Mosagallu: ఓటీటీలోకి వచ్చేసిన మంచు విష్ణు ‘మోసగాళ్లు’ | Mosagallu Movie Streaming On Amazon Prime Video | Sakshi
Sakshi News home page

Mosagallu: ఓటీటీలోకి వచ్చేసిన మంచు విష్ణు ‘మోసగాళ్లు’

Published Wed, Jun 16 2021 8:59 PM | Last Updated on Thu, Jun 17 2021 9:55 AM

Mosagallu Movie Streaming On Amazon Prime Video - Sakshi

మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహించారు. ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి  19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐటీ స్కామ్‌ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి మంచి స్పందన వచ్చింది. పాన్‌ ఇండియా లెవల్లో వచ్చిన ఈ సినిమా మంచు విష్ణు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.

క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో నిజ జీవిత సంఘటనల నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ ఇంగ్లీష్, తమిళం, మలయాళం, కన్నడలో ఒకేసారి విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్దమైంది.  ప్రముఖ ఓటీటీ వేదిక ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో నేటి నుంచి (జూన్‌ 16) ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో మంచు విష్ణుకు సోదరిగా కాజల్‌ నటించింది.  బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, నవదీప్‌, నవీన్‌చంద్ర కీలక పాత్రల్లో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement