సునీల్ శెట్టి
‘‘మోసగాళ్ళు’ టీమ్‌తో పని చేయడం హ్యాపీగా ఉంది. తినడం, ప్యాకప్ చెప్పడం, రిహార్సల్స్.. ఇలా ప్రతి ఒక్కటీ అనుకున్న సమయంలో అయిపోయేవి. అదే దక్షిణాది పరిశ్రమ గొప్పతనం’’ అని బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి అన్నారు. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్ళు’. జెఫ్రీ గీ చిన్ దర్శకుడు.ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు సునీల్ శెట్టి. ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా సునీల్ శెట్టి చెప్పిన విశేషాలు.
► అదిరిపోయే కథ, మంచి దర్శకుడు, హాలీవుడ్ స్థాయి స్టాండర్డ్స్.. అన్నీ కలిసి ‘మోసగాళ్ళు’ సినిమాను ఒప్పుకునేలా చేశాయి. అక్కాతమ్ముడు కలిసి ఓ కుంభకోణం చేయడమనే ఈ కథ నన్ను ఆకట్టుకుంది. వారిని పట్టుకోవడమే నా పాత్ర. వాస్తవ ఘటనల ఆధారంగా తీసే సినిమాలు వర్కవుట్ అవుతుంటాయి.
► తెలుగు భాష మాట్లాడటం కష్టం కానీ, అర్థం చేసుకోవడం సులభమే. నాకు ఫిట్‌గా ఉండటం ఇష్టం. ఏం తింటున్నాను.. ఎంత తినాలి? అనేదానిపై నాకంటూ ఓ అవగాహన ఉంది. ప్రతిరోజూ యోగా, వర్కవుట్లు కచ్చితంగా చేస్తాను. విష్ణు కొత్త తరానికి చెందిన నటుడు. ఫిట్‌నెస్ గురించి మాకంటే తనకే ఇంకా బాగా తెలుస్తాయి. ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య యాక్షన్ సీక్వెన్స్‌లున్నాయ్. ఫైట్స్ చేసేటప్పుడు టైమింగ్‌తో చేయాలి.. లేదంటే గాయాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో ‘గని’ చేస్తున్నాను. ఈ సినిమా కోసం మళ్లీ నా శరీరాకృతిని మార్చాలి.
Comments
Please login to add a commentAdd a comment