
మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్ళు’. జెఫ్రీ గీ చిన్ దర్శకుడు. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ లాస్ ఏంజెల్స్‌లో జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన విష్ణు, కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌ను చిత్ర బృందం రివీల్ చేసింది. ‘మోసగాళ్లు’ చిత్రంలోని సునీల్ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది.
ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ కుమార్ పాత్ర పోషిస్తున్న సునీల్ శెట్టికు సంబంధించిన లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసు దుస్తుల్లో, తలకు టర్బన్ అతడి ఆహార్యం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. నవదీప్, నవీన్ చంద్ర, రుహాని సింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇక మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ ఇండో–హాలీవుడ్ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
COMING SOON #Mosagallu@iVishnuManchu @MsKajalAgarwal @pnavdeep26 @Naveenc212 @TheLeapMan @ruhisingh11 pic.twitter.com/KuAHLshI4b
— Suniel Shetty (@SunielVShetty) February 29, 2020
చదవండి:
అను ఎలాంటి అమ్మాయి?
‘ప్రేక్షకులూ.. సరిలేరు మీకెవ్వరూ..’
Comments
Please login to add a commentAdd a comment