'ఎయిర్ కోస్టా' ప్రయాణికుల పడిగాపులు | aircosta flight delayed | Sakshi

'ఎయిర్ కోస్టా' ప్రయాణికుల పడిగాపులు

Published Tue, Jun 21 2016 11:28 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

aircosta flight delayed

శంషాబాద్: హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్లాల్సిన ప్రయాణికులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్నారు. ఎయిర్ కోస్టా విమానం మంగళవారం ఉదయం 7 గంటలకు శంషాబాద్ నుంచి విశాఖ కు వెళ్లాల్సి ఉంది. అయితే విశాఖలో వాతావరణం అనుకూలంగా లేకపోవటంతో విమానాన్ని ఎయిర్ పోర్టు అధికారులు నిలిపివేశారు. దీంతో  నాలుగు గంటలుగా ప్రయాణికులు విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. వాతావరణం అనుకూలించిన వెంటనే సర్వీసును పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement