జూన్‌లో మోసగాళ్ళు | Mosagallu release on 5 june 2020 | Sakshi
Sakshi News home page

జూన్‌లో మోసగాళ్ళు

Published Tue, Mar 31 2020 5:03 AM | Last Updated on Tue, Mar 31 2020 5:03 AM

Mosagallu release on 5 june 2020 - Sakshi

మంచు విష్ణు

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా హాలీవుడ్‌–ఇండియన్‌ సినిమా ‘మోసగాళ్ళు’. హాలీవుడ్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో లాక్‌డౌన్‌  ప్రకటించడంతో చిత్రంలో కీలకమైన ఐటీ ఆఫీస్‌ సన్నివేశాల చిత్రీకరణ నిలిచిపోయింది. కాగా ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ ను జూన్‌ 5న, ఇంగ్లిష్‌ వెర్షన్‌ ను జూలైలో విడుదల చేయనున్నట్లు విష్ణు తెలిపారు. ‘‘ఇటీవల విడుదల చేసిన ‘మోసగాళ్ళు’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్లకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. ఆ పోస్టర్లలో అర్జున్‌ గా విష్ణు, అను పాత్రలో కాజల్‌ అగర్వాల్, ఏసీపీ కుమార్‌గా సునీల్‌ శెట్టి కనిపించారు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాలో నవదీప్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement