
మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ‘మోసగాళ్ళు’ సినిమా మోషన్ పోస్టర్ శుక్రవారం విడుదలైంది. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విష్ణు మంచు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను హీరో దగ్గుబాటి వెంకటేష్ లాంచ్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న హాలీవుడ్–ఇండియన్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటుంది.
ఇక మరో విశేషం ఏంటంటే ఈ సినిమాలో విష్ణు–కాజల్ అగర్వాల్ బ్రదర్ అండ్ సిస్టర్ పాత్రలు చేస్తున్నారని చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించింది. దీంతో అసలు వీరిద్దరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయన్న సస్పెన్స్ అభిమానుల్లో నెలకొంది. ఇక ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ కుమార్ పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటిస్తున్నాడు. వేసవిలోనే ‘మోసగాళ్లు’ విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగగా వాయిదా పడింది. దీంతో మరి థియేటర్స్ తెరిచేవరకు చిత్రబృందం వెయిట్ చేస్తుందా లేక ఓటీటీ వైపు వెళ్తుందా అన్నది తెలియాల్సి ఉంది. (బ్రదర్ అండ్ సిస్టర్)
Comments
Please login to add a commentAdd a comment