్యారెక్టర్ అని అర్థం అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా ఫిల్మ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్ ఆర్. -
మోసగాళ్ల కథ చెబుతా!
విష్ణు మంచు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విష్ణు సోదరిగా కాజల్ అగర్వాల్ నటించగా, విష్ణుకి జోడీగా రుహీ సింగ్ నటించారు. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో రూపొందిన ఈ చిత్రం తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది. కాగా ఈ చిత్రానికి హీరో వెంకటేశ్ వాయిస్ ఓవర్‌ను అందించడం విశేషం. ఈ సినిమా కథను ప్రారంభం నుంచి ముగింపు దాకా నరేట్ చేస్తారు వెంకటేశ్. ‘‘అల్లు అర్జున్ రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్‌కి మంచి స్పందన లభించింది. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయింది. టైటిల్ కీ థీమ్ మ్యూజిక్‌ని విడుదల చేసిన వెంకటేష్ వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడం ఈ చిత్రానికి మరింత ఆకర్షణ’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: శ్యామ్ సీఎస్, కెమెరా: షెల్డన్ చౌ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్ ఆర్. -
అందాల మోహిని
బాలీవుడ్ బ్యూటీ రుహీ సింగ్ ‘మోసగాళ్లు’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ఇది. ఇందులో విష్ణు సరసన రుహీ సింగ్ నటించారు. ఆమె పాత్ర పేరు మోహిని. ఈ సినిమాలో రుహీ గ్లామరస్‌గా కనిపిస్తారని గురువారం విడుదల చేసిన మోహిని లుక్ స్పష్టం చేస్తోంది. హాలీవుడ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ది వరల్డ్ బిఫోర్ హర్’ (2012)తో కెరీర్‌ను ప్రారంభించిన రుహీ సింగ్ తర్వాత హిందీలో ‘క్యాలండర్ గర్ల్స్’, ‘ఇష్క్ ఫరెవర్’ చిత్రాల్లో నటించారు. ‘మోసగాళ్లు’తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న రుహీ సింగ్ ‘ఈ సినిమాలో నటించడం చాలా కిక్ ఇచ్చింది. మోహిని పాత్ర చేయడం చాలా సరదాగా అనిపించింది’ అన్నారు. -
ఆట ఇప్పుడే మొదలైంది
మంచు విష్ణు హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. ఇందులో విష్ణుకి సోదరిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను అల్లు అర్జున్ శనివారం విడుదల చేశారు. ఇండియాలో మొదలై అమెరికాను వణికించిన భారీ ఐటీ స్కామ్‌కి పాల్పడిన వారిని వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిçస్తున్నట్లు టీజర్ మొదలవుతుంది. ‘మిమ్మల్ని కనిపెడతాం, నాశనం చేస్తాం. దీనికి అవసరమైన చర్యలు తీసుకోవటానికి నేను రెడీగా ఉన్నాను. ప్రిపేర్ అయ్యాను’ అని ట్రంప్ అంటారు. ఈ స్కామ్ వెనక ఉన్న మాస్టర్ మైండ్స్ మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ నోట్ల కట్టలు కుక్కిన బ్యాగుల మధ్య నిలబడి టీజర్లో కనిపిస్తారు. ‘ఇది సరిపోతుంది కదా’ అని కాజల్ అంటే, ‘ఆట ఇప్పుడే మొదలైంది’ అంటారు విష్ణు. ‘మోసగాళ్లు’ టీజర్‌ను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేశారు. ఈ చిత్రానికి దర్శకత్వం: జెఫ్రీ గీ చిన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్‌కుమార్ ఆర్. -
ఆట ఇపుడే మొదలైంది..టీజర్లో ట్రంప్
సాక్షి, హైదరాబాద్: విష్ణు మంచు హీరోగా నటిస్తోన్న 'మోసగాళ్లు' అఫీషియల్ టీజర్ ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శనివారం లాంచ్ చేశారు. స్కామ్ రహస్యాలను సూక్ష్మంగా రివీల్ చేసిన అల్లు అర్జున్ ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. తన చిన్ననాటి స్నేహితుడు, స్కూల్ మేట్, విష్ణుకి, ప్రియ నేస్తం కాజల్ అగర్వాల్ కి బస్ట్ విషెస్ అంటూ బన్నీ ట్వీట్ చేశారు. వాస్తవ ఘటనలు ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా తాజాగా స్టార్ హీరో అల్లు అర్జున్ క్రేజ్ వాడుకోవాలనే విష్ణు ప్లాన్ బాగానే వర్క అవుట్ అవుతోంది. 450 మిలియన్ డాలర్ల భారీస్కాంలో నేరస్థుల్ని పట్టుకుంటాం.. అంతం చేస్తాం..అవసరమైన చర్యల్ని తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నాననే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కమెంట్స్ తో ..ఆట ఇపుడే మొదలైందంటూ మరిన్ని అంచనాలు పెంచేశాడు హీరో విష్ణు. ఎందుకుంటే విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేసిన టైటిల్ కీ థీమ్ మ్యూజిక్కు అనూహ్యమైన స్పందన వచ్చింది. భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీని విస్తృతంగా ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌లో మొదలై, అమెరికాను వణికించిన చరిత్రలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా ‘మోసగాళ్ళు’ చిత్రం రూపొందుతోంది. మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ పోషిస్తుండగా, తొలిసారి తెలుగు తెరకు పరిచయమవుతున్న బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి మరో కీలక పాత్రలో అలరించనున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, మోషన్ పోస్టర్, థీమ్ మ్యూజిక్ బాగా ఆకట్టుకున్నాయి. జెఫ్రీ గీ చిన్ దర్శకతం వహిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సీఎస్. రుహి సింగ్, కర్మ మెక్కెయిన్, నవదీప్, నవీన్ చంద్ర, రుహీ సింగ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం , కన్నడ భాషలలో గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. -
థీమ్ ఆకట్టుకుంది
విష్ణు మంచు హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. ఈ సినిమాకు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విష్ణు సోదరిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. శ్యామ్ íసీఎస్ సంగీతం అందించారు. ‘మోసగాళ్లు’ టైటిల్ కీ థీమ్ మ్యూజిక్ ఇటీవల ‘ద రైజ్ ఆఫ్ మోసగాళ్లు’ పేరిట విడుదలైంది. ‘‘ఆసక్తికరంగా ఉన్న ఈ థీమ్ మ్యూజిక్ బాగా పాపులర్ అయింది. కుర్చీల్లో కదలకుండా కూర్చుని చూసే థ్రిల్లర్‌గా మా చిత్రం ఉంటుందనే అభిప్రాయాన్ని థీమ్ మ్యూజిక్ కలిగించింది. సినిమాకు బెస్ట్ మ్యూజిక్ ఇవ్వడానికి కృషి చేస్తున్నారు. ఇక కథ విషయానికొస్తే భారత్‌లో మొదలై, అమెరికాను వణికించిన చరిత్రలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి.