ఏసీపీ కుమార్‌ రిపోర్టింగ్‌ | Sunil Shetty Will As Police Officer In Mosagallu Movie | Sakshi
Sakshi News home page

ఏసీపీ కుమార్‌ రిపోర్టింగ్‌

Published Sun, Mar 1 2020 4:33 AM | Last Updated on Sun, Mar 1 2020 4:33 AM

Sunil Shetty Will As Police Officer In Mosagallu Movie - Sakshi

మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘మోసగాళ్లు’ చిత్రం షూటింగ్‌ చివరి దశలో ఉంది. కాజల్‌ అగర్వాల్, రుహాని సింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  వియామార్‌ ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.వి.ఎ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై విరానికా మంచు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్‌ దర్శకుడు. ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ సిక్కు పోలీసాఫీసర్‌గా బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి నటిస్తున్నారు. ఆయన లుక్‌ను శనివారం విడుదల చేశారు. ఈ చిత్రంలో ఏసీపీ కుమార్‌ పాత్రలో ఆయన కనపడనున్నారు. అతిపెద్ద ఐటీ కుంభకోణం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. రేపటినుండి ఈ చిత్రం తదుపరి షెడ్యూల్‌ జరగనుంది. వేసవిలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement