బిగ్‌బాస్ విన్నర్‌కు షాక్.. పోలీసుల అదుపులో యూట్యూబర్! | Bigg Boss OTT 2 Winner Elvish Yadav Arrested In Noida In Snake Venom Case | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్ విన్నర్‌కు షాక్.. పోలీసుల అదుపులో యూట్యూబర్!

Published Sun, Mar 17 2024 4:07 PM | Last Updated on Sun, Mar 17 2024 4:12 PM

Bigg Boss OTT 2 Winner Elvish Yadav Arrested In Noida In Snake Venom Case - Sakshi

వివాదాస్పద యూట్యూబర్, బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2 విజేత ఎల్విష్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాము విషం కేసులో నోయిడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసినట్లు నోయిడా డీసీపీ విద్యాసాగర్ మిశ్రా వెల్లడించారు. ఇవాళ అతన్ని కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ప్రస్తుతం ఎల్విశ్ యాదవ్ పోలీసులు కస్టడీలోనే ఉన్నారు. తాజాగా అతన్ని కోర్టుకు తీసుకెళ్తున్న వీడియోలో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

కాగా..గతేడాది గురుగ్రామ్, నోయిడాలోని రేవ్ పార్టీలకు పాము విషాన్ని సరఫరా చేసినట్లు ఆరోపణలు రావడంతో ఎల్విష్‌ను పోలీసులు ప్రశ్నించారు. అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో పాటు మరో ఐదుగురిని కూడా అరెస్టు చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను యూట్యూబర్ ఎల్వీశ్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఈ కేసులో తాను దోషిగా రుజువైతే కెమెరాలో బట్టలు విప్పి డ్యాన్స్ చేస్తానని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement