విమానం ఎగరలేదు.. తలుపులు లాక్
విశాఖపట్నం: విశాఖపట్నం విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానం సాంకేతికలోపం కారణంగా మూడు గంటల నుంచి నిలిచిపోయింది. ఇందులో ప్రముఖ నాయకులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. విమానంలో ఏసీ లేకపోవడంతో ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తారా లేదా అన్న విషయంపై యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు.
విమానం నుంచి దిగి బయటకు వెళ్లిపోదామన్నా తలుపులు లాక్ అయి ఉన్నాయి. లోపల ఉక్కబోత, ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది. ప్రయాణికుల్లో చాలామంది పెద్దవయసు వాళ్లు ఉన్నారు. సాధారణంగానే ఇక్కడ 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. అలాంటిది విమానంలో తలుపులు అన్నీ వేసేసి ఉన్నప్పుడు పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సాంకేతిక లోపం మాత్రమే అని అధికారులు చెబుతున్నారు. అయితే విమానం ఎగరకపోవడం, తలుపులు లాక్ కావడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయో లేదో కూడా చెప్పకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.