
జెట్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
భోపాల్: జెట్ విమానానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. స్పైస్జెట్ విమానం ఎస్జీ 2458 ల్యాండ్ అవుతుండగా ఓ జంతువు వచ్చి ఢీకొంది. పైలట్ జాగ్రత్తగా ల్యాండ్ చేసినప్పటికీ ముందు భాగం లోని గేర్ ధ్వంసమయింది. ముంబై నుంచి బయలుదేరిన జెట్ విమానం జబల్పూర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదని ఎయిర్ లైన్స్ అధికారి ఒకరు వెల్లడించారు. జెట్ విమానంలో 49 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది సహా 53 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు.