గోపాలపట్నం (విశాఖ) : ముంబై నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన ప్రయాణికులు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం అర్థరాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారు. కోల్‌కతాకు వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌కు చెందిన విమానం ముంబైలో శుక్రవారం రాత్రి బయలుదేరింది. అయితే కోల్‌కతాలో వాతావరణం అనుకూలించక భువనేశ్వర్‌కు మళ్లించారు. అక్కడ దిగేందుకు వీలుకాక పోవటంతో రాత్రి 11.30 గంటలప్రాంతంలో విశాఖ విమానాశ్రయంలో ల్యాండయింది. అందులోని సుమారు 180 మంది ప్రయాణికులకు స్థానికంగా వసతి కల్పించారు. ఇప్పటికీ కోల్‌కతాలో అనుకూల వాతావరణ పరిస్థితులు లేకపోవటంతో విమానం తిరిగి బయలుదేరలేదు. దీంతో వారంతా విశాఖలోనే ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.