
అతను ఇప్పుడు నా సినిమాలో చేశాడని నా మందు ఉన్నాడని పొగడటం కాదు.. దానివల్ల తొక్క ఏం రాదు
మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో కాజల్ అగర్వాల్ విష్ణుకి అక్కగా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, నవదీప్, నవీన్‌చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూల్లో పాల్గొన్న విష్ణు.. నవదీప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నవదీప్‌ని పొగుడుతూనే.. అతని చెడు అలవాట్లు ఏంటో బయటపెట్టేశాడు.
నా దృష్టిలో మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ నవదీప్. అతని టాలెంట్‌కి తగ్గ గుర్తింపు రాలేదు. అతని కెపబిలిటీకి ఇప్పుడున్న గుర్తింపు నథింగ్. అతను ఇప్పుడు నా సినిమాలో చేశాడని నా మందు ఉన్నాడని పొగడటం కాదు.. దానివల్ల తొక్క ఏం రాదు. ఐదుసార్లు ఫోన్ చేస్తే ఒక్కసారి కూడా ఎత్తడు. అలాంటి దరద్రమైన అలవాట్లు ఉన్నాయి అతనికి. కానీ.. అతని దగ్గర టాలెంట్ చాలా ఉంది.. ఎఫర్ట్ పెట్టి చేస్తాడు. నేను ఒక సెక్షన్ అయినతరువాత బ్రదర్ దీన్ని మనం తెలుగులో ఎలా చేద్దాం.. అని డిస్కష్ చేశా. ముఖ్యంగా నవదీప్‌కి ఓన్లీ యాక్టింగ్ అనే కాదు.. రైటింగ్ మీద ఫుల్ గ్రిప్ ఉంది. ఆ విషయంలో నేను చాలా లక్కీ. ఈ సినిమాలో నవదీప్ చాలా స్టైలిష్‌గా చేశాడు.. అతనితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది’ అంటూ నవదీప్‌ని పొగుడుతూనే, అతని చెడు అలవాట్లను బయటపెట్టేశాడు. అయితే దీనిపై నవదీప్ సెటైరికల్‌గా స్పందించాడు.. ‘నాకు ఉన్న దరిద్రమైన అలవాట్లలో విష్ణు ఒక ఉదాహరణ మాత్రమే చెప్పాడు. అలాంటివి చాలా ఉన్నాయి’అని నవదీప్ చెప్పడంతో యాంకర్‌తో పాటు విష్ణు, నవీన్ చంద్ర ఘోల్లున్న నవ్వారు.
చదవండి:
ఇదే తొలిసారి.. ‘చందమామ’తో నాగ్ రొమాన్స్!
జాతిరత్నాలు’ డైరెక్టర్‌తో వైష్ణవ్ తేజ్ సినిమా