ఒక్క వీడియోతో లక్షన్నర పొగొట్టుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్! | Bigg Boss OTT 2 Fame Abhishek Malhan Loses RS 1.5 Lakh | Sakshi
Sakshi News home page

Bigg Boss: సోషల్ మీడియాలో వీడియో చేశాడు.. దెబ్బకు రూ.లక్షన్నర పోయింది!

Published Mon, Oct 23 2023 3:55 PM | Last Updated on Mon, Oct 23 2023 4:24 PM

Bigg Boss OTT 2 Fame Abhishek Malhan Loses RS 1.5 Lakh - Sakshi

సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2 ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ యూట్యూబర్ అభిషేక్ మల్హాన్. ఇటీవలే తన సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తన జీవితంలో మొదటిసారి పెద్దమొత్తంలో నగదును వెంట తీసుకెళ్తున్నట్లు వీడియోలో వెల్లడించాడు.  రూ. 1.5 లక్షలతో ఐఫోన్ కొనాలనుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతని డబ్బులు గుర్తు తెలియని వ్యక్తులు కాజేశారు. 

(ఇది చదవండి: కావాలయ్యా సాంగ్‌.. తమన్నా స్టెప్పు చెండాలం అంటూ నటుడి విమర్శలు)

అభిషేక్ వీడియోలో మాట్లాడుతూ.. "నేను నా జీవితంలో ఇంత పెద్ద మొత్తంలో నగదును ఎప్పుడూ తీసుకువెళ్లలేదు. ఈ సమయంలో నా హృదయం బాధతో ఉప్పొంగిపోతోంది.  నా డబ్బు ఎలా పోయిందో  ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.   ఆ డబ్బులతో ఒక ఐఫోన్‌ని కొనుగోలు చేయాలనుకున్నా. కానీ ప్రస్తుతం ఆ నగదు నా వద్ద లేదు. డబ్బుతో జాగ్రత్తగా ఉండమని మా నాన్న చాలా సార్లు చెప్పారు. నేను ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటానని అనుకోలేదు. ఇది తలుచుకుంటే చాలా భయంగా ఉంది. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. ఇక నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నా" అంటూ పోస్ట్ చేశారు.

కాగా.. అభిషేక్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2లో మొదటి రన్నరప్‌గా నిలిచాడు. ప్రస్తుతం యూట్యూబర్‌గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా పోస్ట్‌లతో తన అభిమానులను అలరిస్తూ ఉంటాడు.

(ఇది చదవండి: బిగ్ బాస్‌ కంటెస్టెంట్‌కు బిగ్‌ షాక్.. షో మధ్యలోనే అరెస్ట్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement