ప్రముఖ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఫ్లైట్ నుంచి దిగి వస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు. ఉన్నట్టుండి అతన్ని చితక్కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బాలీవుడ్ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు పునీత్ సూపర్ స్టార్(అసలు పేరు ప్రకాష్ కుమార్). తాజాగా అతన్ని ఓ విమాన ప్రయాణికుడు చితకబాదాడు. అసలేం జరిగిందో తెలియదు కానీ పునీత్ చితక్కొడుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
గతంలో కూడా పునీత్ సూపర్‌స్టార్‌తో సోషల్ మీడియా ఇన్‌ప్లూయన్సర్ ప్రదీప్ కూడా గొడవపడ్డారు. ఆ సమయంలో పునీత్‌ను చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా మరోసారి అదే ఘటన పునరావృతమైంది. అయితే ఇలాంటివి అతను కావాలనే చేస్తున్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Puneet Superstar removed from flight and beaten up again – Watch the video!#PuneetSuperstar #puneetsuperstar pic.twitter.com/ZJ7QSdyuJl
— Aristotle (@goLoko77) December 18, 2024
Comments
Please login to add a commentAdd a comment