Assistant Commissioner of Police
-
పునాటి నరసింహారావుకు ఇండియన్ పోలీస్ మెడల్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగంలో నిబద్ధత కలిగి ఉండటం.. ఏ విభాగంలో పని చేసినా.. అక్కడ అత్యుత్తమ సేవలందించడం.. డిపార్ట్ మెంట్లో ఉన్నతాధికారుల చేత మన్ననలు అందుకోవడం ఆ పోలీసు అధికారికి మొదటి నుంచి ఉన్న ట్రాక్ రికార్డ్. అందుకే ఇప్పుడు ఇండియన్ పోలీస్ మెడల్ ను అందుకుని మరోసారి తన వర్క్‌లో సిన్సియారిటీని చూపించారు. ఆయన ఎవరో కాదు.. హైదరాబాదులోని మియాపూర్ ఏసీపీ నరసింహరావు. మియాపూర్ ఏసీపీగా పనిచేస్తున్న ఆయన ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన మెడల్‌ను అందుకున్నారు. 1995లో ఎస్సైగా విధుల్లో చేరిన ఆయన 2009లో సి.ఐగా పదోన్నతి పొందారు. వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆయన విధులు నిర్వహించారు. పోలీస్ శాఖలో ఆయన చేసిన సేవలకు గాను గతంలోనూ ఉత్తమ సేవా పతకం అందుకోగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పోలీస్ మెడల్(ఐ.పి.యమ్ )కు ఎంపిక చేసింది. 2021లో ఏసీపీగా పదోన్నతి పొందిన ఆయన.. ఇంటిలిజెన్స్ విభాగంలో కొంతకాలం పనిచేశారు. ప్రస్తుతం నరసింహారావు మియాపూర్ ఏసిపిగా విధుల్లో కొనసాగుతున్నారు. ఇండియన్ పోలీస్ మెడలను అందుకున్న ఆయనకు మియాపూర్ సబ్ డివిజన్ కు చెందిన పోలీసు సిబ్బంది ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మరింత మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించడం, డిపార్ట్ మెంటుపై ప్రజలకు నమ్మకం కలిగించడం... అవగాహన, కౌన్సెలింగ్ ద్వారా నేరాలు చేయకుండా ప్రజలను అప్రమత్తం చేయడం లాంటివి చేస్తూ... తన ఉద్యోగధర్మ నిర్వర్తిస్తున్నట్టు ఏసీపీ నరసింహరావు మెడల్ అందుకున్న సందర్భంగా చెప్పారు. తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యుల సహకారంతోనే తాను డిపార్టుమెంటులో అత్యుత్తమ సేవా పతకాలు పొంది. ప్రజలకు మరింత చేరువ అవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉన్నతాధికారుల సహకారం మరువలేనిదని ఆయన అన్నారు. భవిష్యత్తులోనూ తన శక్తి మేరకు మంచి సేవలందించడమే తన కర్తవ్యమని ఆయన చెప్పారు. -
రద్దీ రోడ్డు.. ట్రాఫిక్ జామ్ కాకూడదని.. బస్ డ్రైవర్‌గా మారిన బెంగళూరు ఏసీపీ!
బెంగళూరు: బెంగళూరులో బస్సు డ్రైవర్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామచంద్ర స్వయంగా బస్సు నడిపారు. అసలు ఏం జరిగిందంటే.. బెంగళూరులో విపక్ష పార్టీల సమావేశం జరిగింది. దీనికి వివిధ రాష్ట్రాల నుంచి విపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. వీవీఐపీల (ప్రతిపక్ష నేతల సమావేశం) షెడ్యూల్ కారణంగా ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డులో ట్రాఫిక్ నిర్వహణ బాధ్యతను ఏసీపీ రామచంద్ర చూసుకుంటున్నారు. అకస్మాత్తుగా రూట్ 330 డ్రైవర్ అస్వస్థతకు గురికావడంతో ఆ బస్సును రోడ్డుపైనే ప్రయాణికులతో సహా నిలిపివేశారు. తక్షణమే ఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ రామచంద్ర.. అనారోగ్యంతో ఉన్న ఆ డ్రైవర్‌ను బోవరింగ్ ఆసుపత్రికి తరలించి, వైద్య సహాయం అందించేలా అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. బస్సు రోడ్డుపై నిలిచిపోయిన కారణంగా ట్రాఫిక్ రద్దీకి కారణమయ్యే అవకాశం ఉందని గ్రహించి.. ఏసీపీ ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను స్వయంగా తానే తీసుకున్నారు. డ్రైవర్ సీటులో కూర్చుని బస్సును ఒక కిలోమీటరుకు పైగా నడుపుతూ కార్పొరేషన్ పార్కింగ్ ప్రదేశంలో బస్సును పార్క్ చేశారు. ఇదంతా బస్సులో ఉన్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏసీపీ స్పందించిన తీరుపై అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. Thank you for the care and compassion # LifeSaverCop @DgpKarnataka @CPBlr @alokkumar6994 @masaleemips @BlrCityPolice @blrcitytraffic @mybmtc@BMTC_BENGALURU #BMTC Small act of kindness, duty, compassion & respect for life is thy name of #NammaBengaluruPolice 👏 Contd 01 pic.twitter.com/LI0isc1NoX — Shubha Lakshmi (@Shubha_Lakshmi_) July 17, 2023 చదవండి ఆస్ట్రేలియా బీచ్‌లో చంద్రయాన్-3 రాకెట్ శకలం.. ఇస్రో చీఫ్ క్లారిటీ -
రామకృష్ణ హత్య కేసు.. కీలక విషయాలు వెల్లడించిన ఏసీపీ
సాక్షి, భువనగిరి: మాజీ హోంగార్డు రామకృష్ణ హత్య కేసులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. హత్య కేసుకు సంబంధించి భువనగిరి ఏసీపీ వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రామకృష్ణను మామ వెంకటేష్ హత్య చేయించారని తెలిపారు. లతీఫ్ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చి రామకృష్ణను హత్య చేయించాడని పేర్కొన్నారు. రామకృష్ణ హత్య కేసులో మొత్తం 11 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. గుండాల మండలానికి రామకృష్ణను తీసుకెళ్లి చంపినట్లు నిందితులు తెలిపారని చెప్పారు. లతీఫ్ గ్యాంగ్‌తో పాటు దివ్య, మహేష్, మహ్మద్ అప్సర్లను అరెస్ట్ చేశామని అన్నారు. భార్గవి తండ్రి వెంకటేష్ సుపారీ ఇచ్చి రామకృష్ణను చంపించారని వెల్లడించారు. రూ.10 లక్షల సుపారీ కోసమే ఈ హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని ఏసీపీ తెలిపారు. హోం గార్డ్ యాదగిరి, రాములుకు పరిచయం అయ్యాడని, అనంతరం రాములు లతీఫ్ గ్యాంగ్‌ను పరిచయం చేశాడని తెలిపారు. ఈ కేసులో అరెస్టైన 11 మందిలో నలుగురు నిందితులను రీమాండ్‌కు పంపించామని అన్నారు. మిగిలిన ఏడుగురిని మళ్లీ రీమాండ్ చేస్తామని ఏపీపీ పేర్కొన్నారు. -
జిల్లా కేంద్రంలో ఏసీపీ హల్చల్
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాకేంద్రంలో మంగళవారం రాత్రి 10 గంటల తర్వాత ఏసీపీ అఖిల్ మహజన్ ప్రధాన వీధుల్లో కాలినడకన తిరుగుతూ దుకాణాలు మూసివేయించారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు పాటించాలని, అర్ధరాత్రి వరకు దుకాణాలు తెరిచి ఉంచరాదని, గుంపులుగా తిరగరాదని హెచ్చరించారు. 10 దాటాక వ్యాపార సంస్థలు, హోటళ్లు, వైన్స్‌షాపులు తెరిచి ఉంటే చర్యలు తప్పవన్నారు. ఏ కారణం లేకుండా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని, జరిమానా విధిస్తామని తెలిపారు. ఆయన వెంట ఎస్సై కిరణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: ఆ దృశ్యం చూస్తే అయ్యో అనకుండా ఉండలేం -
గగన్ అగర్వాల్ హత్యకేసు: వెలుగులోకి కీలక విషయాలు
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురానికి చెందిన గగన్అగర్వాల్ హత్యకేసులో ఏసీపీ పురుషోత్తంరెడ్డి బుధవారం కీలక విషయాలు వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వనస్థలిపురంలో ఫిబ్రవరి 24 మిస్సింగ్ ఫిర్యాదు వచ్చిందన్నారు. ఫిబ్రవరి 18న కేసు నమోదు అయిందని, పూర్తి స్థాయిలో విచారాణ చేశామని తెలిపారు. విచారణలో నౌసిన్ బేగం గగన్‌ను హత్య చేసినట్లు ఒప్పుకుందని తెలిపారు. రెవెన్యూ అధికారులు, ఫోరెన్సిక్ టీంతో మృతదేహాన్ని బయటకు తీస్తున్నామని తెలిపారు. కత్తితో గొంతు, ముఖంపై విచక్షణా రహితంగా దాడి చేసిందని ఆయన పేర్కొన్నారు. దీంతో గగన్ అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. హత్యలో మరికొందరు పాలుపంచుకున్నట్లు అనుమానం ఉందని ఆయన తెలిపారు. పిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించడంతోనే హత్య జరిగి ఉండొచ్చని తెలిపారు. ఈ ఘటనపై ఆకాష్ అగర్వాల్ ఫిర్యాదు చేశారని, హత్య జరిగిన ఇంట్లో గగన్తో పాటు నౌసిన్ ఉండేవారని తెలిపారు. సునీల్ అనే వ్యక్తికి హత్యలో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందని ఆ దిశలో విచారణ చేస్తున్నామని ఏసీపీ అన్నారు. హత్యకు గురైన గగన్ అగర్వాల్ సోదరుడు ఆయుష్ మిట్టల్ మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరుడు గగన్ అగర్వాల్ హత్యను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. నౌసిన్ బేగాన్ని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలన్నారు. అసలు ఏరోజు నౌసిన్ బేగం పిల్లలు ఇంటికి వచ్చేవారు కాదని, ఇంటికే రానప్పుడు అసభ్యకరంగా నా సోదరుడు ఎలా ప్రవర్తిస్తాడని ప్రశ్నించారు. పూర్తి స్థాయిలో విచారణ చేయాలని, మొదటి నుంచి నౌసిన్ బేగంపై మాకు అనుమానం ఉందని తెలిపారు. నౌసిన్ బేగం ఇతర రాష్ట్రాలకు ఎందుకు పరారైందని ప్రశ్నించారు. గగన్ అగర్వాల్ హత్య కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మరెడ్డి అన్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. హత్యలో నౌసిన్‌కు సహకరించిన వ్యక్తులను గుర్తించాలన్నారు. చదవండి: భర్తను చంపేసి, ఇంట్లోనే పూడ్చిపెట్టిన భార్య -
ఏసీపీ జయరాం సస్పెన్షన్‌పై అధికారుల విచారణ
సాక్షి,హైదరాబాద్: వనస్థలిపురం ఏసీపీ జయరాం సస్పెన్షన్‌కు కారణమైన భూ వివాదంలో అధికారుల విచారణ కొనసాగుతోంది. బాధితులు డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో రాచకొండ సీపీ కార్యాలయం అధికారులు భూవివాదానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో విచారణా అధికారులు బాధితులతో కలిసి భూమిని పరిశీలించారు. బాచారం సర్వే నెంబర్ 73 నుంచి 101మధ్య సర్వే నెంబర్లలోని 412 ఎకరాల భూమిని పరిశీలించారు. ఔటర్ రింగు రోడ్డుకు ఆనుకొని ఉన్న ఈ భూమి వేల కోట్ల విలువ కలిగి ఉంది. సానా సతీష్ బినామీల ఆధీనంలో ఉన్న 412 ఎకరాల్లో వివాదం చోటు చేసుకుంది. ఇటీవల తప్పుడు కేసులు, బెదిరింపులతో భూమి స్వాధీనం చేసుకొని అక్రమంగా ఫెన్సింగ్ నిర్మాణం చేశారు. కమల ప్రియా ఆటో జనరల్ ఏజన్సీ పేరుతో ఈ వివాదాస్పద భూమిపై భారీ లోన్ కూడా తీసుకున్నారు. కోల్‌కతా ఫైనాన్స్ కంపెనీ నుంచి భారీగా రుణం తీసుకున్న సానా సతీష్ బినామీ కంపెనీ హైపొతికేషన్ పేరుతో ఆ భూముల్లో బోర్డ్ ఏర్పాటు చేశారు. గతంలో టెనెంట్స్‌కు, యజమానులకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ భూమి అసలు యజమానులు పూణేకు చెందిన రాజా ఆనందరావు కుంటుంబ సభ్యులు. దీంతో సాన సతీష్ డాక్యుమెంట్లు నకిలీ అని రంగారెడ్డి కోర్టులో ఆనందరావు వారసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇదే భూమిపై ప్రస్తుతం హైకోర్టులో మరో కేసు విచారణలో ఉంది. ఈ కేసు విషయంలో గతంలో తహశీల్దార్, వీఆర్ఓలపై సస్పెన్షన్ వేటు పడింది. విజయా రెడ్డి అనే తహశీల్దార్ దారుణ హత్యకు గురయ్యారు. ఇప్పుడు వనస్థలిపురం ఏసీపీ జయరాం సస్పెండ్ అయ్యారు. ఈ కేసుపై ప్రస్తుతం స్పెషల్ టీం అధికారులు సమగ్రంగా విచారణ చేస్తున్నారు. పూర్తిగా విచారిస్తే సానా సతీష్‌తో పాటు మరికొందరు పెద్దల పాత్ర ఉంటుందని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్పై వేటు అమీర్‌పేట: ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్.మురళీకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రేమించిన వ్యక్తి తనను మోసం చేశాడని న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళను ఏసీపీ జయరాం వద్దకు పంపించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడంలో కారకుడయ్యాడని నిర్ధారించిన ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేసినట్లు తెలిసింది. కాగా సానా సతీష్ భూ వివాదంలో ఇటీవల సస్పెన్షన్‌కు గురైన ఏసీపీ జయరాం కార్యాలయంలోనే ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు మురళీకృష్ణను సస్పెండ్ చేశారు. ఎస్ఆర్నగర్ నూతన ఇన్స్పెక్టర్గా నర్సింహారెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇబ్రహీంపట్నం భూములపై సీబీఐ విచారణ జరిపించాలి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అన్యాక్రాంతముతున్న ప్రభుత్వ భూముల విషయంలో ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాచారం భూ వివాదంతో పాటు ఓ ప్రైవేటు సంస్థ 500 ఎకరాల్లో ఫెన్సింగ్ వేసి కుంటలు, చెరువులను కబ్జా చేసిందని, ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన భూములు ప్రైవేటు పరం అయ్యాయన్నారు. ఈ విషయంలో స్థానిక ఎంఎల్ఏ ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. -
వనస్థలిపురం ఎసీపీ సస్పెన్షన్ కేసు దర్యాప్తు వేగవంతం
సాక్షి, హైదరాబాద్ : వనస్థలిపురం ఎసీపీ జయరాం సస్పెన్షన్ కేసులో దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు. బాధితులతో కలసి స్పెషల్ టీం సభ్యులు ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న స్థలాన్ని పరిశీలించారు. బాచారం సర్వే నెంబర్ 81నుంచి 200 మద్య లోని 400 ఎకరాలను అధికారులు పరిశీలించారు. సానా సతీష్ ఆదీనంలోని ఈ 147ఎకారాల్లోని వేలకోట్ల విలువైన భూమి వివాదంలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ భూమిపై కలకత్తా ఫైనాన్స్ కంపెనీ నుంచి సానా సతీష్ భారీగా రుణం తీసుకోగా.. కలకత్తా కంపెనీ హైపొతికేషన్ పేరుతో భూముల్లో బోర్డ్‌లు పాతారు. (కీసర ఇంచార్జ్ తహశీల్దార్‌గా గౌతమ్ కుమార్) అయితే టెనెంట్స్‌కు , యజమానులకు అనుకూలంగా కోర్టు తీర్పు అవ్వడంతో ఈ భూమి అసలు యజమానులు పూణేకు చెందిన రాజా ఆనందరావు కుటుంబం అని రుజువైంది. సానసతీష్ డాక్యుమెంట్లు నకిలీ అని రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులు ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇదే కేసులో గతంలో ఏమ్మార్వో ,వీఆర్వో సస్పెన్షన్.. విజయారెడ్డి అనే ఎమ్మార్వో దారుణ హత్య చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వనస్థలిపురం ఏసీపీ జయరాం సస్పెన్షన్‌తో పాటు తాజాగా సానాసతీష్ అనుచరులకు జయరాం సహకరిస్తున్నాడన్న ఆరోపణలతో ఏసీపీపై బాధితులు అధికారులకు పిర్యాదు చేశారు. (బయటపడుతున్న కీసర ఎమ్మార్వో అక్రమాలు) -
ఏసీపీ కుమార్ రిపోర్టింగ్
మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘మోసగాళ్లు’ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. కాజల్ అగర్వాల్, రుహాని సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వియామార్ ఎంటర్టైన్మెంట్, ఎ.వి.ఎ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై విరానికా మంచు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్ దర్శకుడు. ఈ సినిమాలో పవర్ఫుల్ సిక్కు పోలీసాఫీసర్‌గా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటిస్తున్నారు. ఆయన లుక్‌ను శనివారం విడుదల చేశారు. ఈ చిత్రంలో ఏసీపీ కుమార్ పాత్రలో ఆయన కనపడనున్నారు. అతిపెద్ద ఐటీ కుంభకోణం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. రేపటినుండి ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ జరగనుంది. వేసవిలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. -
తల్లి హత్య; ఏసీపీ ఔదార్యం
సాక్షి, చెన్నై : నేరస్తుల పట్ల కఠినంగా ప్రవర్తించడమే కాదు.. ఆదరణ కరువైన వారిని ఆదుకునే సున్నితమైన మనస్తత్వం కూడా పోలీసుల సొంతమని నిరూపించారు చెన్నైకి చెందిన ఏసీపీ బాలమురుగన్. తల్లిని కోల్పోయిన ఓ పన్నెండేళ్ల బాలుడిని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చి.. పెద్ద మనసు చాటుకున్నారు. అసలేం జరిగిందంటే... తమిళనాడుకు చెందిన పరిమళ ఓ నిరుపేద మహిళ. ఆమె కుమారుడు కార్తిక్ మైలపూర్‌లోని ఓ పాఠశాలలోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి తల్లి దగ్గర కొన్ని రోజులు ఉండేవాడు. ఈ క్రమంలో... పొరుగింటి వారితో పరిమళ గొడవ పడింది. దీంతో కోపోద్రిక్తుడైన పక్కింటి యజమాని సూర్య.. మూడు రోజుల క్రితం పరిమళను హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పరిమళ కొడుకు గురించి తెలుసుకున్న ఏసీపీ బాలమురుగన్.. అతడిని పోలీసు స్టేషనుకు పిలిపించారు. తల్లి హత్య విషయం చెప్పి... అతడిని ఓదార్చారు. దత్తత తీసుకునేందుకు నిర్ణయించుకుని.. తల్లి మరణించడంతో అనాథగా మారిన కార్తిక్ పరిస్థితి చూసి చలించిపోయిన బాలమురుగన్.. అతడికి అండగా నిలవాలని నిశ్చయించుకున్నారు. కార్తిక్ చదుకునే పాఠశాలకు వెళ్లి.. అతడి చదువుకయ్యే ఖర్చును తానే భరిస్తానని చెప్పారు. కానీ కేవలం ఆర్థిక సాయం మాత్రమే కార్తిక్‌కు ఓదార్పు కాదని.. అతడికి ఓ కుటుంబం ఉంటే బాగుంటుందని ఆలోచించారు. తన భార్య కళా రాణితో ఈ విషయం గురించి చర్చించారు. ఈ క్రమంలో ఏసీపీ దంపతులు.. కార్తిక్‌ను దత్తత తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన లీగల్ ప్రొసీడింగ్‌ను ప్రారంభించారు. పగ, ప్రతీకారాలకు అతడు దూరంగా ఉండాలి.. ‘తల్లి హత్యకు గురికావడంతో కార్తిక్ అనాథ అయ్యాడు. తన పరిస్థితి ఇలా కావడానికి పక్కింటి వ్యక్తే కారణమని.. అతడిపై పగ తీర్చుకోవాలని.. కార్తిక్ భావించే అవకాశం ఉంది. తను ఎంతో భవిష్యత్తు ఉన్నవాడు. అతడిని సన్మార్గంలో నడిపించాలనుకున్నాను. అందుకే నా భార్యతో కలిసి చర్చించి... కార్తిక్‌ను దత్తత తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. నా ఇద్దరు పిల్లలతో పాటుగా అతడికి విద్యాబుద్ధులు నేర్పిస్తానని’ బాలమురుగన్ వ్యాఖ్యానించారు. కాగా మానవత్వం చాటుకున్న బాలమురుగన్‌పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
మరకా? మరేం పర్వాలేదు
కొన్ని క్షణాలు తర్జనభర్జన పడి, ధైర్యంగా లేచి నిల్చుని సెల్యూట్ కొట్టారు మంజీత. అంత వరకు బాగానే ఉంది. ఆమె వెనుక చాలామంది అధికారులు ఉన్నారు. ఆమె కదిలితేనే గానీ వాళ్లు కదలడానికి లేదు. లేస్తే వాళ్ల కంట్లో మరక పడుతుంది. ఇదీ ఆమె సంకోచం. గోడలపై మరకలు ఉంటాయి. రోడ్లపై మరకలు ఉంటాయి. వాహనాలపై మరకలు ఉంటాయి. మరకలేని చోటు ప్రపంచంలో ఎక్కడా లేదు. అవన్నీ మనం పట్టించుకోం. అసలు మరక ఉన్నట్లుగానే గుర్తించం. అదే మరక ఒక మహిళ బట్టల మీద ఉంటే? ఆ మరకనూ మనం పట్టించుకోకపోవచ్చు.. కానీ ఆ మహిళ పట్టించుకుంటుంది. ఎవరైనా చూస్తున్నారేమోనన్న అనుమానంతో ఆమె కదలికలు ఇబ్బందిగా మారతాయి. అందులో ఆమె తప్పులేదు. ఆమె దేహధర్మం.. ఆమెకు అంటించిన మరక అది. నలుగురిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా పైకి కనిపించిన ఆ మర క ఆమెను నిలువెల్లా బిడియంతో కుంగిపోయేలా చేస్తుంది. ఆ క్షణంలో అక్కడి నుంచి తన మాయం అయిపోతే ఎంత బాగుండు అని కూడా అనుకుంటుంది. అహ్మదాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మంజీతకు కూడా ఇటీవల ఇలాంటి అనుభవమే ఎదురైంది. యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ ఆమె. ఆ రోజు అహ్మదాబాద్‌లో నేరాలపై పోలీసు అధికారుల సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఆ సదస్సు జరిగింది. మంజీత యూనిఫామ్‌లో ఉన్నారు. కుర్చీలో కూర్చొని ఉండగా అకస్మాత్తుగా ఆమె నెలసరి వచ్చినట్లు అర్థమైంది. పైగా అక్కడ తను ఒక్కరే మహిళా అధికారి. చుట్టూ అంతా పురుషులు. పైకి లేవాలన్నా ఇబ్బంది, అక్కడి నుంచి వెళ్లాలన్నా ఇబ్బందే. సాయంత్రం సదస్సు పూర్తయ్యేవరకు అలాగే కూర్చొని ఉన్నారు మంజీత. ప్రొటోకాల్ ప్రకారం పై అధికారికి సెల్యూట్ చేసే వంతు వచ్చింది. కొన్ని క్షణాలు తర్జనభర్జన పడి, ధైర్యంగా లేచి నిల్చుని సెల్యూట్ కొట్టారు మంజీత. అంతవరకు బాగానే ఉంది. ఆమె వెనుక చాలామంది అధికారులు ఉన్నారు. ఆమె కదిలితేనే గానీ వాళ్లు కదలడానికి లేదు. లేస్తే వాళ్ల కంట్లో మరక పడుతుంది. ఇదీ ఆమె సంకోచం. ‘‘అంతకుముందు ఇటువంటి సందర్భంలో నేను వెనకవైపు డైరీ కాని ఫైల్ కాని అడ్డు పెట్టుకుని నడిచేదాన్ని. ఇప్పుడు అలా చేయకూడదను కున్నాను.. ఏదైతే అదైందని ముందుకు నడిచేశాను. నా తోటి ఆఫీసర్లంతా మౌనంగా నా వెనక నడిచారు. కాని నా గన్‌మెన్ మాత్రం ‘మేడమ్ మీ బట్టల మీద మరక ఉంది’ అని చెప్పాడు. అందుకు నేను నవ్వుతూ, ‘ఇది మామూలే. ఏం పర్వాలేదు’ అని చెప్పి కారు ఎక్కేశాను’’ అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు మంజీత. ఆ తర్వాత ఆమె ఇదే విషయం తన కింది అధికారులకు కూడా చెప్పారు. విధులలో ఉండగా మహిళా సిబ్బందికి నెలసరి వస్తే వారికి కాస్త విశ్రాంతి ఇవ్వండి అని సలహా ఇచ్చారు. ‘‘ఒక మహిళగా ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడు నాకు ఆ మరకతో ఎలాంటి సమస్యా లేదు. ఎప్పుడైనా మరక కనిపిస్తే, నాకు చెప్పమని నా గన్‌మెన్‌కి చెప్పాను. ఇటువంటి మార్పు ప్రతి మహిళలోను రావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అన్నారు మంజీత వంజర. – రోహిణి -
మోడల్‌పై డీఐజీ అత్యాచారం ... కేసు నమోదు
ముంబై: తనపై ఐపీఎస్ అధికారి, డీఐజీ సునీల్ పరస్కర్ అత్యాచారం చేశారని ముంబైకి చెందిన ఓ మోడల్ నగర పోలీసులను ఆశ్రయించింది. దాంతో సునీల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ముంబై అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రమేష్ లోకరి గురువారం ముంబైలో వెల్లడించారు. గతంలో కూడా చాలా సార్లు తనపై సునీల్ అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొందని తెలిపారు. నగర శివారులలోని ఓ హోటల్లో సునీల్ తనపై వ్యవహారించిన తీరును కూడా ఆ ఫిర్యాదులో మోడల్ వివరించిందని రమేష్ చెప్పారు. ఐపీఎస్ అధికారి సునీల్ గత కొద్ది కాలం క్రితం వరకు అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ( ఉత్తర ప్రాంతం)గా పని చేసే వారని తెలిపారు. ప్రస్తుతం ప్రోటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యూనిట్స్ డిఐజీగా సునీల్ విధులు నిర్వర్తిస్తున్నారని రమేష్ చెప్పారు.