హీరో మంచు విష్ణు తాజాగా నటిస్తున్న చిత్రం మోసగాళ్లు. ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ స్కాం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఫిబ్రవరి 25(గురువారం) విడుదలైంది. ఈ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో మోసగాళ్లు చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. ఇక ట్రైటర్ విషయానికొస్తే ‘డబ్బు సంతోషాన్ని ఇస్తుందనుకున్నా.. డబ్బు సెక్యూరిటీ ఇస్తుందనుకున్నా.. ఒట్టేసుకున్నా ఈ పేదరికం నుంచి దూరంగా వెళ్లిపోవాలని’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. కాజల్, విష్ణుల డైలాగులు బాగున్నాయి. ట్రైలర్ చూస్తున్నంతసేపు తరువాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠను రేపుతోంది. సినిమాపై ఉన్న అంచనాలను ట్రైలర్ తారాస్థాయికి తీసుకొని వెళుతోందని చెప్పవచ్చు.
ఇక ఎప్పటినుంచో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న విష్ణు ఈ సినిమాతో అనుకున్న స్థాయి హిట్ అందుకుంటారని ప్రేక్షకులు భావిస్తున్నారు. జాఫ్రె చిన్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో మంచు విష్ణు సోదరి పాత్రలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు నవదీప్, నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు.
చదవండి: సీఎం జగన్‌తో మంచు విష్ణు లంచ్
ఆచార్య షూటింగ్: వీడియో తీసిన ఫ్యాన్స్!
Here is the trailer of #Mosagallu ,Based on a true story, one of the biggest IT scams that shook the USA. All the best Dear @iVishnuManchu &
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 25, 2021
Best wishes to the entire team 💐#Mosagallu Trailer ▶️ (link)https://t.co/7ylGl02i7p
Comments
Please login to add a commentAdd a comment