బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2 విన్నర్ ఎల్విష్ యాదవ్‌కు బిగ్ షాక్ తగిలింది. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన ఎల్విష్ యాదవ్‌పై నోయిడా పోలీసులు కేసు నమోదు చేశారు. పాము విషంతో రేవ్ పార్టీలను నిర్వహించారని అతనిపై ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది.
నోయిడాలోని ఫామ్‌హౌస్‌ల్లో ఎల్విష్, ఇతర యూట్యూబర్లతో కలిసి పాములు, వాటి విషంతో వీడియోలు చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ పీపుల్ ఫర్ యానిమల్ (పీఎఫ్‌ఏ) సంస్థ అధికారి గౌరవ్ గుప్తా ఫిర్యాదు చేశారు. చట్టవిరుద్ధంగా రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నారని.. అంతే కాకుండా విదేశీ మహిళలతో పాటు పాము విషం, మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నారని గౌరవ్ ఆరోపించారు.
దీంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. అటవీ శాఖ అధికారులతో కలిసి సెక్టార్ -51 సెవ్రాన్ బాంక్వెట్ హాల్‌పై దాడి చేశారు. అక్కడే ఉన్న ఢిల్లీకి చెందిన రాహుల్, టిటునాథ్, జయకరన్, నారాయణ్, రవినాథ్ అనే ఐదుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 20 మిల్లీలీటర్ల పాము విషం, ఐదు నాగుపాములు, ఒక కొండచిలువ, రెండు రెండు తలల పాములు, ఒక ఎలుక పామును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులతో పాటు ఎల్విష్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా.. ఎల్విష్ యాదవ్ బిగ్ బాస్ OTT సీజన్ 2లో విన్నర్‌గా నిలిచాడు. అంతేకాకుండా ఊర్వశి రౌతేలాతో కలిసి 'హమ్ తో దీవానే' అనే మ్యూజిక్ వీడియోలో కనిపించాడు. అయితే పోలీసుల ఆరోపణలను ఎల్విష్ యాదవ్ ఖండించారు. ఇదంతా అసత్యమని.. అలాంటిదేం జరగలేదని కొట్టిపారేశాడు.
— Elvish Yadav (@ElvishYadav) November 3, 2023
All are allegations are proven wrong, Shame on these fake news agencies..
— Rao Sahab ( Parody) (@TeamRaoSahab) November 3, 2023
STOP DEFAMING ELVISH#ElvishYadav𓃵 #ElvishYadav pic.twitter.com/xoowRyDitY
Comments
Please login to add a commentAdd a comment