
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాల్టీ షో 'బిగ్ బాస్'. ఈ షో ఇప్పటికే 15 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే సల్మాన్ ఖాన్ ఈ షో కోసం పారితోషికం భారీగా తగ్గించుకున్నట్లు నెట్టింట్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ సీజన్ సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ షో ప్రారంభం కానుండగా.. మరీ సల్మాన్‌పై వస్తున్న ఊహగానాల్లో వాస్తవమెంతో తెలియాల్సి ఉంది.
(చదవండి: Kabhi Eid Kabhi Diwali Movie: వెంకటేష్-సల్మాన్ ఖాన్ సినిమా షురూ.. విలన్‌గా ?)
గతేడాది ఓటీటీ వేదికగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వచ్చిన బిగ్‌బాస్ పెద్దగా సక్సెస్ కాలేదు. ఆశించిన ఆదాయం రాబట్టడంలో మేకర్స్ విఫలమయ్యారు. దీంతో సల్మాన్ హోస్ట్‌గా ప్రసారమయ్యే రెగ్యులర్ షో బిగ్‌బాస్‌పైన ఆ ఎఫెక్ట్ పడినట్టుగా వార్తలు వస్తున్నాయి. స్పాన్సర్‌ల సంఖ్య భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో ప్రస్తుత సీజన్ కోసం ఈ కండల వీరుడు పారితోషికం భారీగా తగ్గించుకుంటున్నట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్-15 సీజన్‌లో 14 వారాల కోసం సల్మాన్ ఏకంగా రూ.350 కోట్లు తీసుకున్నారని టాక్. ప్రస్తుత సీజన్ బిగ్ బాస్- 16 అక్టోబర్ 1 నుంచి ప్రసారం కానుంది. ఈ షోలో పాల్గొనే వారిలో శివిన్ నారంగ్, మునావర్ ఫారూకీ, కనికా మాన్, ఫైసల్ షేక్ కంటిస్టెంట్లుగా హౌస్‌లో అడుగు పెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment