Salman Khan Smoking A Cigarette While Hosting Bigg Boss OTT Season 2 - Sakshi
Sakshi News home page

Salman Khan: లైవ్‌లోనే సిగరెట్ తాగిన సల్మాన్.. ఏంటీ బ్రో ఇది..!

Published Sun, Jul 9 2023 5:50 PM | Last Updated on Wed, Sep 6 2023 10:19 AM

Salman Khan Smoking A Cigarette While Hosting Bigg Boss OTT 2 - Sakshi

కండలవీరుడిగా అభిమానుల్లో పేరు సంపాదించుకున్న హీరో సల్మాన్ ఖాన్. ఇటీవలే కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ బిగ్ బాగ్‌ ఓటీటీ సీజన్-2కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 

(ఇది చదవండి: 'మనకు అలాంటి వారే ఉన్నారు.. హీరోయిన్ వివాదాస్పద కామెంట్స్‌')

అయితే బిగ్ బాస్ షోలో సల్మాన్ ఖాన్‌కు చెందిన ఓ ఫోటో తెగవైరలవుతోంది. కంటెస్టెంట్స్‌తో మాట్లాడుతూ ‍ఉండగా.. సల్మాన్ ఖాన్ సిగరెట్ పట్టుకున్న ఫోటో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. అంతే కాకుండా కొంతమంది హౌస్‌మేట్స్‌పై సల్మాన్ తీవ్రంగా కోప్పడినట్లు తెలుస్తోంది. దీంతో సల్మాన్ తీరుపై పలువురు నెటిజన్స్ మండిపడుతున్నారు. ఎంతోమంది అభిమానులకు ఆదర్శంగా ఉండే హీరో.. అందరికీ కనిపించేలా షోలో అలా చేయడమేంటని నిలదీస్తున్నారు. 

అసలు పొగ త్రాగడానికి అతన్ని షోలో ఎలా అనుమతించారని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం కావడం వల్లే నిబంధనలకు విరుద్ధం కాదని అంటున్నారు. కాగా.. సల్మాన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'టైగర్ -3' విడుదలకు సిద్ధమవుతోంది. అంతేకాకుండా సల్మాన్ 'కిక్ 2' కూడా లైన్‌లో ఉంది. అలాగే 'ప్రేమ్ కీ షాదీ' కోసం సూరజ్ బర్జాత్యాతో మళ్లీ కలిసి పనిచేయనున్నారు. 

(ఇది చదవండి: మీరు 'గే' కదా?.. ప్రముఖ డైరెక్టర్‌కు షాకిచ్చిన నెటిజన్! )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement