
పుట్టినరోజు సందర్భంగా నవీన్‌చంద్ర కొత్త లుక్‌లో కనిపించారు. మంచు విష్ణు నిర్మాతగా, హీరోగా చేస్తున్న ‘మోసగాళ్లు’ చిత్రంలో నవీన్‌చంద్ర చేస్తున్న ‘సిద్’ పాత్ర లుక్‌ని బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఫిలిమ్స్ పతాకంపై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో అతి పెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కీలక పాత్రలో నవీన్‌చంద్ర కనిపిస్తారు. పోస్టర్ చూస్తుంటే తనది మాస్ క్యారెక్టర్ అని అర్థం అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా ఫిల్మ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్ ఆర్.
Comments
Please login to add a commentAdd a comment