బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బిగ్ బాస్-2 ఓటీటీ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. దాదాపు నెల రోజులకు పైగా సాగిన రియాలిటీ షో సోమవారం ముగిసింది. ఈ సీజన్‌లో ఎల్విశ్ యాదవ్ విన్నర్‌గా నిలిచాడు. ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వచ్చిన ఎల్విశ్ యాదవ్ విన్నర్‌గా నిలవడం విశేషం. అయితే బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2 గ్రాండ్ ఫినాలే సందర్భంగా సల్మాన్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మనం చేసే ఏ పని అయినా సరే అవమానంగా, చిన్నదిగా భావించకూడదని అన్నారు.
(ఇది చదవండి: నా గురించి రాత్రింబవళ్లు ఆలోచించి డబ్బు వృథా చేసుకోకండి: కంగనా)
'బిగ్ బాస్ ఓటీటీ సీజన్- 2'లో కంటెస్టెంట్స్‌లో ఒకరైన పూజా భట్ గ్రాండ్ ఫినాలే సమయంలో ఎలిమినేట్ అయిన మొదటి వ్యక్తి. ఈ సందర్భంగా సల్మాన్ ఆమెను ప్రశంసించారు. హౌస్‌లో ఆమె ఉన్నప్పుడు టాయిలెట్‌లు, వాష్‌రూమ్‌లను శుభ్రంగా ఉంచడం పట్ల పూజాను కొనియాడారు. ప్రపంచంలోని ఏ పనిని చిన్నదిగా భావించకూడదని హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులకు సలహా ఇచ్చారు. అంతేకాకుండా తాను జైలు, పాఠశాలలో టాయిలెట్స్ శుభ్రం చేశానని గుర్తు చేసుకున్నారు.
'బిగ్ బాస్' గత సీజన్లలోని కంటెస్టెంట్లకు గుణపాఠం చెప్పేందుకు తానే స్వయంగా హోస్‌లోకి ప్రవేశించి టాయిలెట్లను శుభ్రం చేయాల్సి వచ్చిందని సల్మాన్ గుర్తు చేసుకున్నాడు. 'బిగ్ బాస్' హౌస్‌లోని వాష్‌రూమ్స్ సీజన్‌లో పూజ శుభ్రం చేసినట్లు తానెప్పుడూ చూడలేదన్నారు. కాగా.. కృష్ణజింకలను వేటాడిన కేసుతో పాటు హిట్ అండ్ రన్ కేసులో నిర్దోషిగా బయటపడే వరకు సల్మాన్ చాలా రోజులు జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: కుల విభేదాలకు కారణం రాజకీయ నాయకులే : నటుడు శరత్ కుమార్)
బిగ్ బాస్ OTT 2 గ్రాండ్ ఫినాలే
'బిగ్ బాస్ ఓటీటీ సీజన్- 2' గ్రాండ్ ఫినాలే ట్రోఫీ కోసం అభిషేక్ మల్హాన్, ఎల్విష్ యాదవ్ పోటీలో నిలవగా చివరికి ఎల్విష్ యాదవ్‌ను విన్నర్‌గా ప్రకటించారు. ఈ రియాలిటీ షో చరిత్రలో ట్రోఫీని గెలుచుకున్న మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అతను నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment