
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాకేంద్రంలో మంగళవారం రాత్రి 10 గంటల తర్వాత ఏసీపీ అఖిల్ మహజన్ ప్రధాన వీధుల్లో కాలినడకన తిరుగుతూ దుకాణాలు మూసివేయించారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు పాటించాలని, అర్ధరాత్రి వరకు దుకాణాలు తెరిచి ఉంచరాదని, గుంపులుగా తిరగరాదని హెచ్చరించారు. 10 దాటాక వ్యాపార సంస్థలు, హోటళ్లు, వైన్స్‌షాపులు తెరిచి ఉంటే చర్యలు తప్పవన్నారు. ఏ కారణం లేకుండా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని, జరిమానా విధిస్తామని తెలిపారు. ఆయన వెంట ఎస్సై కిరణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.