భారీ కుంభకోణం | Mosagallu Movie Title Motion Poster Release | Sakshi
Sakshi News home page

భారీ కుంభకోణం

Published Sat, Sep 19 2020 2:34 AM | Last Updated on Sat, Sep 19 2020 2:34 AM

Mosagallu Movie Title Motion Poster Release - Sakshi

మంచు విష్ణు, కాజల్‌ అగర్వాల్‌ బ్రదర్‌ – సిస్టర్‌గా నటిస్తోన్న క్రాస్‌ఓవర్‌ చిత్రం ‘మోసగాళ్లు’. శుక్రవారం హీరో వెంకటేశ్‌ ఈ చిత్రానికి సంబంధించిన ‘ది రైజ్‌ ఆఫ్‌ మోసగాళ్లు’ (టైటిల్‌ థీమ్‌ మ్యూజిక్‌)ను విడుదల చేశారు. ఈ థ్రిల్లర్‌ చిత్రాన్ని జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మంచు విష్ణు నిర్మిస్తున్నారు. భారత్‌లో మొదౖలై అమెరికాను సైతం వణికించిన చరిత్రలోనే అతి పెద్ద భారీ ఐటీ కుంభకోణం నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సునీల్‌శెట్టి నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌కుమార్‌ ఆర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement