
కాజల్ అగర్వాల్
‘‘మంచి, చెడు అనేది మనం చూసే దృష్టి కోణాన్ని, పరిస్థితిని బట్టి ఉంటుంది. అను మనస్తత్వం ఎలాంటిదో మీరే (ప్రేక్షకులు) ఈ వేసవిలో నిర్ణయించండి’’ అన్నారు కాజల్ అగర్వాల్. ఇంతకీ అను ఎవరంటే ఎవరో కాదు.. ‘మోసగాళ్ళు’ సినిమాలో కాజల్ చేసిన పాత్ర పేరిది. శుక్రవారం అను లుక్‌ని రిలీజ్ చేశారు. మంచు విష్ణు హీరోగా జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో వయామార్ ఎంటర్‌టైన్మెంట్స్, ఏవీఏ బ్యానర్స్ పతాకాలపై విరోనిక మంచు నిర్మిస్తున్న చిత్రం ‘మోసగాళ్ళు’. ఇందులో కాజల్ అగర్వాల్, రుహాని సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. సునీల్ శెట్టి కీలక పాత్రధారి. ‘‘దేశంలో జరిగిన ఒక పెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ఇది. ఇటీవల లాస్ ఏంజిల్స్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించాం. సోమవారం నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను మొదలుపెట్టబోతున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment