Salman Khan Planning To Quit Bigg Boss OTT 2 Due To Leaked Cigarette Pic Issue - Sakshi
Sakshi News home page

Salman Khan: ఒక్క సిగరెట్ ఎంత పనిచేసింది?

Published Mon, Jul 17 2023 9:24 PM | Last Updated on Wed, Sep 6 2023 10:19 AM

Salman Khan Quit Bigg Boss 2 OTT Cigarette Pic Issue - Sakshi

Salman Khan Bigg Boss OTT: బిగ్‌బాస్ షో అనగానే మనవాళ్లకు నాగార్జున గుర్తొస్తాడు. కానీ దేశవ్యాప్తంగా ఈ షో పేరు చెప్పగానే అందరికీ సల్మాన్ ఖాన్ గుర్తొస్తాడు. ఎందుకంటే గత కొన్ని సీజన్ల నుంచి హిందీలో ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా చేస్తున్నాడు. తనదైన యాంకరింగ్‌తో బిగ్‌బాస్‌కి బోలెడంత క్రేజ్‌ని తీసుకొచ్చాడు. కానీ ఈ మధ్య ఒక్క ఫొటో వల్ల సల్మాన్‌పై ఘోరంగా విమర్శలు వచ్చాయి.

హిందీలో ఇప్పటికే బిగ్‌బాస్ 16 సీజన్లు పూర్తయ్యాయి. అలానే ఓటీటీలో ప్రస్తుతం రెండో సీజన్ నడుస్తోంది. దీనికి సల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేస్తున్నాడు. అయితే కొన్నిరోజుల ముందు సల్మాన్ షో మధ్యలో స్టేజీపై చేతిలో సిగరెట్‌తో ఉన్న ఫొటో బయటకొచ్చింది. దీంతో అతడిని పలువురు నెటజన్స్ ఘోరంగా ట్రోల్ చేశారు. ఇవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.

(ఇదీ చదవండి: హీరోయిన్ తాప్సీ ప్రెగ్నెంటా? ఆమె రియాక్షన్ ఇదే!)

గత వీకెండ్ సల్మాన్ షోలో ఎక్కడా కనిపించలేదు. అతడి బదులు కృష్ణ అభిషేక్, భారతీ సింగ్ హోస్టింగ్ చేశారు. హౌస్‌మేట్స్‌తో పాటు వ్యూయర్స్ సల్మాన్ ఎందుకు లేడనేది అర్థం కాలేదు. అయితే సిగరెట్ ఫొటో బయటక రావడం వల్ల సల్మాన్‌పై విమర్శలు వచ్చాయి. దీనికి కారణమైన వాళ్లని తప్పించినా సరే సల్మాన్ మాత్రం హోస్ట్‌గా తప్పుకోవాలని డిసైడ్ అయ్యాడట. అందుకే వీకెండ్ రాలేదని అంటున్నారు.  

‍అయితే సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ నుంచి పూర్తిగా తప్పుకోలేదని, టీవీలో త్వరలో ప్రారంభమయ్యే 17వ సీజన్‌కి అతడే హోస్టింగ్ చేయబోతున్నాడని కూడా మరికొందరు అంటున్నారు. ఏదేమైనా సల్మాన్ ఖాన్.. ఇలా అందరూ చూస్తున్న షోలో సిగరెట్ తాగడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. పైన చెప్పిన విషయాలపై పూర్తి క్లారిటీ వస్తే గానీ అసలు విషయం తెలీదు.

(ఇదీ చదవండి: అలా చేస్తే కఠిన చర్యలు.. సల్మాన్ ఖాన్ మాస్ వార్నింగ్..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement